twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    దిమ్మతిరిగేలా మలైకా ఆసనం.. ఇన్స్‌టాలో ఆరోగ్య చిట్కాలు.. దీనివల్ల ఎలాంటి మేలంటే!

    |

    బాలీవుడ్‌లో అత్యధికంగా ఫిట్‌నెస్ కలిగిన స్టార్స్‌లో మలైకా అరోరా ఒకరంటే ఎలాంటి సందేహాం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. తన శారీరక, మానసిక ఆరోగ్యం, ఫిట్‌నెస్ కోసం క్రమం తప్పకుండా వర్కవుట్లు, ఆసనాలు, యోగా, మెడిటేషన్ లాంటివి ప్రాక్టీస్ చేస్తుంటారు. తాజాగా తన ఇన్స్‌టాగ్రామ్‌లో ఫిట్‌నెస్ పాఠాలు చెబుతూ.. ఓ ప్రధానమైన ఆసనం గురించి, దాని వల్ల కలిగే మేలు గురించి వివరించారు. మలైకా చెప్పిన ఆరోగ్య చిట్కాలు గురించి..

    తన విల్లును వంచేసి

    తన విల్లును వంచేసి

    మలైకా తన శరీరారాన్ని విల్లులా వంచేసి చేసిన ఆసనానికి సంబంధించిన ఫోటోను ఇన్స్‌టాగ్రామ్‌లో షేర్ చేసి.. నేను కనిపించకుండా పోయానని మీరు అనుకొంటున్నారేమో. ప్రతీ ఒక్కరికి తమకంటూ వ్యక్తిగతంగా ఓ జీవితం ఉండాలి. లాక్‌డౌన్‌ మనల్ని ఇంట్లోని అందరితో కలిపేసింది. ఈ లాక్ డౌన్ సమయంలో మీరు ఏం చేశారని చాలా మంది అడుగుతున్నారు. ప్రతీ రోజు నేను వర్కవుట్లతో బిజీగా గడిపాను అని మలైకా చెప్పారు.

    లాక్‌డౌన్‌లో ఎలాంటి పనులంటే

    లాక్‌డౌన్‌లో ఎలాంటి పనులంటే

    మీకు కోసం నేను నా ఆసనాలకు సంబంధించిన వివరాలను వెల్లడించాలని అనుకొన్నాను. వారం గడిచిన తర్వాత సోమవారం నుంచి ఏం చేయాలనే సందిగ్దంలో ఉండే వారందరికీ ఈ శారీరక విన్యాసాన్ని అందిస్తున్నాను. మీ శరీరాన్ని, కండరాలను ఇలా వంచి ఆరోగ్యాన్ని మరింత మెరుగు చేసుకోండి అని మలైకా సూచించారు.

    నాకు ఇష్టమైన హలాసనం గురించి

    నాకు ఇష్టమైన హలాసనం గురించి

    నాకు ఇష్టమైన హలాసనాన్ని ఎలా వేయాలో మీకు చెబుతాను. దీని వల్ల శరీరానికి ఎలాంటి ఉపయోగాలు కలుగుతాయి. మీ శరీరంలోని విష పదార్థాలను కరిగించేసి ఎలాంటి మేలు చేస్తుందనే విషయాన్ని చెప్పాలనుకొంటున్నాను. ఈ ఆసనం, మైండ్, బాడీని చాలా ప్రశాంతంగా మార్చి వేస్తుంది అని చెప్పారు.

    Recommended Video

    #CineBox : Taapsee Pannu Confirms Mithali Raj Biopic !
    హలాసనం టిప్స్ గురించి

    హలాసనం టిప్స్ గురించి

    హలాసనంను చాలా జాగ్రత్తగా వేయాల్సి ఉంటుంది. ఈ ఆసనాన్ని ఎలా వేయాలంటే..
    భూమిపై వెలకిల్లా పడుకోని.. చేతులను గ్రౌండ్‌కు చూపించేలా పెట్టాలి
    బిగపట్టి ఊపిరి తీసుకొని చేతులతో ఫ్లోర్‌ను అదిమి పట్టాలి. పైన ఉండే సీలింగ్‌ వైపు కాళ్లను లేపాలి
    నీ బాడీకి సపోర్టుగా ఉండేందుకు చేతులను వెనుకకు అదిమి పట్టాలి.
    ఒకవేళ బాడీ బ్యాలెన్స్ కోల్పోతే కాళ్లను కాస్త వంచి పెట్టవచ్చు.
    మెళ్లగా మీ కాళ్లను భూమికి తాకించాలి. ఆ తర్వాత నెమ్మదిగా శ్వాసను బయటకు వదలాలి.
    ఆ తర్వాత మెల్లగా చేతులను వెనుక నుంచి భూమికి ఆనించిన కాళ్ల వైపు తీసుకురావాలి అని మలైకా ఈ ఆసనం వేసే విధాన్ని చక్కగా వివరించారు. ఈ ఆసనం వల్ల నాడీ వ్యవస్థ పనితీరును మెరుగు పరుస్తుంది. శరీరంలోని మలినాలను బయటకు పంపుతుందని తెలిపారు.

    English summary
    Bollywood star Malaika Arora shared Halasana poster in her Instagram account. She revealed her fitness lessons and Tips about Halasana.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X