విడాకులు ఇవ్వడం బాధలేదు.. స్వేచ్ఛ లభించింది.. జీవితం కొత్తదనం కోరుకొంటున్నది
సినీ పరిశ్రమలో భార్య, భర్తలు విడాకులు తీసుకోవడం సాధారణంగా కనిపించే వార్తలే. కానీ 19 ఏళ్ల వైవాహిక జీవితానికి గుడ్‌బై చెబుతూ 2016లో అర్బాజ్ ఖాన్, మలైకా అరోరా విడాకులు తీసుకోవడం బాలీవుడ్‌ను కుదిపేసింది. వారికి అర్హాన్ అనే కుమారుడు కూడా ఉండటం తెలిసిందే. తాజాగా అర్బాజ్ ఖాన్ నుంచి విడాకులు పొందిన విషయంపై మరోసారి మలైకా క్లారిటీ ఇచ్చారు. ఆమె ఏమన్నారంటే..

విడాకులతో స్వేచ్ఛ లభించింది
దాంపత్య జీవితంలో విడాకుల నిర్ణయం చాలా పెద్దది. విడాకులు తీసుకోవాలనే నిర్ణయం నాకు స్వేచ్చను ప్రసాదించింది. కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు మార్గం చూపింది. అయితే కొందరు నా నిర్ణయాన్ని తప్పుపట్టారు. ఇలాంటి పిచ్చి పని ఎందుకు చేస్తున్నావు. తర్వాత పరిస్థితుల గురించి ఆలోచించావా? అని అన్నారు.

నిర్ణయం తప్పని భావించలేదు
అర్బాజ్ నుంచి విడాకులు పొందడం కరెక్ట్ అని నమ్ముతున్నాను. నా నిర్ణయానికి నేను కట్టుబడి ఉన్నాను. ఏ క్షణంలో కూడా నేను తప్పని భావించలేదు. భావోద్వేగానికి గురికాలేదు. కొత్త ఛాయిస్‌ను వెతుక్కునేందుకు, కొత్త నిర్ణయాలు తీసుకొనేందుకు స్వేచ్ఛ లభించిందని భావిస్తున్నాను.

ఒంటరిగా ఎందుకు ఉండాలని
ఎప్పుడూ కొత్త రిలేషన్స్, ప్రేమ మళ్లీ పొందాలని జీవితం కోరుకొంటుంది. జీవితాంతం ఒంటరిగా ఉండాలని ఎవరూ కోరుకోరు. అర్బాజ్ నుంచి విడిపోవాలని కోరుకొన్న నిర్ణయాన్ని నా స్నేహితులు ప్రశంసించారు. విడాకుల తర్వాత హీరో అర్జున్ కపూర్‌తో మలైకా అరోరా, జార్జియా అండ్రియానితో అర్భాజ్ డేటింగ్ చేస్తున్న విషయం తెలిసిందే.

బాధపడొద్దు.. గతాన్ని మరిచిపోవాలని
మలైకాతో డైవోర్స్ గురించి ఇటీవల అర్భాజ్ ఖాన్ మాట్లాడుతూ.. కొన్ని రోజులు బాధపడిన విషయం నిజమే. ఇప్పుడు ఆ బాధ నుంచి దూరమయ్యాను. నీవు తీసుకొన్న నిర్ణయం ఏదైనా దానికి దూరంగా ఉండాలి. త్వరగా మరిచిపోవాలి. అప్పుడే మనసు శాంతంగా ఉంటుంది అని అన్నారు. తన సోదరుడు సల్మాన్ ఖాన్‌తో తెరకెక్కించే దంబాంగ్3 సినిమా బిజీలో ప్రస్తుతం అర్బాజ్ ఉన్నారు.

త్వరలోనే అర్జున్ కపూర్‌తో మలైకా రెండో పెళ్లి
గత కొద్దికాలంగా డేటింగ్ చేస్తున్న మలైకా, అర్జున్ కపూర్ త్వరలోనే పెళ్లికి సిద్ధమవుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. వారి ఇరు కుటుంబాలు పెళ్లికి అంగీకరించడంతో ఆ దిశగా ఏర్పాట్లు జరుగుతున్నట్టు తెలిసింది. అంతా సవ్యంగా సాగితే ఏప్రిల్‌లో మలైకా, అర్జున్ పెళ్లి జరిగే అవకాశం లేకపోలేదు.


Click it and Unblock the Notifications











