ఈ ఫోటోలు, వీడియోలే సాక్ష్యం: విడాకులయ్యాక ఎఫైర్ తప్పు కాదు, హీరోపై జాలి...
బాలీవుడ్ బ్యూటీ, ఐటం గర్ల్ మలైకా అరోరా తన భర్త అర్భాజన్ ఖాన్‌తో విడిపోయిన సంగతి తెలిసిందే. వీరు విడిపోవడానికి కారణం బాలీవుడ్ యంగ్ హీరో, బోనీ కపూర్ కుమారుడు అర్జున్ కపూర్‌తో ఆవిడ ఎఫైర్ పెట్టుకోవడమే అనే ప్రచారం అప్పట్లో జరిగింది.
అంతకు ముందు వరకు చాటు మాటుగా కలిసిన అర్జున్ కపూర్, మలైకా అరోరా విడాకుల ప్రక్రియ పూర్తయిన తర్వాత చట్టాపట్టాలేసుకుని తిరగడం ప్రారంభించారు. పార్టీలకు, ఈవెంట్లకు ఇద్దరూ కలిసి హాజరువుతున్నారు. తాజాగా ఇద్దరూ ఇటలీలో హాలిడే ఎంజాయ్ చేసి వస్తూ ముంబై ఎయిర్‌పోర్టులో మీడియాకు చిక్కారు. వీరు త్వరలో తమ రిలేషన్‌షిప్ అఫీషియల్‌గా ప్రకటించబోతున్నట్లు సైతం ప్రచారం జరుగుతోంది.
విడాకులు ఇచ్చాక తప్పెలా అవుతుంది?
విడాకులకు ముందు మలైకా అరోరా, అర్జున్ కపూర్ ఎఫైర్ గురించి తెలిసిన వారు ఇద్దరూ చాలా పెద్ద తప్పు చేశారంటూ విమర్శించారు. అయితే ఇపుడు వారి రిలేషన్‌షిప్‌కు మద్దతు లభిస్తోంది. ఆవిడకు విడాకులు అయ్యాయి కాబట్టి ఇద్దరూ రిలేషన్‌షిప్‌లో ఉండటం తప్పులేదనే వాదన అభిమానుల నుంచి వినిపిస్తోంది.

మలైకా మాజీ భర్త కూడా మరొకరితో..
మరో వైపు మలైకా అరోరా మాజీ భర్త అర్భాజ్ ఖాన్ సైతం విడాకుల తర్వాత మరొక మహిళతో రిలేషన్లోకి దిగిపోయాడు. జార్జియా ఆండ్రియాని అనే మోడల్‌తో అతడు ఎఫైర్ కొనసాగిస్తున్నట్లు బాలీవుడ్ మీడియా టాక్. దీంతో మలైకా కూడా తన జోరు పెంచింది.

అందరికీ తెలిసేలా మలైకా-అర్జున్ హడావుడి
అయితే ఈ మధ్య కాలంలో అర్జున్ కపూర్, మలైకా అరోరా హడావుడి మరింత పెరిగింది. ఇద్దరూ కలిసి పార్టీలకు హాజరు కావడం, టీవీ షోలలో సందడి చేయడం తరచూ చేస్తున్నారు. మీడియా కంటపడేలా కలియతిరుగుతున్నారు.

పెళ్లి చేసుకుంటారా?
ఇటీవల ఓ టెలివిజన్ షోలో మలైకా-అర్జున్ చేతిలో చెయ్యేసుకుని స్టేజీ ఎక్కడం అందరినీ ఆశ్చర్య పరిచింది. దీంతో ఇద్దరి రిలేషన్‌షిప్ త్వరలో అఫీషియల్ కాబోతోందని, పెళ్లి చేసుకునే అవకాశం కూడా లేక పోలేదని అంటున్నారు.

అతడిని ఇటలీ వెంటబెట్టుకుని వెళ్లింది
అక్టోబర్ 23న మలైకా అరోరా తన పుట్టినరోజు సందర్భంగా అర్జున్ కపూర్‌తో కలిసి ఇటలీ టూర్‌కు వెళ్లి వచ్చింది. ఇండియాలో అంత ఫ్రీడమ్ ఉండదు కాబట్టే ఇద్దరూ ఇటలీ వెళ్లి ఏకాంతంగా గడిపి వచ్చారనే వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.

యంగ్ హీరోపై హీరోపై జాలి
అర్జున్ కపూర్, మలైకా అరోరా తమ రిలేషన్‌షిప్ విషయంలో సంతోషంగానే ఉన్నారు కానీ.... అభిమానులే అర్జున్ కపూర్ మీద జాలి పడుతున్నారు. ఎందుకు జాలిపడుతున్నారో మీకు ఇప్పటికే అర్థమయ్యే ఉంటుంది!


Click it and Unblock the Notifications











