అతడితో ఎఫైర్ నిజమే... మరో హింట్ ఇచ్చిన హాట్ బ్యూటీ!
బాలీవుడ్ ముదురు బ్యూటీ మలైకా అరోరా, యంగ్ హీరో అర్జున్ కపూర్ మధ్య లవ్ ఎఫైర్ నడుస్తుందనేది బహిరంగ రహస్యమే. పలు ఈవెంట్లకు, పార్టీలకు చట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న ఈ జంట అసలు విషయం ఒప్పుకోకుండా ఇటు అభిమానుల్లో, అటు మీడియాలో మరింత క్యూరియాసిటీ పెంచుతున్నారు. తమ రిలేషన్‌షిప్ గురించి ఒప్పేసుకుంటే ఆ తర్వాత నుంచి మీడియాలో తమపై ఫోకస్ తగ్గుతుందనే ఇలా చేస్తున్నట్లు స్పష్టమవుతోంది.
అయితే తాజాగా మలైకా మరోసారి తన చేష్టలతో మీడియాలో హాట్ టాపిక్ అయింది. ఆమె మెడలో 'ఎఎం' అనే అక్షరాలతో కూడిన పెండెంట్ ధరించింది. అంటే... అర్జున్ కపూర్(ఎ) మలైకా (ఎం) అని అర్థం. మలైకా ఫ్రెండ్ వాబిజ్ మెహతా ఆమెకు దీన్ని గిఫ్టుగా ఇచ్చిందట. ఈ ఫోటో షేర్ చేయడం ద్వారా అర్జున్‌తో తన రిలేషన్ మరింత బలపడింది అని పరోక్షంగా హింట్ ఇచ్చింది అని అంటున్నారు ఫ్యాన్స్.

ఇటీవల కరణ్ జోహార్ టాక్ షో 'కాఫీ విత్ కరణ్' కార్యక్రమంలో పాల్గొన్న అర్జున్ కపూర్... తాను ఇపుడు సింగిల్ కాదంటూ స్టేట్మెంట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. మలైకా పేరు చెప్పకుండా తాను ఒకరితో ప్రేమలో ఉన్నట్లు తెలిపారు. పెళ్లికి సైతం సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు.
మలైకా అరోరా కొన్ని నెలల క్రితమే తన భర్త అర్భాజ్ ఖాన్‌తో విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం అర్జున్‌తో రిలేషన్ షిప్‌లో ఉన్న ఈ బ్యూటీ 2019లో అతడిని పెళ్లాడబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











