»   » కరణ్‌తో రొమాంటిక్ రిలేషనా? ముచ్చటైన జంట వ్యాఖ్యపై మనీష్ ఫైర్!

కరణ్‌తో రొమాంటిక్ రిలేషనా? ముచ్చటైన జంట వ్యాఖ్యపై మనీష్ ఫైర్!

By Rajababu
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
  Manish Malhotra Gives Strong Reply

  బాలీవుడ్‌లో దర్శక, నిర్మాత కరణ్ జోహర్, ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా మంచి స్నేహితులు అనేది కొత్తగా చెప్పాల్సిన విషయం కాదు. కానీ స్నేహం కంటే వారి మధ్య మరో బంధం ఉందనే రూమర్లు చాలానే వచ్చాయి. కానీ మేము కేవలం స్నేహితులం మాత్రమే. మా మధ్య ఉన్నది స్నేహ బంధం మాత్రమే అని అలాంటి వార్తలకు సమాధానం ఇచ్చారు. కానీ ఇటీవల మనీష్ మల్హోత్రా తన ఇన్స్‌టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఫొటోకు ఓ ఫ్యాన్ చేసిన కామెంట్ వివాదాస్పదమైంది.

  కరణ్‌కు మనీష్ మల్హోత్రా బర్త్‌డే విషెస్

  కరణ్‌కు మనీష్ మల్హోత్రా బర్త్‌డే విషెస్

  ఇటీవల దర్శక, నిర్మాత కరణ్ జోహర్ 46 ఏట అడుగుపెట్టారు. ఆ సందర్భంగా హ్యాపీ హ్యాపీ బర్త్ డే మై డియరెస్ట్, బెస్టెస్ట్ ఫ్రెండ్. ఈ ఏడాదిలో కూడా మీకు మంచి జరుగాలి. మన మధ్య 25 ఏళ్ల ఫ్రెండ్‌షిప్ ఉంది. అప్పటి నుంచి కలిసి పనిచేస్తున్నాం. అలాగే మన స్నేహం కలకాలం నిలిచిపోవాలి అంటూ కామెంట్ పెట్టాడు

  మీరిద్దరు ముచ్చటైన జంట

  మీరిద్దరు ముచ్చటైన జంట

  తనతోపాటు కరణ్ జోహర్‌ ఉన్న ఫోటోను మనీష్ మల్హోత్రా పోస్ట్ చేశారు. వారిద్దరూ కౌగిలించుకొని ఉండటంపై ఓ నెటిజన్ స్పందించారు. మీరిద్దరూ ముచ్చటైన, అందమైన జంట అని కామెంట్ చేశారు. ఆ కామెంట్‌పై మనీష్ భగ్గుమన్నారు.

  కరణ్‌తో రొమాంటిక్ రిలేషనా?

  కరణ్‌తో రొమాంటిక్ రిలేషనా?

  కరణ్‌కు నాకు మధ్య రొమాంటిక్ రిలేషన్ ఉందని వస్తున్న కామెంట్లు, కథనాలు చాలా దారుణం. ఆ విధంగా అలా సంబంధాలను అంటగడుతారు. కరణ్ నాకు బ్రదర్ లాంటి వాడు అని మనీష్ వివరణ ఇచ్చారు.

  కరణ్, మనీష్ రిలేషన్‌పై చర్చ

  కరణ్, మనీష్ రిలేషన్‌పై చర్చ

  హీరో, హీరోయిన్ల మధ్య రిలేషన్‌షిప్ వార్తలు రావడం బాలీవుడ్‌లో చాలా సహజం. కానీ కరణ్, మనీష్ మధ్య ఇలాంటి రిలేషన్ వార్తలు రావడం ఏమిటనే చర్చ హిందీ సినీ పరిశ్రమ వర్గాల్లో జరుగుతున్నది. దీంతో మనీష్‌ మల్హోత్రా జీవితంపై అనేక సందేహాలు, అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

  English summary
  Karan Johar and Manish Malhotra are the best of friends. Hours ago, the rumour mills went into an overdrive and churned out story after story that the two were more than just friends. Manish, who was disgusted by stories of a romance brewing between him and Karan. "It's just ridiculous," he said, adding, "Karan is like a brother to me."
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more