Break up: ప్రియుడితో బ్రేకప్.. మలైకా అరోరా షాకింగ్ పోస్ట్!
Malaika Arora, Arjun Kapoor: సినీ ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలు తమ రిలేషన్ షిప్ గురించి వైరలవుతూ వార్తల్లో ఉంటారు. వారు కలిసి ఉండటం కంటే.. వారి బ్రేకప్ వార్తలే ఎక్కువ వార్తల్లో నిలుస్తున్నాయి. అలాంటి జాబితాలో బాలీవుడ్ బ్యూటీ, యోగా క్వీన్ మలైకా అరోరా (Malaika Arora), బాలీవుడ్ యాక్టర్ అర్జున్ కపూర్(Arjun Kapoor)నిలిచారు. వీరిద్దరూ బ్రేకప్ చెప్పుకున్నట్లు సోషల్ వీడియోలో వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.
వయస్సులో తన కంటే ఎంతో చిన్న వాడైన అర్జున్ కపూర్ తో దాదాపు 5 సంవత్సరాలు చెట్టాపట్టాలు వేసుకుని తిరిగింది మలైకా అరోరా. పీకల్లోతు ప్రేమలో మునిగి తేలింది 50 ఏళ్ల మలైకా అరోరా. వారు వీడిపోయిన ఎవరి దారిలో ఎంతో హుందాగా ఉంటున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే..తాజాగా ఈ బ్యూటీ మలైకా అరోరా ఓ ఇంట్రెస్టింగ్ పోస్టును షేర్ చేసింది.
మలైకా అరోరా మిస్టరీ పోస్ట్
మలైకా అరోరా, అర్జున్ కపూర్ విడిపోయారంటూ వార్తలు తెగవైరల్ అవుతున్నాయి. ఈ వైరల్ వార్తలపై అటు హీరో అర్జున్ కపూర్ గానీ, ఈ హాట్ బ్యూటీ గానీ ఎలాంటి కామెంట్స్ చేయలేదు. కానీ వారు ఇన్ డైరెక్ట్ గా సోషల్ మీడియాలో పోస్టులు చేస్తూ ఆ వార్తలకు ఆమె ఊతమిస్తున్నారు. తాజాగా నటి మలైకా అరోరా తన ఇన్‌స్టాగ్రామ్ ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేసారు. "మీ ఆనందంలో సంతోషంగా, మీ విచారంలో బాధపడే వ్యక్తులపై ఎల్లప్పుడూ శ్రద్ధ వహించండి. అలాంటి వారే మీ హృదయంలో ప్రత్యేక స్థానం పొందటానికి అర్హులు.''అని పోస్టు చేసింది.
హీరోయిన్ మలైకా అరోరా, అర్జున్ కపూర్ గత 6 సంవత్సరాలుగా డేటింగ్ చేస్తున్నారు. వారిద్దరూ 2018 నుండి చెట్టాపట్టాలు వేసుకుంటూ పలుమార్లు మీడియా కంటబడ్డారు. దీంతో వీరి డేటింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారారు.వీరిద్దరికి మధ్య దాదాపు 12 సంవత్సరాల తేడా ఉంటుంది.

ఈ కారణంగా వారు చాలాసార్లు ట్రోల్ బారిన పడ్డారు.కానీ వారిద్దరూ ఎప్పుడూ వాటిని పట్టించుకోలేదు. వాటిని లెక్క చేయలేదు. అవకాశమొచ్చినప్పుడల్లా ట్రోలర్లకు తగిన సమాధానం ఇచ్చేవారు. అయితే.. గత కొంత కాలంగా మలైకా, అర్జున్ కలిసి కనిపించకపోవడంతో విడిపోయారనే వార్తలు ప్రచారమవుతున్నాయి.


Click it and Unblock the Notifications











