twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    క్యాన్సర్ కాకపోతే.. మరోటి నన్ను మింగేసిది.. మనీషా కోయిరాలా ఎమోషనల్

    |

    క్యాన్సర్ వ్యాధిని ఎదురించిన బాలీవుడ్ హీరోయిన్లలో మనీషా కోయిరాల ఒకరు. క్యాన్సర్ వ్యాధి నుంచి బయటపడిన క్షణాలను తలచుకొంటూ తాజాగా ఓ పుస్తకాన్ని మనీషా రచించారు. హీల్డ్: హౌ క్యాన్సర్ గేవ్ మీ ఏ న్యూ లైఫ్ అనే పుస్తకాన్ని పాఠకుల ముందుంచారు. అమెరికాలో జరిగిన చికిత్స గురించి, ఆ సందర్భంగా చోటుచేసుకొన్న భావోద్వేగ సంఘటనలను గుర్తు చేసుకొన్నారు. వివరాల్లోకి వెళితే..

    క్యాన్సర్ నుంచి విముక్తి చెంది

    క్యాన్సర్ నుంచి విముక్తి చెంది

    క్యాన్సర్ వ్యాధి నుంచి విముక్తి చెంది ఆరేళ్లు అయింది. ఆ సమయంలో నా మనసులో చోటుచేసుకొన్న ఆందోళనలు, నిరాశ, నిస్పృహలు, అనిశ్చితి ఇంకా నా మస్తిష్కంలో కదలాడుతున్నాయి. అలాంటి వాటిని దాటుకొంటూ రావడం జీవితంలో ఓ పెద్ద పాఠంగా భావిస్తాను అని మనీషా కోయిరాలా అన్నారు.

    ధైర్యాన్ని కూడగట్టుకొన్నా

    ధైర్యాన్ని కూడగట్టుకొన్నా

    క్యాన్సర్ వ్యాధికి గురయ్యాయనే భయంకర నిజాన్ని అర్ధం చేసుకొన్న తర్వాత పూర్తిగా ధైర్యాన్ని కూడగట్టుకొన్నాను. దానిని ఎదురించడానికి మానసికంగా ఎలా సంసిద్ధమయ్యాను అనే విషయాన్ని నేను పుస్తకంలో కథగా చెప్పాలనుకొన్నాను అని మనీషా వెల్లడించారు.

    నా జీవనశైలి అందుకు కారణం

    నా జీవనశైలి అందుకు కారణం

    అస్తవ్యస్తంగా నా జీవనశైలి ఉండటమే క్యాన్సర్ బారిన పడటానికి కారణమైంది. ఒక క్యాన్సర్ కాకపోతే మరో వ్యాధి నన్ను మింగేసేది. నా శరీరంలో అనేక మార్పుల వల్ల రోగ నిరోధకశక్తి తగ్గిందనే విషయం నాకు తర్వాత తెలిసింది అని మనీషా పేర్కొన్నారు. ఈ పుస్తకానికి నీలమ్ కుమార్ సహ రచయితగా పనిచేయగా, పెంగ్విన్ రాండమ్ హౌస్ ప్రచురించింది.

    క్యాన్సర్ నాకు ఓ బహుమతి

    క్యాన్సర్ నాకు ఓ బహుమతి

    క్యాన్సర్ కణాలు నా దేహంలోకి రావడం ఓ బహుమతి అని భావిస్తాను. దాంతో జీవితం పట్ల నా ఆలోచన విధానం పూర్తిగా మారిపోయింది. నా మనసు పూర్తిగా స్వచ్ఛంగా మారిపోయింది. నాలో కోపం, ఆవేశం పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి. ఇప్పుడు జీవితం చాలా ప్రశాంతంగా మారిపోయింది అని మనీషా కోయిరాలా పేర్కొన్నారు.

    సౌదాఘర్‌తో బాలీవుడ్ ఎంట్రీ

    సౌదాఘర్‌తో బాలీవుడ్ ఎంట్రీ

    1991లో సౌదాఘర్ చిత్రంతో బాలీవుడ్‌లోకి ప్రవేశించిన మనీషా కోయిరాలా ఆ తర్వాత పలు విజయవంతమైన చిత్రాల్లో నటించింది. ఆమె నటించిన 1942 ఏ లవ్ స్టోరి, అఖేలే హమ్, అఖేలే తుమ్, బాంబే, ఖామోషీ చిత్రాలు ఆమె నటనకు అద్దం పట్టాయి. తాజా సంజూ చిత్రంలో నర్గీస్ దత్‌గా కనిపించింది.

    English summary
    Manisha Koirala was diagnosed with ovarian cancer in 2012. In her memoir, 'Healed; How Cancer Gave Me A New Life,'' she talks about her treatment in the US and the care provided by the oncologists there to how she rebuilt her life once she returned home.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X