కష్టాల్లో కంగనా రనౌత్.. ఎఫ్ఐఆర్ నమోదుకు కోర్టు ఆదేశం

బాలీవుడ్ నటి కంగనరనౌత్‌కు మరో ఎదురు దెబ్బ తగిలింది. ఇప్పటికే వరుసగా కోర్టు నోటీసులను అందుకొంటున్న ఫైర్‌బ్రాండ్‌ కాపీరైట్స్ ఉల్లంఘన కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటూ ముంబై పోలీసులకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దిడ్డా: ది వారియర్ క్వీన్ ఆఫ్ కశ్మీర్ పుస్తక రచయిత ఆశీష్ కౌల్ ఫిర్యాదు మేరకు కోర్టు తీవ్రంగా స్పందించింది.

దిడ్డా: ది వారియర్ క్వీన్ ఆఫ్ కశ్మీర్ పుస్తకం నుంచి కొంత కంటెంట్‌ను తమ అనుమతి లేకుండా తీసుకొన్నదని రచయిత ఆశీష్ కౌల్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. మణికర్ణిక రిటర్న్స్: ది లెజెండ్ ఆఫ్ దిడ్డా కోసం తన పుస్తకంలోని మెటీరియల్ వాడుకొన్నదని ఆరోపించారు.

Manikarnika Returns: Copyright infringement case on Kangana Ranaut

లోహర్ (పూంచ్) యువరాణి, కశ్మీర్ రాణి దిడ్డా జీవిత కథ ఆధారంగా మణికర్ణిక రిటర్న్స్‌ను తెరకెక్కించేందుకు కంగన రనౌత్ సిద్దమయ్యారు.

కౌల్ దాఖలు చేసిన పిటిషన్ పక్కన పడితే.. కంగన రనౌత్ ఇటీవల ట్విట్టర్‌లో మణికర్ణిక సినిమాపై స్పందించారు. దిడ్డా రాణి చరిత్రను వెండితెర మీద గొప్పగా చిత్రీకరించబోతున్నాం. ఈ సినిమాను వరల్డ్ క్లాస్ మూవీగా మీ ముందు ఉంచుతాం అని ట్వీట్‌లో పేర్కొన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X