For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  టాప్‌లెస్ ఫొటోను షేర్ చేసిన ‘గబ్బర్ సింగ్’ బ్యూటీ.. ఘాటు అందాలతో కనువిందు

  |
  Malaika Arora Topless Pic Goes Viral | ఘాటు అందాలతో కనువిందు

  'ఛయ్య ఛయ్య..', 'అనార్కలీ డిస్కో ఛాలీ..', 'మున్నీ బద్నామ్‌ హుయే..' తదితర పాటలతో గుర్తింపు తెచ్చుకున్నారు బోల్డ్ బ్యూటీ మలైకా అరోరా. ఆ తర్వాత ఆమె పలు సినిమాల్లో మెరిసినప్పటికీ ఎందులోనూ హీరోయిన్‌గా కనిపించలేదు. తెలుగులో కూడా 'అతిథి', 'గబ్బర్ సింగ్'లో ఐటమ్ సాంగ్స్ చేసింది. తన బోల్డ్ డ్యాన్స్‌తో ఆకట్టుకుంది. దీంతో ఈమె చాలా పాపులర్ అయిపోయింది. ఆ తర్వాత కొన్ని బోల్డ్ స్టేట్‌మెంట్లు ఇవ్వడం.. అందాల ఆరబోతతో దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయిపోయింది. తాజాగా ఈమె మరోసారి వార్తల్లోకి ఎక్కింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

  అందులో యమ యాక్టివ్

  అందులో యమ యాక్టివ్

  సోషల్ మీడియాలో మాత్రం మలైకా అరోరా ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. నిరంతరం తనకు సంబంధించిన ఫొటోలు, వీడియలోను షేర్ చేస్తోంది. అలాగే, తరచూ తన వ్యక్తిగత విషయాలను పంచుకుంటోంది. ఈ క్రమంలోనే తన ప్రేమ విషయాన్ని కూడా వెల్లడించిన విషయం తెలిసిందే.

  డేటింగ్‌లో ఉన్నామంటూ ప్రకటన

  డేటింగ్‌లో ఉన్నామంటూ ప్రకటన

  మామూలుగానే సెలెబ్రిటీలు ఎవరైనా కలిసి తిరిగితే వాళ్ల మధ్య ఏదోటి ఉందని ప్రచారం చేసేస్తుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో అర్జున్‌ కపూర్‌, మలైకా అరోరా మాత్రం కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్నామని బహిరంగంగానే చెబుతున్నారు. కొద్దిరోజుల క్రితం జరిగిన ‘కాఫీ విత్‌ కరణ్‌' షోలో అర్జున్‌.. మలైకాతో బంధం గురించి బయటపెట్టారు. మలైకా కూడా ఇటీవల అర్జున్‌ ఫొటోను షేర్‌ చేస్తూ ‘అర్జున్ నావాడు' అని పోస్ట్‌ చేసింది.

  ఇద్దరికీ చాలా తేడా

  ఇద్దరికీ చాలా తేడా

  వీళ్లు ప్రేమించుకున్నా అందరిలా ఈ జంటను వదలడం లేదు. దీనికి కారణం వీళ్లిద్దరికీ వయసులో 12 ఏళ్ల తేడా ఉంది. అదీ కాక 45 ఏళ్ల మలైకా అరోరా భర్త అర్భాజ్ ఖాన్‌కు విడాకులు ఇచ్చింది. 33 ఏళ్ల అర్జున్ మాత్రం ఇప్పటి వరకు ఎవరితోనూ డేటింగ్ చేసిన సందర్భాలు కూడా లేవు. అందుకే వీళ్ల ప్రేమ బీ టౌన్‌లోనే కాకుండా దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతోంది.

  ఒకే ఇంట్లో కలిసే ఉంటున్నారు

  ఒకే ఇంట్లో కలిసే ఉంటున్నారు

  ప్రేమ బహిరంగం కావడంతో మలైకా అరోరా, యంగ్ హీరో అర్జున్ కపూర్ కలిసే ఉంటున్నారు. ఎక్కడికెళ్లినా కలిసే వెళ్తున్నారు. ఇలా చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ సోషల్ మీడియాలో సెన్సేషన్ అవుతున్నారు. వీళ్ల ఫొటోలు, వీడియోలో ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతున్నాయి. బాలీవుడ్‌లోని ఫొటోగ్రాఫర్లు కూడా వీళ్లు కనిపిస్తే టక్కున ఫొటోలు కొట్టేస్తున్నారు. అందుకే తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. ఈ క్రమంలోనే బీ టౌన్‌లో చర్చనీయాంశం అవుతున్నారు.

  పెళ్లి వద్దు కానీ ఫుల్లుగా ఎంజాయ్ చేద్దాం

  ప్రస్తుతం డేటింగ్‌ను ఎంజాయ్ చేస్తున్న ఈ జంట త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతుందని కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది. అయితే, ఇటీవల ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. పెళ్లి విషయంలో అర్జున్ కపూర్ ఒత్తిడి తెస్తున్నప్పటికీ మలైకా మాత్రం ఇష్టపడడంలేదట. ఇప్పటికే వివాహ బంధం చేదు అనుభవంగా మిగిలిపోవడంతో ఆమె పెళ్లికి ఆసక్తి చూపడం లేదని బీ టౌన్‌లో వార్తలు వస్తున్నాయి.

  టాప్‌లెస్ ఫొటోతో వచ్చింది

  టాప్‌లెస్ ఫొటోతో వచ్చింది

  ఇక, తాజాగా మలైకా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ ఫొటోను షేర్ చేసింది. అందులో ఆమె సముద్రంలో టాప్ లేకుండా కనిపిస్తోంది. ఈ ఫొటోను బ్యాక్‌ నుంచి తీశారు. మలైకా షేర్ చేసిన కొద్ది సేపటికే ఈ పిక్ ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతోంది. దీంతో ఇది వైరల్ అయిపోయింది. ప్రస్తుతం అందరూ దీని గురించే మాట్లాడుకుంటున్నారు. ఇప్పటికే ఈ ఫొటోను మూడున్నర లక్షల మంది లైక్ చేయడం విశేషం.

  English summary
  Bollywood hunk Arjun Kapoor and Malaika Arora may have only recently gone public with their relationship, but rumours of an impending wedding have long been doing the rounds.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X