లేటు వయసులో ఘాటు ఫొటోలతో ఐటెం గర్ల్ రచ్చ: మితిమీరిన క్లీవేజ్ షో.. వామ్మో మరీ ఇంత దారుణమా!
ఈ మధ్య కాలంలో సినిమాల్లో నటించకున్నా నిత్యం ఫ్యాన్స్ టచ్‌లో ఉంటున్నారు సినీ ప్రముఖులు. దీనికి కారణం సోషల్ మీడియానే అన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మరీ ముఖ్యంగా లేడీ యాక్టర్లు ఇందులో ఓ అడుగు ముందే ఉంటున్నారు. అందుకే ఎంతో మంది నటీమణులు ఇంటర్నెట్‌లో సెన్సేషన్ అవుతున్నారు. అలాంటి వారిలో ఐటెం భామ మలైకా అరోరా ఒకరు. చాలా కాలంగా తన అందచందాలతో రచ్చ చేస్తోన్న ఈ బ్యూటీ.. లేటు వయసులోనూ కాక రేపుతోంది. ఈ క్రమంలోనే తాజాగా మితిమీరిన క్లీవేజ్ షోతో రెచ్చిపోయింది. ఆ ఫొటోలు మీకోసం!

అలా మొదలైన కెరీర్.. ఇలా ఫేమస్
ఇప్పుడు బాలీవుడ్‌లో రచ్చ చేస్తోన్న మలైకా అరోరా.. మోడల్‌గా కెరీర్‌ను ఆరంభించింది. ఈ క్రమంలోనే ఎన్నో అందాల పోటీల్లో భాగం అయింది. అదే సమయంలో కొన్ని వ్యాపార ప్రకటనల్లో సైతం చేసింది. అలా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా నటిగా మాత్రం గుర్తింపును అందుకోలేదు. కానీ, 'ఛయ్య ఛయ్య..', 'అనార్కలీ డిస్కో ఛాలీ', 'మున్నీ బద్నామ్' వంటి ఐటెం సాంగ్స్‌తో ఫేమస్ అయింది.

తెలుగులోనూ అడుగు పెట్టిన భామ
బాలీవుడ్‌లో నటిగా, ఐటెం సాంగుల స్పెషలిస్టుగా ఎనలేని క్రేజ్‌ను అందుకుంది మలైకా అరోరా. ఈ క్రమంలోనే వరుస సినిమాలతో ఫుల్ బిజీ అయిపోయింది. సరిగ్గా అప్పుడే తెలుగు సినీ ఇండస్ట్రీలోకి కూడా అడుగు పెట్టింది. ఈ క్రమంలోనే మహేశ్ బాబు నటించిన 'అతిథి', పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సూపర్ డూపర్ హిట్ మూవీ 'గబ్బర్ సింగ్'లో అదిరిపోయే ఐటెం సాంగ్స్ చేసింది.

హీరో తమ్ముడితో పెళ్లి.. విడాకులతో
కెరీర్ పరంగా సత్తా చాటుతోన్న సమయంలోనే మలైకా అరోరా.. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ సోదరుడైన అర్భాజ్ ఖాన్‌ను పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత వీళ్లిద్దరూ కలిసి తొమ్మిదేళ్లు కాపురం చేశారు. ఈ క్రమంలోనే ఈ జంటకు ఇద్దరు పిల్లలు కూడా జన్మించారు. 2017లో వ్యక్తిగత కారణాలతో అర్భాజ్‌కు విడాకులిచ్చేసింది. అప్పటి నుంచి మరొకరిని వివాహం చేసుకోలేదు.

చిన్నోడైన హీరోతో డేటింగ్ చేస్తోందిగా
భర్తకు విడాకులు ఇచ్చిన తర్వాత మలైకా అరోరా బాలీవుడ్ స్టార్ హీరో, బోనీ కపూర్ మొదటి భార్య కుమారుడైన అర్జున్ కపూర్‌తో డేటింగ్ చేయడం మొదలెట్టింది. అప్పటి నుంచి అతడితో సీక్రెట్‌గా బంధాన్ని కొనసాగిస్తోన్న ఈ బ్యూటీ.. ఆ తర్వాత అతడి ఫొటోను షేర్ చేస్తూ 'అర్జున్ నావాడు' అని పోస్ట్ చేసి అసలు మేటర్‌ను లీక్ చేసింది. ఆ తర్వాత అతడు కూడా దీన్ని బయట పెట్టాడు

పెళ్లి చేసుకోకుండానే కాపురం పెట్టేసి
రహస్యంగా వ్యవహారం నడిపినంత కాలం పెద్దగా కనిపించని అర్జున్, మలైకా.. డేటింగ్ మేటర్ లీకైన తర్వాత మాత్రం రెచ్చిపోతున్నారు. ఈ క్రమంలోనే తరచూ కలిసి తిరగడం.. డిన్నర్ డేట్లకు వెళ్లడం.. హాలీడే ట్రిప్పులను ఎంజాయ్ చేయడం వంటి వాటితో వార్తల్లో నిలుస్తున్నారు. సోషల్ మీడియాలోనూ రచ్చ రచ్చ చేస్తున్నారు. ఇక, పెళ్లి కాకుండానే కాపురం కూడా పెట్టేశారు.

ఎప్పుడూ అందులోనే ఉంటూ రచ్చ
మలైకా అరోరా తన ఫిట్‌నెస్‌కు ఎంతగానో ప్రాధాన్యం ఇస్తుంటుంది. అందుకే నిత్యం వర్కౌట్లు చేయడంతో పాటు యోగా కూడా చేసింది. అదే సమయంలో సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉంటూ ఫ్యాన్స్‌కు సైతం సూచనలు చేస్తోంది. ఇక, తనకు తన కెరీర్‌కు సంబంధించిన విషయాలను తరచూ బయట పెడుతూనే ఉంటోంది. అలాగే ఫొటోలు, వీడియోలు వదులుతోంది.
Recommended Video

లేటు వయసులో ఘాటు అందాలు
సోషల్ మీడియాలో తరచూ రచ్చ రచ్చ చేసే మలైకా అరోరా.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఓ వీడియోను షేర్ చేసింది. అందులో ఆమె ముఖానికి ఏదో రాసుకుంటూ కనిపించింది. అయితే, ఇందులో ఆమె క్లీవేజ్ షోతో కాక రేపుతోంది. ఫలితంగా ఆమె ఎద అందాలు కనువిందు చేస్తున్నాయి. లోలేటు వయసులోనూ ఘాటుగా కనిపిస్తుండడంతో ఈ పిక్ తెగ వైరల్ అయిపోతుంది.


Click it and Unblock the Notifications











