రోడ్డు మీదే ఊహించని పని చేసిన టాలీవుడ్ ఐటమ్ గర్ల్: పబ్లిక్ ప్లేస్‌లో ఆ పనులు చేయొచ్చా అంటూ దారణంగా!

పలు సినిమాల్లో నటించి, నర్తించినప్పటికీ ఆ రంగంలో అంతగా గుర్తింపును దక్కించుకోలేకపోయింది హాట్ బ్యూటీ మలైకా అరోరా. సుదీర్ఘమైన కెరీర్‌లో ఆమె సినిమాల పరంగా కంటే వ్యక్తిగత విషయాల వల్లే హైలైట్ అవుతూ వచ్చింది. ఇక, కొన్నేళ్లుగా ఆమె వ్యవహరిస్తోన్న తీరు వివాదాస్పదం అవుతోంది. తన కంటే చిన్న వాడితో డేటింగ్ చేయడంతో పాటు హాట్ హాట్ వర్కౌట్ల కారణంగా విమర్శలను ఎదుర్కొంటోంది. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా మలైకా రోడ్డు మీదే ఊహించని పని చేసింది. ఆ వీడియో వైరల్ అవడంతో నెటిజన్ల నుంచి ట్రోల్స్ ఎదుర్కొంటోంది. ఆ వివరాలు మీకోసం!

ఇద్దరు హీరోలతో.. టాలీవుడ్ ఐటమ్ గర్ల్‌గా

ఇద్దరు హీరోలతో.. టాలీవుడ్ ఐటమ్ గర్ల్‌గా

మోడల్‌గా కెరీర్‌ను ఆరంభించి.. ఆ తర్వాత బాలీవుడ్‌లో నటిగా పరిచయం అయింది మలైకా అరోరా. కానీ, ఆమెకు అంతగా గుర్తింపు దక్కలేదు. అయితే, స్పెషల్ సాంగ్స్‌తో మాత్రం రచ్చ చేసింది. హిందీలో 'ఛయ్య ఛయ్య..', 'అనార్కలీ డిస్కో ఛాలీ..', 'మున్నీ బద్నామ్‌ హుయే' వంటివి చేసిన ఆమె.. తెలుగులో 'అతిథి'తో మహేశ్‌తో, 'గబ్బర్ సింగ్‌'లో పవన్‌‌తో అదిరిపోయే స్టెప్పులు వేసింది.

స్టార్ హీరో తమ్ముడితో పెళ్లి... విడాకులతో

స్టార్ హీరో తమ్ముడితో పెళ్లి... విడాకులతో

కెరీర్ పరంగా ఫుల్ బిజీగా ఉన్న టైమ్‌లోనే మలైకా అరోరా.. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌ సోదరుడైన అర్భాజ్ ఖాన్‌ను పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత వీళ్లిద్దరూ కలిసి తొమ్మిదేళ్లు కాపురం చేశారు. ఈ క్రమంలోనే ఈ జంటకు ఇద్దరు పిల్లలు కూడా జన్మించారు. 2017లో వ్యక్తిగత కారణాలతో అర్భాజ్‌కు విడాకులిచ్చింది మలైకా. అప్పటి నుంచి కొద్ది రోజుల పాటు ఒంటరిగానే జీవించింది.

12 ఏళ్ల చిన్నవాడైన స్టార్ హీరోతో డేటింగ్

12 ఏళ్ల చిన్నవాడైన స్టార్ హీరోతో డేటింగ్

విడాకుల తర్వాత పూర్తి స్థాయిలో స్వేచ్చను అనుభవిస్తోంది ముదురు భామ మలైకా అరోరా. ఈ క్రమంలోనే బాలీవుడ్ స్టార్ హీరో, బోనీ కపూర్ మొదటి భార్య కుమారుడైన అర్జున్ కపూర్‌తో డేటింగ్ ప్రారంభించింది. అప్పటి నుంచి అతడితో సీక్రెట్‌గా బంధాన్ని కొనసాగిస్తోన్న ఈ బ్యూటీ.. ఆ తర్వాత అతడి ఫొటోను షేర్‌ చేస్తూ 'అర్జున్ నావాడు' అని పోస్ట్‌ చేసి మేటర్ రివీల్ చేసేసింది.

