ఎఫైర్‌పై హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు: వయసులో చిన్నోడే కానీ.. విడాకుల తర్వాత అలా చేయొద్దా అంటూ!

మిగిలిన చిత్ర పరిశ్రమలతో పోల్చుకుంటే బాలీవుడ్‌లో లవ్ ట్రాకులు అనేవి ఎక్కువగా కనిపిస్తుంటాయి. అక్కడి వాళ్లకు డేటింగ్‌లు, బ్రేకప్‌లు అనేవి సర్వసాధారణమైన విషయాలే. ఇప్పుడు కూడా బీ టౌన్‌లో ఎన్నో జంటలు సందడి చేస్తున్నాయి. అందులో మలైకా అరోరా.. అర్జున్ కపూర్‌ జోడీ మాత్రం చాలా కాలంగా హైలైట్ అవుతూనే ఉంది. దీనికి కారణం.. వీళ్లిద్దరికి భారీగా ఏజ్ గ్యాప్ ఉండడంతో పాటు ఆమెకు అంతకు ముందే పెళ్లై విడాకులు కూడా తీసుకోవడమే అన్న విషయం తెలిసిందే.

వీళ్లిద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా వయసులో చిన్నోడితో ఎఫైర్ నడపడంపై మలైకా అరోరా క్లారిటీ ఇచ్చింది. అసలామె ఏమని మాట్లాడిందో మీరే చూడండి!

మలైకా అలా.. అర్జున్ కెరీర్ ఇలా

మలైకా అలా.. అర్జున్ కెరీర్ ఇలా

మోడలింగ్ నుంచి సినిమాల్లోకి వచ్చిన మలైకా అరోరా నటిగా గుర్తింపును అందుకోలేదు. కానీ, 'ఛయ్య ఛయ్య..', 'అనార్కలీ డిస్కో ఛాలీ', 'మున్నీ బద్నామ్‌ హుయే' వంటి స్పెషల్ సాంగ్స్‌తో పాపులర్ అయింది. ఇక, బోనీ కపూర్ కొడుకుగా పరిచయం అయినా.. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు అర్జున్ కపూర్. ఈ క్రమంలోనే ఎన్నో హిట్ల స్టార్‌గా ఎదిగాడు.

ఇద్దరి మధ్య ప్రేమ... ప్రకటించి

ఇద్దరి మధ్య ప్రేమ... ప్రకటించి

అర్జున్ కపూర్.. నటి మలైకా అరోరా ప్రేమాయణం సాగిస్తున్న విషయం తెలిసిందే. మొదట్లో చాలా రహస్యంగా చెట్టాపట్టాలేసుకుని తిరిగిన వీళ్లిద్దరూ.. ఎన్నోసార్లు జంటగా కెమెరాలకు చిక్కారు. ఆ తర్వాత ఇది పెద్ద హాట్ టాపిక్ అవడంతో ఈ విషయాన్ని వాళ్లే బహిరంగంగానే ఒప్పుకున్నారు. అర్జున్ ఈ విషయాన్ని ఓ షోలోనే ప్రకటించాడు. మలైకా సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.

12 ఏళ్ల తేడా.. అయినా తగ్గట్లేదు

12 ఏళ్ల తేడా.. అయినా తగ్గట్లేదు


బాలీవుడ్ జంట అర్జున్ కపూర్.. మలైకా అరోరాతో డేటింగ్ చేసే విషయం దేశ వ్యాప్తంగా హైలైట్ అవడానికి కారణం.. వీళ్లిద్దరికీ వయసులో 12 ఏళ్ల తేడా ఉండడమే. అంతేకాదు, 45 ఏళ్ల మలైకా అరోరా.. భర్త అర్భాజ్ ఖాన్‌‌కు విడాకులు ఇచ్చింది. అలాగే, ఆమెకు ఓ అబ్బాయి కూడా ఉన్నాడు. అయినప్పటికీ అర్జున్‌తో డేటింగ్ చేస్తోంది. అందుకే ఈ జంట యమ ఫేమస్ అయిపోయింది.

 ఒకేచోట ఉంటూ ఎంజాయ్ చేసి

ఒకేచోట ఉంటూ ఎంజాయ్ చేసి


తమ బంధం బహిర్గతం అయిన తర్వాత మలైకా అరోరా, యంగ్ హీరో అర్జున్ కపూర్ మరింతగా రెచ్చిపోతోన్నారు. జంటగా ఉండేందుకు ముంబైలో ఓ విలాసవంతమైన ఇంటిని కూడా కొనుక్కున్నారు. అక్కడే కలసి ఎంజాయ్ చేస్తున్నారు. అంతేకాదు, ఈ విషయాన్ని కూడా వాళ్లే స్వయంగా చెప్పుకున్నారు. ఆ తర్వాత కలిసే పార్టీలు, పబ్బులను చుట్టేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.

యాక్సిడెంట్... మళ్లీ మొదలెట్టి

యాక్సిడెంట్... మళ్లీ మొదలెట్టి


ఇటీవలే ఓ ఫ్యాషన్ షోకు వెళ్లొస్తోన్న సమయంలో మలైకా అరోరా యాక్సిడెంట్‌కు గురైంది. ఈ ప్రమాదంలో మలైకా అరోరా ప్రయాణిస్తోన్న కారు ముందు భాగం బాగా డ్యామేజ్ అయిపోయింది. దీంతో ఆమెకు కూడా స్వల్ప గాయాలు అయ్యాయి. ఇక, చాలా రోజుల పాటు విశ్రాంతి తీసుకున్న తర్వాత మలైకా మరోసారి ముఖానికి మేకప్ వేసుకుని తన కార్యక్రమాలను మొదలెట్టేసింది.

అతడితో డేటింగ్ చేయకూడదా

అతడితో డేటింగ్ చేయకూడదా


తాజాగా మలైకా అరోరా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఇందులో అర్జున్‌తో రిలేషన్‌పై స్పందించింది. 'ఒక మహిళ వయసులో చిన్నోడితో డేటింగ్ చేయకూడదా? విడాకుల తర్వాత మరో జీవితాన్ని క్రియేట్ చేసుకోకూడదా? దీన్ని సమాజం ఎందుకు తప్పుగా చూస్తోంది? నా విషయంలో ఇదే జరుగుతోంది. కానీ, నేను మాత్రం అతడితో బంధం కోసం ఇవేమీ పట్టించుకోను' అని చెప్పింది.

 మా అమ్మే నాకు ఆదర్శం అని

మా అమ్మే నాకు ఆదర్శం అని


తన డేటింగ్‌పై వస్తున్న విమర్శలను లైట్ తీసుకున్న మలైకా అరోరా.. సమాజాన్ని పట్టించుకోకుండా బతకడానికి అమ్మే ఆదర్శం అని చెప్పింది. 'ఓ సందర్భంలో మా అమ్మ నీకిష్టమైనట్లు జీవించు. ఎవరినీ పట్టించుకోవద్దు. నీకు ఏది చేయాలనిపిస్తే అది మనస్ఫూర్తిగా చేసేయ్ అని చెప్పింది. నేనిప్పుడు అదే ఫాలో అవుతున్నాను' అంటూ ఈ బాలీవుడ్ బ్యూటీ వివరించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X