Don't Miss!
- Sports ఆ భారత కుర్రాడు మామూలోడు కాదు- లారా
- Technology స్మార్ట్‌వాచ్ సెగ్మెంట్లోకి ప్రముఖ సంస్థ.. 8 రోజుల బ్యాటరీ లైఫ్, హెల్త్ ట్రాకర్లతో ProWatch విడుదల..!
- News సంచలన నిర్ణయం తీసుకున్న దక్షిణ మధ్య రైల్వే
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Automobiles వందేళ్ల వయసులో తాత జోరు.. 50 ఏళ్ల ప్రీమియర్ పద్మినిలో షికారు.. వీడియో చూసేయండి
- Lifestyle నిద్రపోకపోతే వచ్చే సమస్యలివే.. తీవ్రంగా హెచ్చరిస్తున్న పరిశోధకులు..!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మందిర, 4ఏళ్ల చిన్నారి దత్తత
ఫ్యాషన్ డిజైనర్‌గా, క్రికెట్ కామెంటేటర్‌గా హీరోయిన్ గా పలురంగాలలో తనదైన ముద్ర వేసిన మందిరా బేడి...గ్లామర్ ఫీల్డ్ లో కొనసాగుతూనే ఫ్యాషన్ డిజైనర్‌గా రాణిస్తోంది. బిజీ లైఫ్ లోనూ కుటుంబానికి అత్యంత ప్రాధాన్యమిచ్చే మందిర ఓ చిన్నారికి తల్లిగానూ తన బాధ్యతలను నిర్వర్తిస్తోంది. తాజాగా నాలుగేళ్ళ చిన్నారిని దత్తత తీసుకుని మరోసారి వార్తలకెక్కింది ఈ బ్యూటీ.
తన కుమార్తె తారాను ఇటీవలే లోకానికి పరిచయం చేసి సోషల్ మీడియా ద్వారా చిన్నారికి స్వాగతం పలుకుతున్నట్టు వెల్లడించారు మంది ర దంపతులు. అయితే గతంలోనే ఓ చిన్నారిని దత్తత తీసుకోవాలనుకుంటున్నట్లు ప్రకటించిన మందిరా .. చంటిపిల్లే కానక్కర్లేదు, రంగు రూపుతో సంబంధం లేదు, ఆడపిల్ల కావాలని కూడా స్పష్టం చేసింది.
తాజాగా అన్న మాట ప్రకారం నాలుగేళ్ల చిన్నారిని దత్తత తీసుకున్నామని ప్రకటించింది. తన కుమారుడు కూడా తారాను ఎంతో ప్రేమగా చూసుకుంటున్నాడని, తారా తమ ఇంటికి రావడం ఓ వరంలా భావిస్తున్నామని మందిరా తెలిపింది.
2020 జులై 28న తారా వారి కుటుంబంలో ఒకటైందని మురిసిపోయింది. ఈ విషయం తెలిసిన ఇండస్ట్రీ స్నేహితులు ఈ దంపతులపై ప్రసంశల వర్షం కురిపిస్తున్నారు.