twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మందిర, 4ఏళ్ల చిన్నారి దత్తత

    |

    ఫ్యాష‌న్ డిజైన‌ర్‌గా, క్రికెట్ కామెంటేటర్‌గా హీరోయిన్ గా ప‌లురంగాల‌లో త‌న‌దైన ముద్ర వేసిన మందిరా బేడి...గ్లామర్‌ ఫీల్డ్ లో కొనసాగుతూనే ఫ్యాషన్ డిజైనర్‌గా రాణిస్తోంది. బిజీ లైఫ్ లోనూ కుటుంబానికి అత్యంత ప్రాధాన్యమిచ్చే మందిర ఓ చిన్నారికి తల్లిగానూ తన బాధ్యతలను నిర్వర్తిస్తోంది. తాజాగా నాలుగేళ్ళ చిన్నారిని ద‌త్త‌త తీసుకుని మరోసారి వార్తలకెక్కింది ఈ బ్యూటీ.

    తన కుమార్తె తారాను ఇటీవలే లోకానికి పరిచయం చేసి సోషల్ మీడియా ద్వారా చిన్నారికి స్వాగతం పలుకుతున్నట్టు వెల్లడించారు మంది ర దంపతులు. అయితే గతంలోనే ఓ చిన్నారిని దత్తత తీసుకోవాలనుకుంటున్నట్లు ప్రకటించిన మందిరా .. చంటిపిల్లే కానక్కర్లేదు, రంగు రూపుతో సంబంధం లేదు, ఆడపిల్ల కావాలని కూడా స్పష్టం చేసింది.

    Mandira Bedi adopts 4-year-old-girl

    తాజాగా అన్న మాట ప్రకారం నాలుగేళ్ల చిన్నారిని దత్తత తీసుకున్నామని ప్రకటించింది. తన కుమారుడు కూడా తారాను ఎంతో ప్రేమగా చూసుకుంటున్నాడని, తారా తమ ఇంటికి రావడం ఓ వరంలా భావిస్తున్నామని మందిరా తెలిపింది.

    2020 జులై 28న తారా వారి కుటుంబంలో ఒకటైందని మురిసిపోయింది. ఈ విషయం తెలిసిన ఇండస్ట్రీ స్నేహితులు ఈ దంపతులపై ప్రసంశల వర్షం కురిపిస్తున్నారు.

    English summary
    Mandira Bedi and her filmmaker husband, Raj Kaushal, have adopted a 4-year-old girl. They welcomed the new addition to their family in July, earlier this year, but have now officially announced her to the world.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X