మా మధ్య సంతోషం లేదు, ప్రతిరోజు అదే తంతు.. విడాకులే బెటర్ అనుకున్నా.. మలైకా!
నాలుగు పదుల వయసులోనూ హాట్ నెస్ తో అదరగొడుతోంది మలైకా. సినిమాల్లో గ్లామర్ రోల్స్ తో పాపులర్ అయిన మలైకా అరోరా పలు చిత్రాల్లో ఐటమ్ సాంగ్స్ కూడా పెర్ఫామ్ చేసింది. మలైకా అరోరా చేసిన ప్రత్యేక గీతాలన్నీ బాగా పాపులర్ అయ్యారు. తరచుగా వివాదాలు, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలతో మలైకా అరోరా వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. ముఖ్యంగా తన మాజీ భర్త అర్భాజ్ ఖాన్ నుంచి మలైకా విడిపోవడం ఇప్పటికి బాలీవడ్ లో హాట్ టాపిక్కే. భర్త నుంచి విడిపోవడానికి గల కారణాన్ని మలైకా ఎట్టకేలకు వివరించింది.

కరీనా కపూర్ షోలో
కరీనా కపూర్ హోస్ట్ గా 'వాట్ వుమెన్ వాంట్' అనే రేడియా షో ప్రసారం అవుతున్న సంగతి తెలిసిందే. చాలా మంది సెలెబ్రిటీలు ఈ షోకు హాజరవుతున్నారు. ఇటీవల బాలీవుడ్ నటి మలైకా అరోరా అతిథిగా హాజరైంది. అర్భాజ్ ఖాన్ నుంచి విడిపోయాక మలైకా అర్జున్ కపూర్ తో డేటింగ్ చేస్తోంది. మలైకా, అర్భాజ్ ఖాన్ విడిపోవడానికి కారణాలు ఎవరికీ తెలియదు. ఎట్టకేలకు తన డైవర్స్ గురించి వివరించే ప్రయత్నం చేసింది.

ప్రతి రోజు అదే తంతు
మా ఇంట్లో సంతోషం లేదు. మా ఇద్దరి మధ్య నెలకొన్న పరిస్థితి వలన ఇంట్లో ఉన్న మిగిలినవారిపై కూడా ఆ ప్రభావం పడుతోంది. ప్రతి రోజు ఒకరి సంతోషాన్ని ఒకరం దూరం చేసే విధంగా ప్రవర్తించాం. ఇక కలసి ఉండడటం మంచిది కాదని నాకు ఓ దశలో అనిపించింది. అందుకే విడాకుల నిర్ణయం తీసుకున్నా. నా జీవితంలో నేను తీసుకున్న అతిపెద్ద కఠిన నిర్ణయం అదే అని మలైకా తెలిపింది.

విడాకులకు ముందురోజు కూడా
విడాకులు పొందాలని అనుకుంటున్నట్లు కుటుంబ సభ్యులకు, స్నేహితులకు చెప్పా. అందరూ నిదానంగా ఆలోచించు. నీ నిర్ణయాన్ని మార్చుకో అని సలహా ఇచ్చారు. అయినా నా ఆలోచన మారలేదు. చివరకు విడాకులకు ముందు రోజు కూడా నా కుటుంబ సభ్యులు ప్రశ్నించారు. ఇది 100 శాతం సరైన నిర్ణయమే అని అనుకుంటున్నావా అని ప్రశ్నించారు. మా ఇద్దరి సంతోషం దూరమవడమే కాక, ఇతర కుటుంబ సభ్యలు సంతోషం కూడా దూరమవుతోంది. అందుకే ఎవరు ఎన్ని చెప్పినా విడాకులు పొందాలని నిర్ణయించుకున్నట్లు మలైకా తెలిపింది.

అర్జున్ కపూర్‌తో డేటింగ్
అర్భాజ్ ఖాన్ నుంచి విడిపోయాక మలైకా కుర్ర హీరో అర్జున్ కపూర్ తో డేటింగ్ మొదలుపెట్టింది. పబ్లిక్ గానే వీరిద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు. అర్భాజ్, మలైకా మధ్య మనస్ఫర్థలు కారణం అర్జున్ కపూర్ తో ఎఫైర్ అనే రూమర్స్ కూడా బాలీవుడ్ లో ప్రచారం అవుతున్నాయి. అర్జున్ కపూర్ తో రిలేషన్ నుంచి మాత్రం మలైకా ఇంతవరకు నోరు విప్పలేదు.


Click it and Unblock the Notifications











