మరోసారి హృతిక్ రోషన్-కంగనా వార్... అందరిలోనూ ఆసక్తి!
బాలీవుడ్ చరిత్రలో బిగ్గెస్ట్ కాంట్రవర్సీల గురించి మాట్లాడుకుంటే అందులో హృతిక్ రోషన్-కంగనా రనౌత్ మధ్య జరిగిన గొడవ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. హృతిక్‌తో తనకు లవ్ ఎఫైర్ ఉందంటూ పలు ఫోటోలు, ఈమెయిల్స్ రిలీజ్ చేసిన కంగనా పెద్ద సంచలనం క్రియేట్ చేసింది. ఈ వివాదం ముదరడంతో ఇద్దరు ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకునే వరకు వెళ్లిన సంగతి తెలిసిందే. మీడియా ఇంటర్వ్యూల్లో కంగనా ఆరోపణలు చేయడం, హృతిక్ వాటిని ఖండించడం అప్పట్లో హాట్ టాపిక్ అయింది.

కంగనా, హృతిక్ మధ్య మరో వార్
త్వరలో హృతిక్ రోషన్, కంగనా రనౌత్ మధ్య మరో యుద్ధం జరుగబోతోంది. అయితే ఇది వ్యక్తిగత జీవితానికి సంబంధించినది మాత్రం కాదు. పూర్తిగా వ్యాపార సంబంధమైన వార్. వీరు నటించిన సినిమాలు ఒకేరోజు విడుదల కాబోతున్నాయి.

ఒకే రోజు ఇద్దరి సినిమాలు
బాలీవుడ్ మీడియా కథనాల ప్రకారం కంగనా రనౌత్ నటించిన ప్రతిష్టాత్మక చిత్రం ‘మణికర్ణిక-ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ'..... హృతిక్ రోషన్ నటించిన ‘సూపర్ 30' చిత్రాలు జనవరి 25న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

మణికర్ణిక
మణికర్ణిక చిత్రంలో కంగనా రనౌత్ వీరనారి పాత్రలో కనిపించబోతోంది. ఝాన్సీ రాణి లక్ష్మి భాయి జీవితంగా ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని తెలుగు దర్శకుడు క్రిష్ డైరెక్ట్ చేశాడు. ఈ బయోగ్రాఫికల్ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి.

సూపర్ 30
‘సూపర్ 30' మూవీలో హృతిక్ రోషన్ మాథమేటిషియన్ ఆనంద్ కుమార్ పాత్రలో కనిపించబోతున్నాడు. సూపర్ 30 ఇనిస్టిట్యూట్ వ్యవస్థాపకుడు ఆనంద్ కుమార్ జీవితం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. కంగనా, హృతిక్.. ఇద్దరి సినిమాలు ఒకే రోజున విడుదలవుతుండటంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది.


Click it and Unblock the Notifications











