twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    స్టార్ హీరోలకు నేను నచ్చక వారి గర్ల్‌ఫ్రెండ్స్‌ని తెచ్చుకున్నారు.. మల్లికా సెన్సేషన్

    |

    Recommended Video

    Mallika Sherawat Fires On Bollywood Star Heros || Filmibeat Telugu

    2004 సంవత్సరంలో 'మర్డర్‌' చిత్రంతో బాలీవుడ్‌ తెరకు పరిచయమైంది మల్లికా శెరావత్. ఈ సినిమాలో బోల్డ్ సన్నివేశాల్లో నటించి ఆకట్టుకున్న ఈ భామ.. ఆ తర్వాత పలు సినిమాల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది. హాలీవుడ్ చిత్రాల్లోనూ అడుగుపెట్టిన మల్లికా అక్కడ కూడా టాలెంట్ చూపించింది. వీటన్నింటి మించి ఐటెం సాంగ్స్ ద్వారా మల్లికకు భారీ క్రేజ్ లభించింది. అయితే తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్‌లో జరిగిన అన్యాయాలను పేర్కొంటూ హీరోలపై విరుచుకు పడింది మల్లిక. ఆ వివరాలేంటో చూద్దామా..

    బాలీవుడ్ స్టార్ హీరోల గురించి

    బాలీవుడ్ స్టార్ హీరోల గురించి

    బాలీవుడ్ స్టార్ హీరోలు స్వార్థంతో వ్యవహరిస్తారని అంటోంది మల్లిక. తన కెరీర్‌లో ఎన్నో చిత్రాల్లో అవకాశం వచ్చిందని, కానీ ఆ సినిమాల్లో నటించే హీరోలు తనను కావాలనే తప్పించి వారి వారి గర్ల్ ఫ్రెండ్స్‌ను తెచ్చుకొని సినిమాలు చేశారని సంచలన ఆరోపణలు గుప్పించింది మల్లికా శెరావత్.

    నా అభిప్రాయాలు నాకున్నాయి.. అందుకే

    నా అభిప్రాయాలు నాకున్నాయి.. అందుకే

    సినిమాల్లో నటించే విషయంలో తనకంటూ కొన్ని వ్యక్తిగత అభిప్రాయలు ఉంటాయని పేర్కొంది మల్లిక. అయితే అవి సదరు హీరోలకు నచ్చక, ఆ ప్రాజెక్టు నుంచి తనను తప్పించే ప్రయత్నాలు చేసేవారని మల్లిక చెప్పుకొచ్చింది. ఆ రకంగా దాదాపుగా 30 సినిమాల్లో అవకాశాలు కోల్పోయానని చెప్పింది. అలాంటి వ్యక్తిత్వం గల హీరోలను తాను మూర్ఖుల కింద లెక్కగడతానని ఆమె తెలిపింది.

     హీరోయిన్లు కూడా నాపై వ్యతిరేకంగా

    హీరోయిన్లు కూడా నాపై వ్యతిరేకంగా

    తాను మహిళల పట్ల జరుగుతున్న అన్యాయాలపై మొదటి నుంచీ పోరాడుతున్నా తనను ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది మల్లిక శెరావత్. ఈ విషయంలో సినీ పెద్దలు, మీడియా కూడా ఎలాంటి సహకారం అందించకపోవడం దురదృష్టకరమని పేర్కొంది. కొందరు హీరోయిన్లు కూడా తనపై వ్యతిరేకంగా మాట్లాడుతుండటం బాధాకరమని ఈ సందర్భంగా ఆమె తెలిపింది.

     తప్పుడు అభిప్రాయం ఏర్పర్చుకొని

    తప్పుడు అభిప్రాయం ఏర్పర్చుకొని

    తెరవెనుక చనువుగా ఉండకపోవడం వల్లే తనను చాలా సినిమాల నుంచి తీసేశారని, తన ప్రతిభకు తగిన అవకాశాలు రాలేదని గతంలో కూడా ఆవేదన వ్యక్తం చేసింది. తాను పోషించిన పాత్రల ఆధారంగా తనపై తప్పుడు అభిప్రాయం ఏర్పరచుకున్నారని, బయట కూడా అలాగే ఉండాలని ఒత్తిడి చేశారని అప్పట్లో వ్యాఖ్యానించి సంచలనం సృష్టించింది. ఇండస్ట్రీలో తనకు ‘బోల్డ్ నటి' అని పేరు రావడానికి తోటి నటీనటులే కారణమని పేర్కొంది మల్లిక శెరావత్.

    English summary
    Actor Mallika Sherawat says she lost out on a number of projects as male actors could not stomach her opinionated nature and replaced her with their girlfriends.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X