అవకాశాల కోసం పడకగదికి పోలేను.. సీనియర్ నిర్మాతపై హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
సినిమా ఇండస్ట్రీలో కొత్తగా ఎన్నో మార్పులు చోటుచేసుకుంటున్నప్పటికి క్యాస్టింగ్ కౌచ్ ఇబ్బందులు మాత్రం తప్పడం లేదు. సీరియల్స్ నుంచి సినిమాల వరకు చాలా మంది ఎదో ఒక సందర్భంలో చేదు అనుభవాలను ఎదుర్కొంటున్నారు. ఇక రీసెంట్ గా మరొక నటి ఒక సీనియర్ నిర్మాతపై ఎవరు ఊహించని విధంగా కామెంట్ చేసింది. బాలీవుడ్ కి చెందిన మల్హార్ రాథోడ్ పలు సందర్భాల్లో కొందరు తనపై చెడుగా ప్రవర్తించారని తెలిపింది.

కోరిక తిరిస్తేనే..
కొంతమంది నిర్మాతలు దర్శకులు అవకాశాలు ఇస్తామని కోరిక తీర్చమని వేధింపులకు గురి చేస్తారని మరికొందరైతే మరెక్కడా అవకాశాలు రాకుండా వెనకనుంచి కెరీర్ ను దెబ్బ కొట్టే విధంగా ప్రయత్నం చేస్తుంటారని మల్హార్ రాథోడ్ వివరణ ఇచ్చింది. అదే విధంగా సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు రావడం అనేది అంత ఈజీగా జరిగిపోదని ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తోందని అన్నారు.

సీనియర్ నిర్మాత అసభ్య ప్రవర్తన..
8 ఏళ్ళ కిందట ఒక సీనియర్ నిర్మాత తనపై అసభ్యంగా ప్రవర్తించడాని చెబుతూ అసలు విషయాలను బయటపెట్టింది ఈ నటి. ఆమె .మాట్లాడుతూ.. సీరియల్ లో నటిగా అవకాశం ఇస్తాను అని ఒక 65ఏళ్ళ నిర్మాత రూమ్ లోకి రమ్మన్నాడు. షర్ట్ బటన్ విప్పేయ్ కాస్త నిన్ను చూడాలని అసభ్యకరంగా ప్రవర్తించాడు. అది విని నేను ఒక్కసారిగా షాక్ అయ్యాను.

నో చెప్పేసా..
ఆ నిర్మాత వ్యవహరించిన తీరుకు నాకు చాలా కోపం వచ్చిందని చెప్పిన మల్హార్.. వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయానని తెలిపింది. తనకు మొదటిసారి ఎదురైన లైంగిక వేధింపులకు కొన్నిరోజుల పాటు ఎంతో మనోవేదనకు లోనైనట్లు చెబుతూ.. చాలా వరకు ఇండస్ట్రీలో ఇలాంటి వ్యక్తులే ఉన్నారని సీరియస్ గా కామెంట్స్ చేసింది.
Recommended Video

నా ఫ్యామిలీకి నేనే ఆధారం..
ఆ సమయంలో నటిగా నన్ను నేను నిరూపించుకోవాలని ఎంతగానో ప్రయత్నం చేశాను. ఓ విధంగా ఆర్ధికంగా కూడా నా కుటుంబానికి నేనే ఆధారం. అయితే అవకాశాల కోసం నేను ఎన్నడు చెడ్డ దారుల్లో నడవలేదు. నిజాయితీగా అందుకునే చిన్న పాత్ర అయినా నాకు ఇష్టమే అని మల్హర్ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలియజేసింది.


Click it and Unblock the Notifications











