‘మణికర్ణిక’ ట్రైలర్: ఒళ్లు గగుర్బొడిచే యాక్షన్... ఝాన్సీ రాణిగా కంగనా ఉగ్రరూపం!
Recommended Video

ఝాన్సీరాణి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చారిత్రాత్మక చిత్రం 'మణికర్ణిక'. కంగనా రనౌత్ టైటిల్ రోల్ పోషించిన ఈచిత్రానికి క్రిష్ జాగర్లమూడి, కంగనా దర్శకత్వం వహించారు. జనవరి 25న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపథ్యంలో ప్రమోషన్ల స్పీడు పెంచారు.
తాజాగా విడుదలైన 'మణికర్ణిక' ట్రైలర్ సినిమాపై అంచనాలు మరింత పెంచింది. కంగనా రనౌత్ బ్రిటిష్ సైన్యం తలలు తెగనరుకుతున్న సన్నివేశాలు ఒళ్లు గగుర్బొడేలా చూపించారు. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పటి వరకు కంగనాలో చూడని ఓ ఉగ్రరూపం చిత్రం ద్వారా చూడబోతున్నాం.

1857 నాటి కాలం కథ
1857 ప్రాంతంలో బ్రిటిష్ వారికి ఎదురొడ్డి ఝాన్సీ లక్ష్మీభాయి పోరాటం జరిపిన తీరును ఈ చిత్రంలో కళ్లకు కట్టినట్లు చూపించబోతున్నారు. దీనికి తెలుగు రైటర్, బాహుబలి ఫేం విజయరేంద్రప్రసాద్ కథ అందించడం విశేషం.

కంగనా కత్తి విన్యాసాలు చూసి అంతా ఆశ్చర్యం
ట్రైలర్లో కంగనా రనౌత్ కత్తి విన్యాసాలు చూసి అంతా ఆశ్యర్యపోతున్నారు. నిజమైన ఝాన్సీ లక్ష్మీభాయి ఇలానే ఉంటుంది అనే స్థాయిలో ఆమె తన పాత్రకు జీవం పోసినట్లు కనిపిస్తోంది. కత్తిసాము అనంతరం ముగ్గురు వ్యక్తులపై నుంచి దూకి ఏనుగుపై ఎక్కే సీన్... ట్రైలర్లో హైలెట్ అయింది.

మణికర్ణిక.. లక్ష్మిభాయిగా
మణికర్ణికగా జన్మించి ఆమె లక్ష్మిభాయిగా ఎలా మారింది. ఎలాంటి పరిస్థితుల్లో ఝాన్సీ రాణిగా బాధ్యతలు చేపట్టింది. తన రాజ్యాన్ని కాపాడుకోవడానికి చేసిన సాహసాలు, తీసుకున్న నిర్ణయాలు ఇలా ప్రతి అంశం సినిమాలో చూపించబోతున్నారు.

తొలుత క్రిష్ దర్శకత్వం... తర్వాత కంగనా
ఈ చిత్రం క్రిష్ దర్శకత్వంలో మొలైలైంది. దాదాపు 90 శాతం షూటింగ్ పూర్తయిన అనంతరం పలు కారణాలతో ఆయన తప్పుకోవడంతో.... మిగతా భాగాన్ని కంగనా రనౌత్ తన దర్శకత్వంలో పూర్తి చేశారు.
జనవరి 25న విడుదల
నిర్మాత కమల్ జైన్ జీ స్టూడియోస్‌తో కలిసి దాదాపు 180 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. జనవరి 25న సినిమా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. హిందీతో పాటు తెలుగు, తమిళంలో కూడా ఈ మూవీ విడుదల చేసే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











