Don't Miss!
- News చేతిలో చెంబు ఎందుకు పెట్టావ్, లోక్ సభ ఎన్నికల్లో చెంబు రాజకీయాలు, దెబ్బకు వైరల్ !
- Technology Lava ProWatch లావా ప్రోవాచ్ డిజైన్, ధర వివరాలు లీక్.. ఫంక్షన్ కీ సహా కీలక హెల్త్ ట్రాకర్లు..!!
- Sports ముక్కలవుతున్న ముంబై.. హార్దిక్‌ను విమర్శిస్తూ నబీ పోస్ట్
- Lifestyle ఎండాకాలంలో ఈ ఫుడ్స్‌కు దూరంగా ఉండాలి.. లేదంటే డీహైడ్రేషన్ తప్పదు..
- Automobiles ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
తగలబడుతున్న హీరో ముఖం.. ఇంకా మంట పెట్టిన ప్రియురాలు!
నాలుగు పదుల ముదురు సుందరి మలైకా అరోరా, యంగ్ హీరో అర్జున్ కపూర్ మధ్య ప్రేమాయణం జోరుగా సాగుతోందని అందరికి తెలిసిపోయింది. ఈ జంట నుంచి శుభవార్త రావడమే మిగిలి ఉంది. అర్భాజ్ ఖాన్ నుంచి విడిపోయిన తర్వాత మలైకా అరోరా, అర్జున్ కపూర్ గురించి ఇలాంటి వార్తలు బాలీవుడ్ మొత్తం ఆశ్చర్యపోయింది. ఆరంభంలో మీడియాకు చిక్కకుండా ఈ జంట తప్పించుకునే వారు. కానీ ఇప్పుడు పబ్లిక్ గానే చెట్టాపట్టాలేసుకుని తిరిగేస్తున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అర్జున్ కపూర్ ఫోటో పై మలైకా తొలి సారి స్పందించింది.
హాలోవీన్ సందర్భంగా
హాలోవీన్ వీక్ సందర్భంగా ఓ అభిమాని అర్జున్ కపూర్ ఫోటోని ఆసక్తికరంగా రూపొందించాడు. హాలోవీన్ వీక్ సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు ఆత్మల గెటప్స్ లో కనిస్తారు. ఓ అభిమాని అర్జున్ కపూర్ ముఖం గోస్ట్ లాగా కనిపించేలా తగలబడిపోతున్నట్లు రూపొందించాడు. ఈ ఫోటో సామజిక మాధ్యమాల్లో వైరల్ అయింది.
మంట పెట్టింది
ఈ ఫోటోపై మలైకా అరోరా సోషల్ మీడియా వేదికగా స్పందించింది. ఈ ఫోటోకుకామెంట్ రూపంలో ఫైర్ ఎమోజి తగిలించింది. దీనితో అర్జున్ కపూర్, తనకు మధ్య రిలేషన్ కొససాగుతున్న విషయాన్ని మరోమారు అభిమానులకు తెలిసేలా చేసింది.
మరో అడుగు
ఇదిలా ఉండగా మలైకా అరోరా, అర్జున్ కపూర్ గురించి ఆసక్తికరమైన వార్తలు ప్రచారం జరుగుతున్నాయి. వచ్చే ఏడాది వీరిద్దరూ వివాహానికి సిద్ధం అవుతున్నారట. ఇన్నిరోజులు ప్రేమలో మునిగతేలుతూ సహజీవనంలో గడిపిన వీరిద్దరూ తమ రిలేషన్ ని మరో స్థాయికి తీసుకువెళ్లనున్నట్లు తెలుస్తోంది.
సన్నిహితులకు
ఇప్పటికే మలైకా అరోరా, అర్జున్ కపూర్ తమ మధ్య రిలేషన్ గురించి సన్నిహితులకు వివరించినట్లు తెలుస్తోంది. అర్భాజ్ ఖాన్ నుంచి విడిపోయిన మలైకా అరోరాకు ఓ కుమారుడు కూడా ఉన్నాడు. అర్జున్ కపూర్ హీరోగా రాణిస్తున్నాడు.