For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నా బొడ్డు మీద ఆమ్లేట్.. మల్లికా షెరావత్‌పై దర్శకుడి వికృత చేష్టలు

|
Mallika Sherawat Fires On Bollywood Director || Filmibeat Telugu

'మర్డర్‌' సినిమా ద్వారా బాలీవుడ్‌ తెరకు పరిచయమై ఆ తర్వాత పలు ఐటెం సాంగ్స్‌లో నర్తించింది మల్లికా షరావత్‌. బోల్డ్ యాక్ట్రెస్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మల్లికా తాజాగా జరిగిన ఓ కార్యక్రమంలో సంచలన వ్యాఖ్యలు చేసింది. ఓ సాంగ్ చిత్రీకరణలో భాగంగా దర్శకుడు తనపై వికృత చేష్టలకు పాల్పడ్డాడని పేర్కొంది. వివరాల్లోకి పోతే..

మీటూ ఎఫెక్ట్.. మహిళల ముందగుడు

సినీ ఇండస్ట్రీలో మహిళలపై జరుగుతున్న వేధింపులను బట్టబయలు చేసింది మీటూ ఉద్యమం. ఎక్కడో హాలీవుడ్‌లో మొదలైన ఈ ఉద్యమ ప్రభావం క్రమంగా బాలీవుడ్‌లో ప్రవేశించి సంచనల విషయాలను బయటపెట్టింది. ఇందులో భాగంగా తమపై జరిగిన లైంగిక వేధింపులను బయటపెడుతూ దైర్యంగా ముందుకొస్తున్నారు పలువురు నటీమణులు. కాగా తాజాగా ఓ దర్శకుడి కీచక గుణాన్ని తెలుపుతూ ఓపెన్ అయింది మల్లికా శరావత్‌.

అందాలను వర్ణిస్తూ.. ఓపెన్‌గా చెప్పేసిన మల్లికా

మల్లిక తాజా చిత్రం 'బూ..సబ్కి ఫేటేగి'. ఈ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా కపిల్ శర్మ షోలో పాల్గొంది మల్లికా శరావత్‌. ఆమె అందాలను వర్ణిస్తూ మల్లికను సరదాగా ఆట పట్టించాడు కపిల్ శర్మ. అయితే తనపై కపిల్ చేసిన కామెంట్స్‌ని సరదాగా తీసుకున్న మల్లిక.. ఆ తర్వాత రియాక్ట్ అవుతూ తన అందం, శరీరంపై ఓ దర్శకుడు చేసిన వికృత చేష్టల తాలూకు విషయాలను బటయపెట్టింది.

నా నడుముపై వికృత చేష్టలు

''కొందరు దర్శకులు నా అందాలను వికృతంగా వినియోగించుకోవాలని చూశారు. నేను చేస్తున్న ఓ పాటలో భాగంగా నా నడుము అందాలను ఆకర్షణీయంగా చూపించాలని దర్శక, నిర్మాతలు చెప్పారు. అయితే అందుకు నేను ఓకే చెప్పేశాను. కానీ తీరా సెట్స్ పైకి వచ్చాక నా బొడ్డుపై ఆమ్లేట్ వేయాలని చూశారు. అదే విషయాన్ని నన్ను అడిగితే మతిపోయింది. కానీ నేను సీరియస్‌గా నో చెప్పాను. హీరోయిన్ బొడ్డు మీద ఆమ్లేట్ వేసే సీన్ హాలీవుడ్ సినిమాలో ఉంది. దానిని చూసి ఇక్కడ కూడా చేద్దామనుకొన్నారని చెప్పారు.

తప్పుడు అభిప్రాయం ఏర్పర్చుకొని

తెరవెనుక చనువుగా ఉండకపోవడం వల్లే తనను చాలా సినిమాల నుంచి తీసేశారని, తన ప్రతిభకు తగిన అవకాశాలు రాలేదని గతంలో కూడా ఆవేదన వ్యక్తం చేసింది మల్లిక శెరావత్. తాను పోషించిన పాత్రల ఆధారంగా తనపై తప్పుడు అభిప్రాయం ఏర్పరచుకున్నారని, బయట కూడా అలాగే ఉండాలని ఒత్తిడి చేశారని అప్పట్లో వ్యాఖ్యానించి సంచలనం సృష్టించింది. ఇండస్ట్రీలో తనకు ‘బోల్డ్ నటి' అని పేరు రావడానికి తోటి నటీనటులే కారణమని మల్లిక శెరావత్ తెలిపింది.

English summary
Actor Mallika Sherawat says she lost out on a number of projects as male actors could not stomach her opinionated nature and replaced her with their girlfriends. Now she was once again open her voice and fire on bollywood director
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more