పెళ్లికి ముందే ఒకే ఇంట్లో సినీ జంట రచ్చ: అతడితో ఉంటే అదే పని.. పొరపాటున లీక్ చేసిన హీరోయిన్

సినీ ప్రముఖుల ప్రేమ వ్యవహారాలంటే అందరికీ ఆసక్తి ఉంటుంది. అన్ని ఇండస్ట్రీలతో పోలిస్తే బాలీవుడ్‌లోనే లవ్ ట్రాకులు ఎక్కువగా కనిపిస్తుంటాయి. కొన్నాళ్ల పాటు డేటింగులో మునిగి తేలడం.. ఆ తర్వాత బ్రేకప్ చెప్పేయడం అక్కడ కామన్. ఈ విషయం ఎన్నో జంటల విషయంలో సుస్పష్టమైంది. కానీ, అర్జున్ కపూర్ - మలైకా అరోరా మాత్రం పెళ్లికి ముందే తమ బంధాన్ని బయట పెట్టి మరీ హల్‌చల్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా వాళ్లిద్దరూ కలిసి గడిపిన మధుర క్షణాల గురించి బయట పెట్టింది సదరు హీరోయిన్. అసలేం జరిగింది? పూర్తి వివరాలోకి వెళితే...

పెళ్లైన హీరోయిన్.. యంగ్ హీరో డేటింగ్

పెళ్లైన హీరోయిన్.. యంగ్ హీరో డేటింగ్

బాలీవుడ్‌లో చాలా కాలంగా హాట్ టాపిక్ అవుతోన్న వాటిలో యంగ్ హీరో అర్జున్ కపూర్ - సీనియర్ నటి మలైకా అరోరా జంట ఒకటి. దీనికి కారణం పెళ్లై భర్తను వదిలేసిన భామతో... కుర్ర హీరో ఎఫైర్ కొనసాగిస్తుడడమే. అంతేకాదు, వీళ్లిద్దరి మధ్యా 12 ఏళ్ల ఏజ్ గ్యాప్ కూడా ఉంది. దీంతో ఈ జంట ఎప్పుడూ స్పెషల్‌గానే నిలుస్తోంది. ఇలానే దేశ వ్యాప్తంగా పాపులర్ అయింది.

బహిరంగంగానే ఒప్పుకున్న బిగ్ స్టార్స్

బహిరంగంగానే ఒప్పుకున్న బిగ్ స్టార్స్

తమ బంధం గురించి అర్జున్ కపూర్.. మలైకా అరోరాకు తరచూ ఏదో ఒక విధంగా ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కొద్దిరోజుల క్రితం జరిగిన ‘కాఫీ విత్‌ కరణ్‌' అనే షోలో ఈ స్టార్ హీరో.. తన ఎఫైర్‌ గురించి బయట పెట్టడంతో పాటు కన్ఫార్మ్ చేశాడు. అదే సమయంలో మలైకా కూడా ఆ మధ్య అర్జున్‌ కపూర్ ఫొటోను షేర్‌ చేస్తూ ‘అర్జున్ నావాడు' అని పోస్ట్‌ చేసింది.

కలిసే కనిపిస్తున్నారు... తరచూ హైలైట్

కలిసే కనిపిస్తున్నారు... తరచూ హైలైట్

సీక్రెట్‌గా ఎఫైర్ కొనసాగించనంత కాలం పెద్దగా కనిపించని ఈ సినీ జంట.. బహీర్గతం అయిన తర్వాత మాత్రం రెచ్చిపోతోంది. ఈ క్రమంలోనే తరచూ కలిసి తిరగడం.. డిన్నర్ డేట్లకు వెళ్లడం.. హాలీడే ట్రిప్పులను ఎంజాయ్ చేయడం వంటి వాటితో వార్తల్లో నిలుస్తున్నారు అర్జున్, మలైకా. అంతేకాదు, ఒకరిని ఒకరు ప్రశంసించుకుంటూ అప్పుడప్పుడూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు.

సినీ జంట పెళ్లి... రేపంటే రేపంటూ టాక్

సినీ జంట పెళ్లి... రేపంటే రేపంటూ టాక్

అర్జున్ కపూర్ - మలైకా అరోరా చాలా కాలంగా ప్రేమలో మునిగి తేలుతున్నారు. ఈ నేపథ్యంలోనే వీళ్లిద్దరి పెళ్లి గురించి ఎన్నో ఊహాగానాలు తెరపైకి వస్తున్నాయి. కొద్ది రోజుల్లో వీళ్లిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. కానీ, అటువంటిదేమీ జరగలేదు. ‘మేము పెళ్లి చేసుకుంటే చెప్పే చేసుకుంటాం' అని ఆ మధ్య అర్జున్ ఓ స్టేట్‌మెంట్ ఇచ్చాడు.

పెళ్లికి ముందే ఒకే ఇంట్లో సినీ జంట రచ్చ

పెళ్లికి ముందే ఒకే ఇంట్లో సినీ జంట రచ్చ

మలైకా అరోరా సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆమె జూమ్ యాప్ ద్వారా ఓ చానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఇందులో తన కెరీర్‌కు సంబంధించిన విషయాలతో పాటు వ్యక్తిగత అంశాలను మాట్లాడింది. ఈ క్రమంలోనే లాక్‌డౌన్‌లో అర్జున్ కపూర్‌తో కలిసి ఒకే ఇంట్లో ఉన్నానని పొరపాటు సీక్రెట్ లీక్ చేసేసిందామె.

అతడితో ఉంటే అదే పనంటూ హీరోయిన్

అతడితో ఉంటే అదే పనంటూ హీరోయిన్

ఈ ఇంటర్వ్యూలో మలైకా మాట్లాడుతూ.. ‘లాక్‌డౌన్‌లో అర్జున్‌తో కలిసే ఉన్నా. అతడితో ఉంటే డల్ ఫీలింగ్ రాదు. అంతలా నన్ను ఎంటర్‌టైన్ చేస్తాడు. ఎప్పుడూ నన్ను సంతోష పెట్టడానికే ట్రై చేస్తుంటాడు. అతడితో ఉంటే నవ్వడమే నా పని. లాక్‌డౌన్ మొత్తం ఇలాగే ఎంజాయ్ చేశాను. అలాగే నాతో గడిపిన క్షణాలను అర్జున్ కూడా మంచిగా ఆస్వాదించాడు' అని ఆమె చెప్పడం విశేషం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X