పెళ్లైన తొలి రాత్రి అలా.. లేచి చూసే సరికి షాక్.. సీరియల్ నటుడి కామెంట్స్
సహజంగా పెళ్లి అయిన రాత్రి ఎవ్వరికైనా అదో కొత్త అనుభూతి. అయితే అప్పటి వరకు సాధారంగా బతికేసి ఒంటరి జీవితానికి అలవాటు పడ్డవారికి మాత్రం వింత అనుభూతి. అలాంటి పరిస్థితిలోనే సీరియల్ హీరో మనీష్ రాయ్‌సింఘన్ ఉన్నాడట. ఇటీవలె సంగీత చౌహాన్‌ను పెళ్లి చేసుకున్న ఈ బుల్లితెర హీరో తన మొదటి రాత్రి జరిగిన విశేషాలను చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా కరోనాపై రూపొందించిన ఆల్బమ్ సక్సెస్ కావడం, సుశాంత్ మరణంపైనా స్పందించాడు. ఇంతకీ ఆ హీరో ఏం చెప్పాడో ఓ సారి చూద్దాం.

బుల్లితెరపై ఫేమస్..
మనీష్ రాయ్‌సింఘన్ ఉత్తరాదిన బుల్లితెరపై బాగా ఫేమస్. తీన్ బహూరానియాన్, ససురాల్ సిమార్ కా అనే సీరియల్స్‌తో క్రేజ్ తెచ్చుకున్నాడు. జూన్ 30న సంగీత చౌహాన్‌ను పెళ్లి చేసుకున్నాడు. ఈ మేరకు పెళ్లి తంతు ముగిసిన తరువాత, ఆ తొలి రాత్రి జరిగిన విషయాన్ని చెప్పుకొచ్చాడు.

ఆ తొలి రాత్రి అలా..
గురుద్వార్‌లో తమ వివాహం అయిందని, పెళ్లి తంతు ముగిశాక తమ ఇంటికి వచ్చి నిద్రించామని చెప్పుకొచ్చాడు. నిద్రిస్తున్న సమయంలో ఏవే శబ్దాలు వినిపించాయని తెలిపాడు. నిద్ర లేచి చూస్తే నా భార్య సంగీత పక్కనే ఉంది. వెంటనే షాక్ అయి బెడ్ మీద నుంచి దూకి పక్కకు వెళ్లిపోయానని తెలిపాడు.

ఏం చేస్తున్నావ్..
ఇక్కడ ఏం చేస్తున్నావ్ అని ఆమెను అడిగానని పేర్కొన్నాడు. దాంతో ఆమె ‘సాలె మనకు పెళ్లి అయిందిరా' అని గుర్తి చేసిందని చెప్పుకొచ్చాడు. అలా నా వివాహ జీవితం మొదలైందని, ఆ విధంగా తన భార్య తనను చూసుకుంటోందని తెలిపాడు. కరోనా నేపథ్యంలో రిలీజ్ చేసిన నిక్లే తో నికల్ లోగే ఆల్బమ్ సక్సెస్ కావడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశాడు.
Recommended Video

సుశాంత్ ఓ వారియర్..
సుశాంత్ మరణం పట్ల తాను ఎంతో దిగ్భ్రాంతికి లోనయ్యానని తెలిపాడు. సుశాంత్ పోరాటయోధుడని పేర్కొన్నాడు. నిజ జీవితంలో ఓ హీరో.. ఎంతో మందికి ఉదహరణగా, స్ఫూర్తిగా నిలిచాడని తెలిపాడు. అతని ఆత్మహత్య ఘటన తరువాత ఎంతో మంది సూసైడ్ చేసుకోవాలనుకుంటున్నారని విన్నట్లుగా చెప్పుకొచ్చాడు. ప్రతీ ఒక్కరికీ కష్టాలు, బాధలు ఉంటాయని అవి పక్కవారితో పంచుకోవాలని తెలిపాడు. నాకు తెలిసి సుశాంత్ వీక్ మూమెంట్‌లో ఉండే అందుకు ఇది దురదృష్టకర ఘటన జరిగి ఉంటుందని పేర్కొన్నాడు.


Click it and Unblock the Notifications











