Malaika Arora: నయనతార దంపతులతో మలైకా అరోరా ఫొటో వైరల్.. ఎందుకు కలిశారంటే?

తమిళ లేడి సూపర్ స్టార్ నయనతార ఇటీవల తన బాయ్ ఫ్రెండ్ విగ్నేష్ శివన్ ను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే వీరిద్దరూ కూడా ప్రత్యేకంగా కొంతమంది సెలబ్రిటీలను కలుసుకుంటున్న విధానం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇటీవల వారి పెళ్లికి సంబంధించిన మరి కొన్ని ఫోటోలు కూడా నయనతార సోషల్ మీడియాలో షేర్ చేసుకునే విషయం తెలిసిందే.

అయితే మరికొంతమంది సినీ తారలు కూడా వారితో కలిసి ఉన్న మరికొన్ని ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు. రీసెంట్ గా మలైకా అరోరా కూడా ఈ దంపతులను ప్రత్యేకంగా కలుసుకుంది. అందుకు సంబంధించిన ఫోటో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. ఆ వివరాల్లోకి వెళితే..

 కెరీర్ విషయంలో జాగ్రత్తలు

కెరీర్ విషయంలో జాగ్రత్తలు

స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్న నయనతార ఆ తర్వాత కొన్ని బ్రేకప్స్ తో పర్సనల్ లైఫ్ లో అయితే చాలా ఇబ్బందులు ఎదుర్కొంది. కొన్నాళ్లపాటు ఆమె తీవ్ర స్థాయిలో డిప్రెషన్లోకి వెళ్లిపోయినట్లు కూడా అనేక రకాల కథనాలు పడ్డాయి అయితే ఆమె పర్సనల్ విషయాలను సినిమాలపై ప్రభావం చూపించకుండా చాలా జాగ్రత్తగా ముందుకు సాగింది.

పెళ్లితో సరికొత్త జీవితం

పెళ్లితో సరికొత్త జీవితం

అయితే గత కొంతకాలంగా నయనతార డైరెక్టర్ విగ్నేష్ శివన్ తో ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. ఇక వీరి పెళ్లికి సంబంధించిన గాసిప్స్ అయితే గత రెండేళ్ల నుంచి అందరిని కన్ఫ్యూజన్ కి గురి చేశాయి. అసలు పెళ్లి అవుతుందా లేదా అనే కామెంట్స్ కూడా వచ్చాయి. అంతే కాకుండా మధ్యలో బ్రేకప్ పుకార్లు కూడా వచ్చాయి. కానీ మొత్తనికి ఈ జంట పెళ్లి చేసుకొని వారి సరికొత్త జీవితాన్ని స్టార్ట్ చేశారు.

బాలీవుడ్ లో అవకాశాలు

బాలీవుడ్ లో అవకాశాలు

ఇక ఎన్నో ఏళ్లుగా వరుసగా సినిమాలు చేసుకుంటూ వస్తున్న నయనతార పెళ్లి తర్వాత కూడా అదే తరహాలో బిజీ అయ్యేవిధంగా ప్రణాళికలు రచిస్తుంది. ప్రస్తుతం ఆమెకు బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి కూడా అవకాశాలు వస్తున్నాయి. నెక్స్ట్ షారుక్ ఖాన్ జవాన్ సినిమాలో నటించబోతున్న విషయం తెలిసింది. ఈ క్రమంలో బాలీవుడ్ ఇండస్ట్రీలోని సినీ ప్రముఖులతో కూడా సాన్నిహిత్యం పెంచుకుంటోంది.

మలైకా అరోరాతో ఫొటో వైరల్

మలైకా అరోరాతో ఫొటో వైరల్

రీసెంట్ గా ప్రముఖ బాలీవుడ్ సెలబ్రిటీ మలైకా అరోరా కూడా ప్రత్యేకంగా నయనతారను కలుసుకుంది. ముంబైలో నయనతార విగ్నేష్ ఉన్నారని అక్కడికి వెళ్లిన ఆమె వారితో ప్రత్యేకంగా మాట్లాడి ఒక ఫోటోకు స్టిల్ కూడా ఇచ్చింది. ఇక ఆ బ్యూటిఫుల్ కపుల్ తో దిగిన ఫోటోను ఆమె తన సోషల్ మీడియాలో కూడా షేర్ చేసుకుని వారిద్దరికీ కూడా తన విషెస్ అందించింది.

స్టైలిష్ లుక్

స్టైలిష్ లుక్

మలైకా అరోరా ఉన్న ఫోటో ప్రస్తుతం ఇంటర్నెట్ ప్రపంచంలో ట్రెండింగ్ లిస్టులో చేరిపోయింది. నయనతార విగ్నేష్ ఇద్దరూ కూడా చాలా సింపుల్ గా కనిపించగా మలైకా మాత్రం స్టైలిష్ డ్రెస్ లో తన గ్లామర్ డోస్ తో హైలెట్ అయ్యింది. ఇక మలైకా అరోరా ఎప్పటి నుంచో బాలీవుడ్ యువ నటుడు అర్జున్ కపూర్ తో డేటింగ్ చేస్తోంది. వీరి పెళ్లి కూడా ఇదే ఎడాది జరగనున్నట్లు గతంలోనే చాలా రకాల వార్తలు వచ్చాయి. కానీ ఇంతవరకు ఆ జంట ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X