మరణానికి ముందు మలైకా అరోరాకు ఫోన్.. చివరి క్షణంలో ఆమెకు తండ్రి ఏం చెప్పాడో తెలుసా?
బాలీవుడ్ నటి మలైకా అరోరా తండ్రి అనిల్ మెహతా ఆత్మహత్య హిందీ సినిమా వర్గాల్లో సంచలనం రేపింది. ఈ మరణ వార్త వినగానే పలువురు సెలబ్రిటీ తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యారు. విషాదంలో ఉన్న మలైకా అరోరా, అమృతా అరోరాను స్నేహితులు, సన్నిహితులు, కుటుంబ సభ్యులు సంతాపం తెలియజేస్తున్నారు. అయితే తన మరణానికి ముందు అనిల్ మెహతా తన కూతుళ్లతో మాట్లాడారనే విషయం మరింత భావోద్వేగానికి గురి చేసింది. ఆ వివరాల్లోకి వెళితే..
మలైకా అరోరా మారు తండ్రి అనిల్ మెహతా (62) సంవత్సారు. బాంద్రాలోని ఓ అపార్ట్‌మెంట్‌లోని ఆరవ ఫ్లోర్‌లో నివాసం ఉంటున్నారు. అయితే మంగళవారం ఉదయం ఆయన తన ఫ్లాట్‌లో నుంచి దూకి ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేసింది. ఈ దుర్వార్త వినగానే బాంద్రా పోలీసులు, క్రైమ్ బ్రాంచ్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొన్నారు. ఈ ఘటన జరిగిన సమయంలో తల్లి కూడా ఇంట్లోనే ఉన్నారని పోలీసులు తెలిపారు.

అనిల్ మెహతా పార్థీవ దేహానికి పంచనామా చేసిన తర్వాత ఆయన బాడీని పోస్ట్ మార్టమ్‌కు పంపించారు. ప్రాథమికంగా ఈ మరణాన్ని ఆత్మహత్యగా స్వీకరించారు. అయితే మా దర్యాప్తు ప్రకారం ఎలాంటి అనుమానాలు లేవు. అందుకే సూసైడ్ కేసుగా నమోదు చేశామని డీసీపీ తిలక్ రాజ్ రోషన్ తెలిపారు. అలాగే పోలీసులు, ఫొరెన్సిక్ అధికారులు పలు కోణాల్లో ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు.
అయితే తాను మరణించాలని నిర్ణయించుకొన్న తర్వాత ఇద్దరు కూతుళ్లకు ఫోన్ చేశారనే విషయం తాజాగా బయటకు వచ్చింది. పూణేలో ఉన్న మలైకా అరోరాతోను అలాగే ముంబైలో ఉన్న అమృతా అరోరాతో ఆయన మాట్లాడుతూ.. ఈ జీవిత పోరాటంలో అలసిపోయాను. ఇక ఈ మానసిక క్షోభను భరించలేను అని ఆయన తన కూతుళ్లతో పంచుకొన్నట్టు తెలిసింది.

కాగా, తన తండ్రిని కోల్పోయిన మలైకా అరోరాకు బాలీవుడ్ ప్రముఖులు మానసిక ధైర్యాన్ని అందిస్తున్నారు. ఈ వార్త తెలిసిన వెంటనే ఆమె ఇంటికి అర్బాజ్ ఖాన్, అనిల్ కపూర్ లాంటి ప్రముఖులు వచ్చి పరామర్శించారు. ఆమెకు అవసరమైన సహాయాన్ని అందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











