For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆకుల మధ్య మలైకా అందాలు.. నాటి ఫోటోపై చర్చ.. గోవాలో స్పెషల్ షూట్

    |

    ఒక్కోసారి సోషల్ మీడియాలో పాత విషయాలన్ని వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం చేస్తున్న వాటికి గతంలో జరిగిన వాటిని పోల్చుతూ నెటిజన్లు హాట్ టాపిక్ అయ్యేలా చర్చలు మొదలు పెడుతుంటారు. గతంలో కియారా అద్వానీ ఆకు ఫోటో ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలిసిందే. అందాలకు అడ్డుగా ఆకును పెడుతూ చేసిన ఫోటో షూట్, దానికి వెనుకున్న మోసం తెలియడంతో అందరూ షాక్ అయ్యారు.

    డబూ రత్నాని ఫోటో హాట్ టాపిక్..

    డబూ రత్నాని ఫోటో హాట్ టాపిక్..

    కియారా అద్వానీ ఆకు ఫోటో అప్పట్లో ఇంటర్నెట్ మొత్తాన్ని షేక్ చేసింది. కియారా నగ్నంగా ఉన్నట్టుగా భ్రమించేలా ఆ ఫోటో షూట్ చేశారు. అయితే వర్కింగ్ స్టిల్స్ కూడా బయటకు రావడంతో అందులో కియారా నగ్నంగా ఏమీ లేనట్టు.. డ్రెస్ ధరించినట్టు కనిపించింది. దగా, మోసం అంటూ నెటిజన్లు ఫన్నీ కామెంట్లు పెట్టారు. ఇప్పుడు మళ్లీ ఆ ఫోటో హాట్ టాపిక్ అయింది.

    గోవాలో మలైకా..

    గోవాలో మలైకా..

    ప్రస్తుతం మలైకా అరోరా గోవాలో ఉంది. న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్‌లో భాగంగా మలైకా గోవాకు చెక్కేసినట్టు తెలుస్తోంది. ఆమె వెంట తన కుర్ర ప్రేమికుడు అర్జున్ కపూర్ కూడా ఉన్నట్టు సమాచారం. కానీ ఎక్కడా కూడా ఇద్దరూ కనిపించి పోజులు ఇచ్చినట్టు ఫోటోలు బయటకు రావడం లేదు.

    స్పెషల్ ఫోటో షూట్..

    స్పెషల్ ఫోటో షూట్..

    మలైకా అరోరా ప్రస్తుతం స్పెషల్ ఫోటో షూట్‌తో సోషల్ మీడియాను ఊపేస్తోంది. స్విమ్మింగ్ పూల్ వద్ద బికినీతో, అరటి ఆకుల మధ్య ఘాటు పోజులు ఇస్తూ నెటిజన్లను ఉక్కిరి బిక్కిరి చేసేస్తోంది. ఆ గ్రీనరీతో మ్యాచ్ అయ్యేలా మలైకా డ్రెస్ రంగు అలానే ఉంది. మొత్తానికి ఫోటో అంతా గ్రీన్‌గానే మారింది. మలైకా ఎద అందాలు మాత్రం విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

    భిన్న కామెంట్లు..

    భిన్న కామెంట్లు..

    మలైకా షేర్ చేసిన ఫోటోలపై భిన్న రకాల కామెంట్లు వినిపిస్తున్నాయి. కొందరు అర్జున్ కపూర్ ఎక్కడా అని అడుగుతుంటే.. ఇంకొందరు డబూ రత్నానీ ఫోటో షూట్‌ని గుర్తుకు తెస్తున్నారు.. మొత్తానికి మలైకా తన హాట్ ఫోటోలతో ఇయర్ ఎండింగ్‌లోనూ మంట పెడుతోంది.

    English summary
    Malaika Arora Special Photoshoot In Goa.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X