Malaika Arora కౌగిలిలో నలిగిపోయిన ప్రియుడు.. లేటు వయసులో ముద్దులతో రెచ్చిపోయిన మలైకా అరోరా
బాలీవుడ్‌లో చెట్టాపట్టాల్ వేసుకొని బహిరంగంగా ప్రేమపక్షులుగా ఎగిరే జంట ఎవరైనా ఉన్నారా? అంటే ఠక్కున గుర్తుకు వచ్చేది అర్జున్ కపూర్, మలైకా అరోరా. సల్మాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్ నుంచి విడాకులు తీసుకొన్న తర్వాత బోని కపూర్ కుమారుడు అర్జున్ కపూర్‌తో రిలేషన్‌షిప్‌లో పీకల్లోతు కూరుకుపోయింది. 2019లో తమ డేటింగ్ గురించి అధికారికంగా క్లారిటీ ఇచ్చారు. అయితే వాలంటైన్ డే రోజున మలైకా అరోరా, అర్జున్ కపూర్ రొమాంటిక్ మూవెంట్స్ వైరల్అవుతున్నాయి. అలాగే తమ రిలేషన్‌షిప్ గురించి అర్జున్ కపూర్ మరోసారి ఓపెన్ అయ్యారు. ఆ వివరాల్లోకి వెళితే..

48 ఏళ్ల బ్యూటీతో 36 సంవత్సరాల అర్జున్
బాలీవుడ్‌లో మలైకా అరోరా, అర్జున్ కపూర్ రిలేషన్‌షిప్ గురించి లెక్కలేని కథనాలు వచ్చాయి. 36 సంవత్సరాల అర్జున్ కపూర్, 48 సంవత్సరాల మలైకా అరోరా మధ్య రిలేషన్‌షిప్ కొన్ని ఏళ్లుగా ప్రతినిత్యం హాట్ టాపిక్‌గా మారింది. వయసు తేడా గురించి సోషల్ మీడియాలో భారీగా ట్రోల్స్ వెంటాడాయి. అయితే అలాంటి ట్రోల్స్ మా బంధంపై ఎలాంటి ప్రభావం చూపలేకపోయాయనే విషయాన్ని అర్జున్ కపూర్ వెల్లడించారు.

ఆర్గానిక్‌గా మా మధ్య రిలేషన్‌షిప్
మలైకా అరోరాతో డేటింగ్, రిలేషన్‌షిప్ వ్యవహారం ప్లాన్ ప్రకారం చేసింది కాదు. అర్గానిక్‌గా మా మధ్య రిలేషన్‌షిప్ జరిగిపోయింది. మా ప్రయాణంలో కొద్ది రోజుల తర్వాత మా మధ్య విడదీయలేనంతగా రిలేషన్‌షిప్ ఉందని గ్రహించాం. ఆ తర్వాతే మా రిలేషన్ గురించి స్పష్టమైన నిర్ణయం తీసుకొన్నాం. ఆ తర్వాత మా గురించి వస్తున్న రూమర్లకు ధీటుగా సమాధానం చెప్పాలని నిర్ణయించుకొన్నాం అని అర్జున్ కపూర్ చెప్పారు.

సోషల్ మీడియాలో విషం చిమ్మినా...
మలైకాకు నాకు మధ్య ఉన్న వయసుకు సంబంధించిన తేడా మీడియాలో ప్రధాన అంశంగా మారడం కొంత డిస్ట్రబ్‌గా అనిపించింది. అలాంటి విషయాలను బేస్ చేసుకొని మాపై విసిరిన విమర్శనాస్త్రాలను ధీటుగా ఎదుర్కొన్నాం. సోషల్ మీడియాలో చిమ్మిన విషయాన్ని తేలికగా తీసుకోవడానికి మానసికంగా సిద్ధమయ్యాం. మా బంధంలో డిగ్నిటీ ఉంది. నా కోసం సర్వం ధారపోయడానికి ముందుకు వచ్చిన ఆమె అంటే నాకు ఎనలేని గౌరవం ఉంటుంది అని అర్జున్ కపూర్ చెప్పారు.

వయసు గురించి పట్టుకోవాల్సిన అవసరం
మాపై వచ్చిన విమర్శలు, సోషల్ మీడియా దాడులను మా మధ్య నెలకొన్న ధృఢమైన బంధమే ఎదురించింది. ప్రేమ విషయంలో వయసు గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని మలైకా, నేను నిరూపించాం. గత కొద్ది సంవత్సరాలుగా డేటింగ్ చేస్తున్నాం. మా మధ్య ఎలాంటి అభిప్రాయ భేదాలు లేవు అని అర్జున్ కపూర్ తెలిపారు.
Recommended Video
మలైకా కౌగిలిలో నలిగిపోయిన అర్జున్
అర్జున్ కపూర్, మలైకా అరోరా మధ్య ఉన్న బలమైన రిలేషన్‌షిప్‌కు వాలంటైన్ డే మరోసారి సాక్ష్యంగా నిలిచింది. ప్రేమికుల రోజును పురస్కరించుకొని మలైకా, అర్జున్ విడదీయలేనంతగా పెనవేసుకుపోయారు. మలైకా అరోరా నుదుటిపై అర్జున్ కపూర్ ముద్దుపెడుతుండగా.. ఆమె అతడిని గాలి చొరబడని విధంగా కౌగిలితో పెనవేసుకొన్నది. నీవు నా వాడివి అంటూ మెసేజ్ పెట్టి తన ప్రేమను వ్యక్తం చేసింది. ప్రస్తుతం మలైకా, అర్జున్ ఫోటో మీడియాలో వైరల్‌గా మారింది.


Click it and Unblock the Notifications











