For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

డ్రస్సులు అంతా చెండాలమా? దేవుడు కోరినా దిగజారొద్దు.. మందిరా బేడికి..

|

ఇటీవల అమెరికాలోని న్యూయార్క్‌లో జరిగిన మెట్ గాలా ఈవెంట్ ఎప్పుడూ లేని విధంగా అభాసుపాలైంది. ప్రియాంక చోప్రా, దీపిక పదుకోన్, ఇషా అంబానీ, లేడీ గాగా, క్యాటీ పెర్రీ లాంటి సెలబ్రిటీలు విచిత్ర వేషధారణలతో బెంబేలెత్తించారు. కొందరి వస్త్రాలంకరణ అనేక విమర్శలకు లోనైంది. ముఖ్యంగా ప్రియాంక చోప్రా డ్రెస్పింగ్ అత్యంత వివాదాస్పదంగా మారింది. మెట్ గాలా ఈవెంట్‌లో తారల దుస్తుల ధరించిన విషయంపై నెటిజన్లతోపాటు అందాల భామ మందిరా బేడి కూడా ఫైర్ అయ్యారు. ఆమె వ్యక్తం చేసిన అభిప్రాయం ఏమిటంటే..

మెట్ గాలా ఈవెంట్‌లో దారుణంగా

మెట్ గాలా ఈవెంట్‌లో కొందరు మహిళా సెలబ్రిటీలు ధరించిన దుస్తులపై దారుణమైన, రకరకాల కామెంట్లు వినిపిస్తున్నాయి. నిజానికి వారు ధరించిన డ్రస్సులు చాలా చెండాలంగా ఉన్నాయి. మెట్ గాలా వివాదంలోకి తలదూర్చడం నిజంగా నా పని కాదు. అందుకు సారీ చెబుతున్నాను. భగవంతుడి కోసమైనా అంత దారుణంగా కనిపించకూడదు అని మందిరా బేడీ ట్వీట్ చేసింది.

మందిరా బేడీ ట్వీట్‌పై స్పందన

మందిరా బేడి చేసిన ట్వీట్‌కు అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. మందిరా బేడి స్పందించిన తీరును అందరూ సమర్ధించారు. పబ్లిక్ డొమైన్‌లో ఉన్నప్పుడు దుస్తుల విషయంలో జాగ్రత్తగా వ్యవహారించాలి. ప్రజలు, అభిమానులు నోచ్చుకోకుండా చర్యలు తీసుకోవాలి అని పలువురు నెటిజన్లు స్పందించారు.

క్రికెట్ కామెంటరీతో హాట్ హాట్‌గా

ఇక మందిరా బేడి విషయానికి వస్తే, బాలీవుడ్ నటిగా కన్నా క్రికెట్ కామెంటేటర్‌గా సుపరిచితులు. నూడుల్ స్ట్రాప్ జాకెట్‌తో ముద్దు ముద్దుగా క్రికెట్ గురించి మాట్లాడుతూ.. క్రీడాభిమానులను ఆకట్టుకొన్నారు. గత కొద్దికాలంగా క్రికెట్ కామెంటరీకి కూడా దూరమయ్యారు. ఇప్పుడిప్పుడే సినిమాలపై ఫోకస్ పెడతున్నారు.

సాహోలో స్పెషల్‌గా మందిరా బేడీ

మందిరా బేడి సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆమె నటించిన తాష్కెంట్ ఫైల్స్ చిత్రం విడుదలై మంచి ప్రేక్షకాదరణ పొందింది. ఈ చిత్రంలో ఇందిరా జోసెఫ్ రాయ్ అనే పాత్రలో కనిపించింది. ఇక టాలీవుడ్ చిత్రం సాహోలో ఓ కీలక పాత్రను పోషిస్తున్నారు. ఈ చిత్రం ఆగస్టు 15న రిలీజ్ కానున్నది.

English summary
Met Gala Event 2019 becomes most contraversy in these times. Priyanka Chopra and other celebraties dressing are become very ridiculous. On this contraversy, Mandira Bedi reacted and tweete that, "People are oooohing and aaaahing all day, over some women who are looking absolutely ridiculous in the clothes they are wearing. I’m sorry to say I don’t get this #Metgala thing. Follow the theme, yes, but don’t look absurd for God’s sake".
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more