For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఘాటు అందాలతో కవ్విస్తోన్న ఐటం గర్ల్: రోడ్డుపై అలాంటి డ్రెస్‌తో.. స్ట్రక్చర్ చూసి తట్టుకోవడం కష్టమే

  |

  సోషల్ మీడియా పుణ్యమా అని ఎంతో మంది నటీమణులు సినిమాలు చేయకపోయినా.. నిత్యం ఫ్యాన్స్‌కు టచ్‌లోనే ఉంటున్నారు. ఈ క్రమంలోనే తమ అందచందాలతో మజాను పంచుతున్నారు. తద్వారా సినిమాలు చేయకున్నా వాళ్లను సంతృప్తి పరుస్తున్నారు. అలాంటి వారిలో మలైకా అరోరా ఒకరు. చాలా కాలం క్రితం సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. ఐటం గర్ల్‌గా పేరు తెచ్చుకుంది. ఇక, ఇప్పుడు టీవీ షోలకే పరిమితం అయిపోయింది. ఇలాంటి సమయంలో రోడ్డుపై ఘాటు అందాలతో కనువిందు చేసింది మలైకా. ఆ ఫొటోలపై మీరూ ఓ లుక్కేయండి!

  మోడలింగ్ నుంచి ఐటెం సాంగ్స్‌తో

  మోడలింగ్ నుంచి ఐటెం సాంగ్స్‌తో


  మోడల్‌గా కెరీర్‌ను ఆరంభించింది మలైకా అరోరా. ఈ క్రమంలోనే ఎన్నో ఈవెంట్లలో పాల్గొన్న ఆమె.. వ్యాపార ప్రకటనల్లో సైతం చేసింది. సరిగ్గా అప్పుడు బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ల దృష్టిలో పడింది. అలా సినిమాల్లోకి వచ్చినా అంతగా గుర్తింపును మాత్రం దక్కించుకోలేకపోయింది. అప్పుడే ఐటం గర్ల్‌గా మారి.. ‘ఛయ్య ఛయ్య..', ‘అనార్కలీ డిస్కో ఛాలీ', ‘మున్నీ బద్నామ్‌' వంటి సాంగ్స్ చేసింది.

  తెలుగులో ఇద్దరు హీరోలతో రచ్చ

  తెలుగులో ఇద్దరు హీరోలతో రచ్చ

  బాలీవుడ్‌లో వరుసగా సినిమాలు చేస్తున్న సమయంలోనే.. స్పెషల్ సాంగ్స్‌లోనూ చిందులేసింది మలైకా. అప్పుడే ఈ పాటల స్పెషలిస్టుగా పేరు తెచ్చుకుంది. అదే సమయంలో తెలుగులోకి సైతం ప్రవేశించింది. ఈ క్రమంలోనే సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన ‘అతిథి', పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సూపర్ డూపర్ హిట్ మూవీ ‘గబ్బర్ సింగ్‌'లో అదిరిపోయే ఐటం నెంబర్స్ చేసింది.

  సల్మాన్ తమ్ముడితో పెళ్లి... బ్రేకప్

  సల్మాన్ తమ్ముడితో పెళ్లి... బ్రేకప్

  వరుస ఆఫర్లతో ఫుల్ బిజీగా ఉన్న టైమ్‌లోనే మలైకా అరోరా.. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌ సోదరుడైన అర్భాజ్ ఖాన్‌ను పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత వీళ్లిద్దరూ కలిసి తొమ్మిదేళ్లు కాపురం చేశారు. ఈ క్రమంలోనే ఈ జంటకు ఇద్దరు పిల్లలు కూడా జన్మించారు. 2017లో వ్యక్తిగత కారణాలతో అర్భాజ్‌కు విడాకులిచ్చింది మలైకా. అప్పటి నుంచి చాలా కాలం ఒంటరిగా ఉంది.

  12 ఏళ్ల చిన్నోడైన హీరోతో డేటింగ్

  12 ఏళ్ల చిన్నోడైన హీరోతో డేటింగ్

  భర్తతో విడిపోయిన తర్వాత పూర్తి స్థాయిలో స్వేచ్చను అనుభవిస్తోంది మలైకా అరోరా. ఈ క్రమంలోనే బాలీవుడ్ స్టార్ హీరో, బోనీ కపూర్ మొదటి భార్య కుమారుడైన అర్జున్ కపూర్‌తో డేటింగ్ ప్రారంభించింది. అప్పటి నుంచి అతడితో సీక్రెట్‌గా బంధాన్ని కొనసాగిస్తోన్న ఈ బ్యూటీ.. ఆ తర్వాత అతడి ఫొటోను షేర్‌ చేస్తూ ‘అర్జున్ నావాడు' అని పోస్ట్‌ చేసి అసలు మేటర్‌ను లీక్ చేసింది.

  పెళ్లికి ముందే కలిసి రచ్చ చేస్తుంది

  పెళ్లికి ముందే కలిసి రచ్చ చేస్తుంది

  సీక్రెట్‌గా ఎఫైర్ కొనసాగించనంత కాలం పెద్దగా కనిపించని అర్జున్, మలైకా.. డేటింగ్ మేటర్ లీకైన తర్వాత మాత్రం రెచ్చిపోతోంది. ఈ క్రమంలోనే తరచూ కలిసి తిరగడం.. డిన్నర్ డేట్లకు వెళ్లడం.. హాలీడే ట్రిప్పులను ఎంజాయ్ చేయడం వంటి వాటితో వార్తల్లో నిలుస్తున్నారు. సోషల్ మీడియాలోనూ రచ్చ రచ్చ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వీళ్లు పెళ్లిపై పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

  దానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంది

  దానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంది

  కెరీర్ పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ.. మలైకా అరోరా తన ఫిట్‌నెస్‌కు ఎంతో ప్రాధాన్యం ఇస్తుంది. అందుకే నిత్యం వర్కౌట్లు చేయడంతో పాటు యోగా కూడా చేసింది. అదే సమయంలో సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉంటూ ఫ్యాన్స్‌కు సైతం సూచనలు చేస్తోంది. ఇక, కరోనా సమయంలో మరింత ఎక్కువ సలహాలు ఇస్తూ ఎంతో మందిని ఆరోగ్యవంతులుగా మార్చేస్తుంది.

  ఘాటు అందాలతో కవ్విస్తోన్న మలైకా

  ఘాటు అందాలతో కవ్విస్తోన్న మలైకా

  మలైకా అరోరా ప్రతిరోజూ జాగింగ్ చేస్తుంటుంది. ఈ క్రమంలోనే తాజాగా తన నివాసం దగ్గర రోడ్లపై పెంపుడు కుక్కతో కలిసి వాకింగ్‌కు వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో, ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఇందులో ఆమె ఎద అందాలతో కనువిందు చేస్తోంది. లేటు వయసులోనూ ఘాటుగా కనిపిస్తోంది. మరీ ముఖ్యంగా జిమ్‌వేర్‌లో పర్‌ఫెక్ట్ స్ట్రక్చర్‌తో మతి పోగొడుతోంది.

  English summary
  Fitness enthusiast Malaika Arora Jogging on the Roads of Mumbai with her pet dog. These Photos Gone Viral in Social Media. ఫిట్‌నెస్ ఫ్రీక్ మలైకా అరోరా ముంబై నగర రోడ్లపై తన పెంపుడు కుక్కతో కలిసి జాగింగ్ చేసింది. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X