పెళ్లికి ముందే కాపురం... తరచూ హైలైట్

పెళ్లికి ముందే కాపురం... తరచూ హైలైట్


సీక్రెట్‌గా ఎఫైర్ కొనసాగించనంత కాలం పెద్దగా కనిపించని అర్జున్, మలైకా.. డేటింగ్ మేటర్ లీకైన తర్వాత మాత్రం రెచ్చిపోతోంది. ఈ క్రమంలోనే తరచూ కలిసి తిరగడం.. డిన్నర్ డేట్లకు వెళ్లడం.. హాలీడే ట్రిప్పులను ఎంజాయ్ చేయడం వంటి వాటితో వార్తల్లో నిలుస్తున్నారు. సోషల్ మీడియాలోనూ రచ్చ రచ్చ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వీళ్లు పెళ్లిపై పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

Recommended Video

Ranbir Kapoor Finally Calls Alia Bhatt His Girlfriend, Opens Upon Marriage
ఏకంగా ఇంటికి తీసుకెళ్లడంతో పుకార్లు

ఏకంగా ఇంటికి తీసుకెళ్లడంతో పుకార్లు

మలైకా అరోరా.. ఇటీవల అర్జున్ కపూర్‌తో కలిసి తన తల్లి ఇంటికి వెళ్లింది. ఒకే కారులో కలిసి వెళ్లిన వీళ్లిద్దరూ.. అక్కడ చాలా సమయం గడిపారు. వీళ్ల వెంట మలైకా కుమారుడు, ఆమె సోదరి కూడా ఉన్నారు. ఇదిలా ఉండగా, తన తల్లి ఇంటికి మొదటిసారి అర్జున్ కపూర్‌ను తీసుకెళ్లడంతో.. పెళ్లి గురించిన చర్చలు జరిపారన్న టాక్ బాలీవుడ్ వర్గాల్లో జోరుగా ప్రచారం జరిగింది.

రోడ్డు మీదే ఊహించని పని చేసిన బ్యూటీ

రోడ్డు మీదే ఊహించని పని చేసిన బ్యూటీ

ఫిట్‌నెస్ అంటేనే మలైకా.. మలైకా అంటేనే ఫిట్‌నెస్ అనేంతగా.. తరచూ వర్కౌట్స్ చేస్తూ కనిపిస్తోందీ బాలీవుడ్ బ్యూటీ. ఎప్పుడు చూసినా జిమ్‌లోనే, ఇంట్లోనే ఆసనాలు చేస్తూ కనిపిస్తోంది. దీంతో ఈమెను చాలా మంది ఆదర్శంగా తీసుకుంటున్నారు. ఇలాంటి సమయంలో మలైకా అరోరా రోడ్డు మీదే జాగింగ్ చేస్తూ కనిపించింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారిపోయింది.

పబ్లిక్ ప్లేస్‌లో అలాంటివి చేయొచ్చా అంటూ

పబ్లిక్ ప్లేస్‌లో అలాంటివి చేయొచ్చా అంటూ

మలైకా అరోరా బాంద్రాలోని రోడ్లపై సర్వేష్‌ శశితో జాగింగ్ చేసింది. ఈ వీడియో బయటకు రావడంతో ఆమెపై విమర్శలు వస్తున్నాయి. 'జాగింగ్ చేసుకోడానికి పార్కులు లేవా? అయినా పబ్లిక్ ప్లేస్‌లో అలాంటి పనులు చేయొచ్చా? నువ్వు జనాల దృష్టిలో పడడానికే రోడ్ల మీదుకు వచ్చావా? నీకు పనీ పాట లేదా' అంటూ నెటిజన్లు ఆమెపై విరుచుకు పడుతూ ట్రోల్ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X