twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    డైరెక్టర్లు అర్ధరాత్రి ఫోన్ చేసి పడకగదికి రా అనేవారు.. హీరోలు వేధించారు..

    By Rajababu
    |

    Recommended Video

    కాస్టింగ్ కౌచ్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన మల్లికా షెరావత్

    శృంగార పాత్రలతో యువతకు పిచ్చెక్కించిన మల్లికా షెరావత్ సిల్వర్ స్క్రీన్‌పై సెక్సీ క్వీన్ అనిపించుకొన్నారు. హాట్‌గా, బోల్డ్‌గా నటించేందుకు రెడీగా ఉండటంతో నిర్మాతలు, డైరెక్టర్లు, బడా హీరోలు వెంటపడ్డారు. ఆ క్రేజ్ ఎక్కువ కాలం నిలబెట్టుకోలేకపోయింది మల్లికా షెరావత్. అయితే నేను కాంప్రమైజ్ కాకపోవడమే అందుకు కారణమని ఆమె చెప్పింది. ఇటీవల పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలను బయటపెట్టింది.

    దుర్మార్గంగా ప్రవర్తించేవారు

    దుర్మార్గంగా ప్రవర్తించేవారు

    సినీ పరిశ్రమలో మరెవరిపై లేనంతగా నాపై ఎన్నో ఆరోపణలు, విమర్శలు ఉన్నాయి. తెర మీద పొట్టి దుస్తులు ధరించినా, లేదా ముద్దులు పెట్టుకొన్నా నాకు నైతిక విలువలు బొత్తిగా లేవని అనే వాళ్లు. హీరోలు, డైరెక్టర్లు, నిర్మాతలు నాతో చాలా దుర్మార్గంగా ప్రవర్తించేవారు. అందుకోసమే సినిమాలను వదులుకోవాల్సి వచ్చింది అని మల్లిక చెప్పారు.

    బయట నాతో ప్రైవేటుగా గడపవా?

    బయట నాతో ప్రైవేటుగా గడపవా?

    తెర మీద చాలా బోల్డుగా ఉంటావు. బయట నాతో అతి సన్నిహితంగా ఎందుకు ఉండవు. ప్రైవేట్‌గా నాతో గడపడానికి నీకేం ప్రాబ్లెం అని సినీ ప్రముఖులు వేధించేవారు. దాంతో కొన్ని సినిమాల్లో వేషాలు వదులుకొన్నాను. ఇలాంటివి మన దేశంలో మహిళలపట్ల పురుషులకు ఉండే అభిప్రాయాన్ని చెబుతాయి అని మల్లిక చెప్పారు.

    నేను కాంప్రమైజ్ కాను

    నేను కాంప్రమైజ్ కాను

    స్వతహాగా ఎలాంటి ప్రలోభాలకు నేను కాంప్రమైజ్ కాను. నాకు తలబిరుసు ఎక్కువ. నాకు ఆత్మగౌరవం కూడా ఎక్కువే. కొన్నిసార్లు డైరెక్టర్లు రాత్రి 3 గంటలకు ఫోన్ చేసి వాళ్ల పడక గదికి రమ్మనేవారు. ఇలాంటి విషయాలను జీవితంలో ఎన్నో చూశాను అని మల్లిక వెల్లడించారు.

    నాపై ఓ నిర్ణయానికి వచ్చేవారు

    నాపై ఓ నిర్ణయానికి వచ్చేవారు

    నేను చేసే పాత్రలను బట్టి వారు నా గురించి ఓ నిర్ణయానికి వచ్చేవారు. దాంతో నేను అభద్రతాభావానికి గురయ్యేదానిని. అలాంటి సమయాల్లో నేను చేసేది సరైందా కాదా అని నాకు నేను ప్రశ్నించుకొనేదానిని. అంతేకాకుండా మీడియా కూడా నాకు వ్యతిరేకంగా, ప్రతికూలంగా వ్యవహరించేది అని షెరావత్ పేర్కొన్నారు.

    నాపై చిన్నచూపు ఉండేది

    నాపై చిన్నచూపు ఉండేది

    నా జీవితాన్ని నిలబెట్టుకోవడానికి ఎన్నో పోరాటాలు చేయాల్సి వచ్చేది. అయినా నాపై చిన్నచూపు ఉండేది. నా ప్రతిభను ఎవరు గుర్తించకపోగా.. ఎన్ని ముద్దులు పెట్టుకొన్నానని లెక్కపెట్టేవారు. అలాంటివి నాలో అభద్రతాభావాన్ని పెంచాయి. ఎన్నో సమస్యల మధ్య నలిగిపోయాను అని షెరావత్ ఆవేదన వ్యక్తం చేశారు.

    English summary
    Mallika Sherawat said that I was thrown out of films for refusing to get intimate with heroes off screen. She said that "I'm a very headstrong woman, I can't compromise. I've a lot of pride and self respect. There were times when directors have called me and said 'come to me at 3 am.'
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X