Malaika Arora నాదే సెక్సీ ట్యాగ్: స్పోర్ట్స్ వేర్‌తో హాట్ హాట్‌గా..

సినీ పరిశ్రమలో 48 ఏళ్ల వయసు అంటే మధ్య వయసు అని అందరూ భావిస్తారు. ముఖ్యంగా మహిళలు ఆ వయసు వచ్చే సరికి శారీరక పటుత్వం కోల్పోతారు. అయితే బాలీవుడ్ సెక్సీ బాండ్ మలైకా అరోరా మాత్రం ఆ వయసులోనూ తన హాట్‌నెస్‌తో మంటలు రేపుతోంది. తన కంటే వయసులో 12 ఏళ్ల చిన్నవాడైన అర్జున్ కపూర్‌తో సహజీవనం చేస్తూ జీవితాన్ని ఆస్వాదిస్తోంది. అంతేకాదు అందరూ తనను సెక్సీ అని పిలవడాన్ని గర్వంగా ఫీలవుతోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మలైకా ఆ విషయం చెప్పింది.

నాదే `సెక్సీ` ట్యాగ్

నాదే `సెక్సీ` ట్యాగ్

`మీకు ఏదైనా బిరుదు లేదా ఉన్నతమైన స్థానం దక్కితే దానిని చాలా పదిలంగా కాపాడుకోవడానికి ప్రయత్నిస్తారు. నేను కూడా అంతే. నాకు ఇచ్చిన `సెక్సీ` ట్యాగ్‌ను కాపాడుకునేందుకు నిరంతరం శ్రమిస్తాను. నిజానికి నేనెప్పుడూ సెక్సీగా ఉండడానికి ప్రయత్నించను. సహజంగానే నాలో ఆ ఆకర్షణ ఉంద`ని మలైకా చెప్పింది. అలాగే తనని ఎవరైనా `గంభీరం`గా ఉన్నావని అనటం కంటే `సెక్సీ`గా ఉన్నావు అంటేనే పొంగిపోతానని చెప్పింది.

సింగిల్ మదర్‌గా ఎన్నో కష్టాలు

సింగిల్ మదర్‌గా ఎన్నో కష్టాలు

భర్త అర్భాజ్ ఖాన్ నుంచి విడిపోయిన తర్వాత తన కొడుకుతో కలిసి మలైకా జీవిస్తోంది. సింగిల్ మదర్‌గా ఉండాల్సి వచ్చినపుడు ఎంతో భయపడ్డానని మలైకా చెప్పుకొచ్చింది. `విడాకుల తర్వాత నా కొడుకు గురించి ఎంత భయపడ్డా. సింగిల్ మదర్‌గా నేను నిలదొక్కుకోగలనా అని ఆలోచించా. ఒంటరిగా పిల్లలను పెంచడం చాలా కష్టం. అయితే విడిపోయే సమయానికి అర్హాన్ టీనేజ్‌లో ఉండడంతో నేను పెద్ద కష్టాలు పడలేద`ని చెప్పింది. అర్హాన్ ప్రస్తుతం అమెరికాలో చదువుకుంటున్నాడు.

నెగిటివ్ విమర్శలను పట్టించుకోను

నెగిటివ్ విమర్శలను పట్టించుకోను

గత నెలలో ఓ పార్టీకి సెక్సీ డ్రెస్‌లో హాజరైన మలైకా సోషల్ మీడియాలో తీవ్రమైన ట్రోలింగ్‌కు గురైంది. ఆ ట్రోలింగ్ గురించి స్పందిస్తూ.. `హాలీవుడ్‌లో అలాంటి డ్రెస్సులనే జెన్నీఫర్ లోపేజ్, రియాన్నా లాంటి వారు వేసుకుంటే పొగుడుతారు. ఇక్కడ జడ్జ్ చేస్తారు. `నువ్వు ఒక తల్లివి` అంటూ మోరల్ పోలీసింగ్ చేస్తారు. తల్లి అయితే తనకు నచ్చినట్టు ఉండకూడదా? నా కొడుకు ఎప్పుడూ నా స్వేచ్ఛను గౌరవిస్తాడు. మిగతా వారికి ఎందుకు బాధ. అయినా నేను అలాంటి విమర్శలను పట్టించుకోన`ని మలైకా పేర్కొంది.

నెలలో ఆ పదిహేను రోజులు..

నెలలో ఆ పదిహేను రోజులు..

ఫిట్‌నెస్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా నిలిచే మలైకా అరోరా కూడా హార్మోనల్ సమస్యలతో బాధపడుతుంటుందట. `నెలలో 30 రోజులూ చురుకుగా, ఉత్సాహంగా, సెక్సీగా ఉండడం ఎవరికీ కుదరదేమో. అన్ని రోజులూ మీకు అద్భుతంగా అనిపించవు. నెలలో ఓ 15 రోజులు నాకు అద్భుతంగా అనిపిస్తాయి. మిగిలిన 15 రోజులు ఇబ్బంది పెడతాయి. ఎందుకంటే ప్రతి మహిళనూ హార్మోనల్ సమస్యలు వెంటాడతాయ`ని మలైకా చెప్పింది.

స్పోర్ట్స్ వేర్‌తో హాట్ హాట్‌గా..

స్పోర్ట్స్ వేర్‌తో హాట్ హాట్‌గా..

మలైక్ అరోరా జిమ్ డ్రెస్‌కు సోషల్ మీడియాలో చాలా మంది అభిమానులున్నారు. జిమ్ డ్రెస్‌లో మలైకా హాట్‌నెస్ ఎంతో మందిని ఆకట్టుకుంటుంది. తాజాగా స్పోర్ట్స్ బ్రా, షార్ట్స్ ధరించి జిమ్ నుంచి బయటకు వస్తూ కెమేరాలకు చిక్కింది. ఆ డ్రెస్‌లో మలైకా కుర్ర హీరోయిన్లకు మించిన ఫిట్‌నెస్‌తో అభిమానులకు కనువిందు చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X