For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  బాడీలోని ఆ పార్టును చూపించిన టాలీవుడ్ ఐటమ్ గర్ల్: ముసలిదానివి అయ్యావంటూ దారణంగా!

  |

  మోడల్‌గా కెరీర్‌ను ఆరంభించి.. నటిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది బాలీవుడ్ బ్యూటీ మలైకా అరోరా. సుదీర్ఘ కాలంలో చేసింది తక్కువ సినిమాలే అయినా.. దేశ వ్యాప్తంగా పాపులర్ అయిందీ భామ. వ్యక్తిగత విషయాల కారణంగానే ఆమె ఇంతటి గుర్తింపును తెచ్చుకుంది. కెరీర్ పరంగా పెద్దగా ఫేమస్ కాలేకపోయిన ఈ అమ్మడు.. భర్తతో విడాకులు తీసుకోవడం.. యంగ్ హీరోతో ప్రేమాయణం వల్ల తరచూ వార్తల్లో నిలుస్తూనే ఉంది. ఇక, తాజాగా తన బాడీలోని ఓ పార్టును పొరపాటున చూపించింది. దీంతో ఆమెకు చేదు అనుభవం ఎదురైంది. ఆ వివరాలు మీకోసం!

  పూనమ్ భజ్వా కొత్త లుక్ మాములుగా లేదు (ఫొటోలు)

  మహేశ్... పవన్‌తో స్పెషల్ సాంగ్స్ చేసింది

  మహేశ్... పవన్‌తో స్పెషల్ సాంగ్స్ చేసింది

  నటిగా కొన్ని చిత్రాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించింది ముదురు భామ మలైకా అరోరా. అదే సమయంలో చాలా సినిమాలకు స్పెషల్ సాంగ్స్ చేసింది. ‘ఛయ్య ఛయ్య..', ‘అనార్కలీ డిస్కో ఛాలీ..', ‘మున్నీ బద్నామ్‌ హుయే' వంటి హిందీ పాటలకు మంచి స్పందన వచ్చింది. ఇక, తెలుగులో ‘అతిథి'తో మహేశ్ బాబుతో, ‘గబ్బర్ సింగ్‌'లో పవన్‌ కల్యాణ్‌తో అదిరిపోయే స్టెప్పులు వేసింది.

  సల్మాన్ సోదరుడితో వివాహం.. విడాకులు

  సల్మాన్ సోదరుడితో వివాహం.. విడాకులు

  నటిగా, ఐటం గర్ల్‌గా ఫుల్ బిజీగా ఉన్న సమయంలో మలైకా అరోరా.. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌ సోదరుడు అర్భాజ్ ఖాన్‌ను వివాహం చేసుకుంది. ఆ తర్వాత వీళ్లిద్దరూ కలిసి తొమ్మిదేళ్లు కాపురం చేశారు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా జన్మించారు. 2017లో వ్యక్తిగత కారణాలతో అర్భాజ్‌కు విడాకులిచ్చింది మలైకా. అప్పటి నుంచి కొద్ది రోజుల పాటు ఒంటరిగానే జీవించింది.

  పన్నెండేళ్ల చిన్నవాడైన స్టార్ హీరోతో డేటింగ్

  పన్నెండేళ్ల చిన్నవాడైన స్టార్ హీరోతో డేటింగ్

  భర్తతో విడాకులు తీసుకున్న కొన్నేళ్లకే మలైకా అరోరా.. బాలీవుడ్ స్టార్ హీరో, బోనీ కపూర్ మొదటి భార్య కుమారుడైన అర్జున్ కపూర్‌తో డేటింగ్ ప్రారంభించింది. అప్పటి నుంచి అతడితో బంధాన్ని కొనసాగిస్తోన్న ఈ అమ్మడు.. ఆ తర్వాత సోషల్ మీడియాలో అర్జున్‌ కపూర్ ఫొటోను షేర్‌ చేస్తూ ‘అర్జున్ నావాడు' అని పోస్ట్‌ చేసింది. అనంతరం అతడు కూడా బంధాన్ని బయట పెట్టాడు.

  పెళ్లికి ముందే ఒకే ఇంట్లో కాపురం... పుకార్లు

  పెళ్లికి ముందే ఒకే ఇంట్లో కాపురం... పుకార్లు

  రహస్యంగా ఎఫైర్ కొనసాగించనంత కాలం పెద్దగా కనిపించని అర్జున్, మలైకా.. విషయం రివీల్ అయిన తర్వాత మాత్రం రెచ్చిపోతోంది. ఈ క్రమంలోనే తరచూ కలిసి తిరగడం.. డిన్నర్ డేట్లకు వెళ్లడం.. హాలీడే ట్రిప్పులను ఎంజాయ్ చేయడం వంటి వాటితో వార్తల్లో నిలుస్తున్నారు. సోషల్ మీడియాలోనూ రచ్చ రచ్చ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వీళ్లు పెళ్లిపై పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

  ఆ పార్టును చూపించిన టాలీవుడ్ ఐటమ్ గర్ల్

  ఆ పార్టును చూపించిన టాలీవుడ్ ఐటమ్ గర్ల్

  బాలీవుడ్‌లోని హీరోయిన్లు అందరిలో మలైకా అరోరానే ఎక్కువగా ఫిట్‌నెస్‌పై దృష్టి సారిస్తుందన్న విషయం ఆమెను ఫాలో అయ్యే వారికి తెలుసు. ప్రతిరోజూ జిమ్‌కు వెళ్తూ.. ఇంట్లో యోగా చేస్తుంటుంది. ఇటీవల జిమ్‌కు వెళ్తోన్న సమయంలో తన పొట్ట భాగం కనిపించేలా డ్రెస్ వేసుకుంది. దీంతో ఆ భాగంలో చర్మం ముడతలు పడినట్లు కనిపించడంతో ఈ ఫొటోలు వైలర్ అయ్యాయి.

  ముసలిదానివి అయ్యావంటూ దారణంగా...

  ముసలిదానివి అయ్యావంటూ దారణంగా...

  ఈ ఫొటోలను మలైకా ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పెట్టుకుంది. దీంతో ఆమెను ట్రోల్ చేస్తూ కొంత మంది ‘ముసలిదానిలా ఆ ముడతలేంటి' అంటూ కామెంట్లు పెట్టారు. దీంతో ఇది చర్చనీయాంశం అయింది. మరోవైపు, ‘ఇద్దరు పిల్లలకు తల్లైన మలైకాకు ముడతలు ఉండడం సహజం. మీ ఇంట్లో వాళ్లకూ అలాగే ఉంటాయి' అంటూ ఆమెను ట్రోల్ చేసిన వారిపై ఫైర్ అవుతున్నాయి మహిళా సంఘాలు.

  Adipurush Update From Prabhas | Filmibeat Telugu
  English summary
  Malaika Arora is popular for setting fitness goals for her fans with her social media posts, however, recently, the actor came under fire when she was snapped by photographers in Mumbai after her workout session.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X