Don't Miss!
- Finance Adani News: గౌతమ్ అదానీ తిరిగొచ్చిన మంచిరోజులు.. ఆ 5 కంపెనీల్లో సంచలనం..
- Technology OnePlus Flip వన్‌ప్లస్ ఫ్లిప్ ఫోన్ కీలక వివరాలు లీక్... టెలిఫోటో కెమెరా సహా కీలక ఫీచర్లు..!
- Travel ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్ ప్యాకేజీ..వివరాలివే..!
- News కాంగ్రెస్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే: రేవంత్‌తో భేటీ: గ్రేటర్ హైదరాబాద్‌లో భారీ షాక్
- Lifestyle డిఫరెంట్ స్టైల్ లో నోనూరించే మటన్ రోస్ట్
- Automobiles 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్‌కు పండగే
- Sports వరుస పరాజయాల వేళ.. ఆర్సీబీ, కోహ్లీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
డ్రస్సులు అంతా చెండాలమా? దేవుడు కోరినా దిగజారొద్దు.. మందిరా బేడికి..
ఇటీవల అమెరికాలోని న్యూయార్క్‌లో జరిగిన మెట్ గాలా ఈవెంట్ ఎప్పుడూ లేని విధంగా అభాసుపాలైంది. ప్రియాంక చోప్రా, దీపిక పదుకోన్, ఇషా అంబానీ, లేడీ గాగా, క్యాటీ పెర్రీ లాంటి సెలబ్రిటీలు విచిత్ర వేషధారణలతో బెంబేలెత్తించారు. కొందరి వస్త్రాలంకరణ అనేక విమర్శలకు లోనైంది. ముఖ్యంగా ప్రియాంక చోప్రా డ్రెస్పింగ్ అత్యంత వివాదాస్పదంగా మారింది. మెట్ గాలా ఈవెంట్లో తారల దుస్తుల ధరించిన విషయంపై నెటిజన్లతోపాటు అందాల భామ మందిరా బేడి కూడా ఫైర్ అయ్యారు. ఆమె వ్యక్తం చేసిన అభిప్రాయం ఏమిటంటే..
మెట్ గాలా ఈవెంట్లో దారుణంగా
మెట్ గాలా ఈవెంట్లో కొందరు మహిళా సెలబ్రిటీలు ధరించిన దుస్తులపై దారుణమైన, రకరకాల కామెంట్లు వినిపిస్తున్నాయి. నిజానికి వారు ధరించిన డ్రస్సులు చాలా చెండాలంగా ఉన్నాయి. మెట్ గాలా వివాదంలోకి తలదూర్చడం నిజంగా నా పని కాదు. అందుకు సారీ చెబుతున్నాను. భగవంతుడి కోసమైనా అంత దారుణంగా కనిపించకూడదు అని మందిరా బేడీ ట్వీట్ చేసింది.
మందిరా బేడీ ట్వీట్‌పై స్పందన
మందిరా బేడి చేసిన ట్వీట్‌కు అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. మందిరా బేడి స్పందించిన తీరును అందరూ సమర్ధించారు. పబ్లిక్ డొమైన్లో ఉన్నప్పుడు దుస్తుల విషయంలో జాగ్రత్తగా వ్యవహారించాలి. ప్రజలు, అభిమానులు నోచ్చుకోకుండా చర్యలు తీసుకోవాలి అని పలువురు నెటిజన్లు స్పందించారు.
క్రికెట్ కామెంటరీతో హాట్ హాట్‌గా
ఇక మందిరా బేడి విషయానికి వస్తే, బాలీవుడ్ నటిగా కన్నా క్రికెట్ కామెంటేటర్‌గా సుపరిచితులు. నూడుల్ స్ట్రాప్ జాకెట్‌తో ముద్దు ముద్దుగా క్రికెట్ గురించి మాట్లాడుతూ.. క్రీడాభిమానులను ఆకట్టుకొన్నారు. గత కొద్దికాలంగా క్రికెట్ కామెంటరీకి కూడా దూరమయ్యారు. ఇప్పుడిప్పుడే సినిమాలపై ఫోకస్ పెడతున్నారు.
సాహోలో స్పెషల్‌గా మందిరా బేడీ
మందిరా బేడి సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆమె నటించిన తాష్కెంట్ ఫైల్స్ చిత్రం విడుదలై మంచి ప్రేక్షకాదరణ పొందింది. ఈ చిత్రంలో ఇందిరా జోసెఫ్ రాయ్ అనే పాత్రలో కనిపించింది. ఇక టాలీవుడ్ చిత్రం సాహోలో ఓ కీలక పాత్రను పోషిస్తున్నారు. ఈ చిత్రం ఆగస్టు 15న రిలీజ్ కానున్నది.