twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మల్లికా షెరావత్ బోల్డ్ అవతార్... ఆమె పరిస్థితి అందుకే ఇలా అయిందా?

    |

    ఇండియన్ సినిమా ప్రేక్షకులకు ముద్దు సీన్లు, ఘాటైన శృంగార సన్నివేశాలు పెద్దగా పరిచయం లేని రోజుల్లో 'మర్డర్' మూవీలో తన నటనతో యావత్ భారత దేశాన్ని ఊర్రూతలూగించింది బాలీవుడ్ బ్యూటీ మల్లికా షెరావత్. ఆ మూవీ తర్వాత నుంచే భారతీయ సినిమాల్లో లిప్ లాక్ సీన్లు, పడకగది సీన్ల జోరు పెరిగింది.

    ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్ అన్నట్లు.... మర్డర్ మూవీ చూసిన చాలా మంది ఆ సినిమాలో మల్లికా నటించిన హాట్ సీన్లు ఇచ్చిన కిక్కు మరే సినిమా ఇవ్వలేక పోతున్నాయని వాపోతుంటారు. అలా సెన్సేషన్ క్రియేట్ చేసిన మల్లికా షెరావత్ బాలీవుడ్ ఇండస్ట్రీలో సెక్స్ బాంబ్‌గా పేరు తెచ్చుకుందే కానీ... స్టార్ హీరోయిన్ రేంజికి వెళ్లలేక పోయింది.

    వారియర్ ప్రిన్సెస్ లుక్‌లో మల్లికా షెరావత్ బోల్డ్ అవతార్

    వారియర్ ప్రిన్సెస్ లుక్‌లో మల్లికా షెరావత్ బోల్డ్ అవతార్

    అడపా దడపా సినిమాల్లో మెరుస్తున్న మల్లికా షెరావత్... త్వరలో ఓ ఇంటర్నేషనల్ మూవీలో కనిపించబోతోంది. ప్రస్తుతం ఆమె ‘టైమ్ రైడర్స్' అనే చిత్రంలో నటిస్తోంది. ఇందులో ఆమె వారియర్ ప్రిన్సెస్ పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన లుక్ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు.

    అభిమానులను ఆకట్టుకుంటున్న లుక్

    అభిమానులను ఆకట్టుకుంటున్న లుక్

    ప్రాచీనకాలం నాటి అవతారంలో... మల్లికా తన ఒంపుసొంపులను ప్రదర్శిస్తున్న తీరు అభిమానులను ఆకట్టుకుంటోంది. విభిన్నమైన వస్త్రధారణలో మల్లికా షెరావత్ లుక్ బావుందంటూ ఫ్యాన్స్ కామెంట్లు చేయడంతో పాటు దీన్ని వైరల్ చేశారు.

    కాంట్రవర్సల్ స్టేట్మెంట్లతో వార్తల్లో...

    కాంట్రవర్సల్ స్టేట్మెంట్లతో వార్తల్లో...

    తనకు సినిమాలు తగ్గిపోవడంపై మల్లికా షెరావత్ ఇటీవల ఓ వివాదాస్పద కామెంట్ చేశారు. తాను ఏ హీరోకు, దర్శకుడికి, నిర్మాతకు గర్ల్ ఫ్రెండుగా లేని కారణంగా చాలా సినిమాలు కోల్పోవాల్సి వచ్చిందని... చాలా మంది ఫిల్మ్ మేకర్స్ తమకు గర్ల్‌ఫ్రెండుగా ఉన్నవారినే తమ సినిమాల్లో హీరోయిన్లుగా తీసుకుంటూ, నాలాంటి వారిని బయటకు తోసేస్తున్నారని వ్యాఖ్యానించారు.

    హీరోతో డేటింగ్ చేయక పోవడంతో నా కెరీర్ దెబ్బ తీసింది

    హీరోతో డేటింగ్ చేయక పోవడంతో నా కెరీర్ దెబ్బ తీసింది

    హీరోతో డేటింగ్ చేయడానికి ఒప్పుకోని కారణంగా నేను చాలా సినిమాల్లో పాత్రలు కోల్పోయాను. కొందరు దర్శకులు, నిర్మాతలు తమకు గర్ల ఫ్రెండుగా వ్యవహరిస్తూ వారి కోరికలు తీర్చే వారినే సినిమాల్లోకి తీసుకుంటున్నారు అంటూ... మల్లికా షెరావత్ చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి.

    English summary
    Mallika Sherawat posted the first look on social media with a caption that read, "Getting ready to play a warrior princess in my international film TimeRaiders". The picture showed Mallika flaunting her curves in a primitive avatar.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X