For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

క్రికెటర్ ప్రియుడికి షాకిచ్చి, ఫ్రెండ్ భర్తతో... ట్రెండింగ్‌గా మలైకా అరోరా సోదరి ఫ్లాష్‌బ్యాక్!

|

బాలీవుడ్‌లో మీడియా హెడ్‌లైన్లలో ఉండే గ్లామర్ స్టార్ ఎవరంటే మలైకా అరోరా అని ఠక్కున చెబుతారు. మలైకా ప్రమేయం ఉన్నా..లేకపోయినా నిత్యం వార్తల్లో నిలుస్తారు. అయితే తాజాగా ఆమె చెల్లెలు అమ‌‌ృతా అరోరా కూడా అదే దారి పట్టినట్టు కనిపిస్తున్నది. ఇటీవల అమృత కూడా హెడ్‌లైన్లలో కనిపిస్తూ బాలీవుడ్‌లో హల్‌చల్ చేస్తున్నది. గతంలో పాకిస్థాన్ సంతతికి చెందిన క్రికెటర్‌తో ఆమె డేటింగ్ చేసిన విషయం ఇప్పుడు మీడియాలో చర్చనీయాంశమైంది. అమృతా అరోరా ప్రేమించిన క్రికెటర్ ఎవరంటే..

కేబీసీలో అమృతా అరోరా

కేబీసీలో అమృతా అరోరా

అమృతా అరోరా బాలీవుడ్‌లో క్రేజీగా హీరోయిన్‌గా వెలుగు వెలుగుతున్న నేపథ్యంలో పాక్ సంతతికి చెందిన ఆస్ట్రేలియా క్రికెటర్ ఉస్మాన్ అఫ్జల్‌తో డేటింగ్ చేసింది. 2008లో అమితాబ్ బచ్చన్ హోస్ట్‌గా ఉండే కౌన్ బనేగా కరోడ్ పతి కార్యక్రమానికి ఉస్మాన్‌తో కలిసి అమృత హాజరయ్యారు. ఆ సందర్భంగా ఉస్మాన్ గురించి చెబుతూ నా జీవితానికి ఇతనే నాకు సరైనోడు. చట్టబద్ధంగా నా జీవిత భాగస్వామిగా చేసుకొంటాను అని అమృతా అరోరా వెల్లడించారు.

 ఫ్రెండ్ భర్తతో వివాహం

ఫ్రెండ్ భర్తతో వివాహం

అయితే ఉస్మాన్ అఫ్జల్‌తో పెళ్లి చేసుకోవడం అనుకొంటుండగానే అమృతా అరోరా పెద్ద షాకిచ్చింది. తనకు సన్నిహితురాలి భర్తను షకీల్ లడక్‌ను వివాహం చేసుకోవడం ఇండస్ట్రీ వర్గాలను, అభిమానులను దిగ్బ్రాంతికి గురిచేసింది. నా జీవితంలో ఉస్మాన్ తప్ప మరొకరికి స్థానం లేదని చెప్పి మరొకరిని పెళ్లి చేసుకోవడం అప్పట్లో చర్చనీయాంశమైంది. తాజాగా ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఫ్రెండ్ కాపురంలో చిచ్చు పెట్టి

ఫ్రెండ్ కాపురంలో చిచ్చు పెట్టి

ఇక అమృతా అరోరా ప్రియుడి గురించి ఆసక్తికరమైన చెప్సాల్సిందే. ఉస్మాన్‌తో అమృత డేటింగ్ చేసే సమయంలో తన స్నేహితురాలు నిషా రాణాతో షకీల్ లడఖ్ పెళ్లి జరిగింది. ఆ తర్వాత అభిప్రాయ బేధాలు రావడంతో వారిద్దరూ విడిపోయారు. అనంతరం షకీల్‌ను అమృతా పెళ్లి చేసుకోవడం జరిగింది. అయితే అమృత వల్లనే షకీల్ దంపతులు విడిపోయారనే రూమర్లు షికారు చేశాయి.

అమృత అరోరా కెరీర్‌లో

అమృత అరోరా కెరీర్‌లో

మలైకా అరోరా సోదరిగా అమృతా అరోరా కిత్నే దూర్.. కిత్నే పాస్ అనే చిత్రం ద్వారా పరిచయమైంది. ఆ తర్వాత ఓం శాంతి ఓం, గోల్ మాల్ రిటర్న్ అనే చిత్రంలో నటించింది. చివరిగా 2015లో కుచ్ తో హై తేరే మేరే దర్మియాన్ అనే సినిమాలో నటించింది.

English summary
Amrita Arora had also said in KBC that, "I'm certain this is the man for me. We'll make it legal whenever it's the right time for both of us." But, after few days she married to friends husband Shakeel Ladak.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more