ట్రైలర్ కేక: ముద్దులతో రెచ్చిపోయిన హీరోయిన్ తాప్సీ!
Recommended Video

'లవ్ ఈజ్ నాట్ కాంప్లికేటెడ్... పీపుల్ ఆర్'... (ప్రేమ ఎప్పుడూ సంక్లిస్టమైనది కాదు... అందుకు మనుషులే కారణం) అంటూ ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ తన లేటెస్ట్ మూవీ 'మన్మర్జియాన్'తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. సంక్లిష్టమైన సంబంధాలు, అంతకు మించి కాంప్లికేటెడ్‌గా ఉండే లవ్ స్టోరీస్‌ను ఫోకస్ చేస్తూ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అభిషేక్ బచ్చన్, విక్కీ కౌశల్, తాప్సీ పన్ను, అక్షయ్ అరోరా ప్రధాన పాత్రల్లో నటించారు.

ట్రైలర్లోనే కథ చెప్పేశాడు
విక్కీ(విక్కీ కౌశల్) తన ప్రియురాలు రుమి (తాప్సీ పన్ను)ను పిచ్చి పిచ్చిగా ప్రేమిస్తుంటాడు. కానీ ఆమెను పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉండడు. దీంతో రుమి ఇంట్లో చూసిన సంబంధాన్ని చేసుకోవాలని డిసైడ్ అవుతుంది. ఇదే సమయంలో రాబీ (అభిషేక్ బచ్చన్) ఎంటరవ్వడంతో కాంప్లికేటెడ్ లవ్ స్టోరీ మొదలవుతుంది. అటు ఫస్ట్ లవ్ ఇటు పెళ్లి... రుమి ఎవరిని ఎంచుకోవాలో తెలియక సతమతం అవుతూ ఉంటుంది.

మోడ్రన్ జనరేషన్ రిలేషన్‌షిప్స్
ఇప్పటి జనరేషన్ రిలేషన్‌షిప్స్, ప్రేమ సంబంధమైన వ్యవహారాలతో ‘మన్మర్జియాన్' సినిమా రూపొందించారు. దాదాపు రెండేళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ అభిషేక్ బచ్చన్ ఈ సినిమా ద్వారా వెండితెరపై కనిపించబోతున్నారు.

ముద్దు సీన్లతో రెచ్చిపోయిన తాప్సీ
హీరోయిన్ తాప్సీ ముద్దు సీన్లతో గతంలో ఏ సినిమాలోనూ లేనంతగా రెచ్చిపోయింది. విక్కీ కౌశల్, తాప్సీ మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయినట్లు స్పష్టమవుతోంది. బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత తాప్సీ ఆలోచన విధానం, ఆమె ఎంచుకునే కథలు పూర్తిగా మారిపోయాయి.
మన్మర్జియాన్
కలర్ ఎల్లో ప్రొడక్షన్స్, ఫాంటమ్ ఫిల్మ్స్ బేనర్లో ఆనంద్ ఎల్.రాయ్, వికాష్ భాల్, మధు మంతెన, అనురాగ్ కశ్యప్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ 14న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

రాఘవేంద్రరావు కోడలు కథ
మరో ఆసక్తికర విషయం ఏమిటంటే... ఈ చిత్రానికి తెలుగు దర్శకుడు రాఘవేంద్రరావు కోడలు కనికా ధిల్లాన్ కథ అందించారు. రాఘవేంద్రరావు తనయుడు ప్రకాష్, కనికా 2014లో పెళ్లాడిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











