twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆత్మహత్య చేసుకొందామని అనుకొన్నా.. వర్మ కారణంగా.. షాకింగ్‌గా మనోజ్ బాజ్‌పేయ్ వెల్లడి

    |

    సగటు సినీ అభిమానినే కాదు.. విమర్శకుల ప్రశంసలు అందుకొన్న నటుడు మనోజ్ బాజ్‌పేయ్. తన కెరీర్‌లో విభిన్నమైన పాత్రలను, విలక్షణమైన నటనను ప్రదర్శించి ఎంతో మంది యువ నటులకు స్పూర్తిగా నిలిచారు. అయితే ఉన్నత శిఖరాలకు చేరుకోవడానికి తాను ఎన్నో కష్టాలను అనుభవించానని, అవుట్ సైడర్‌‌కు ఎదురయ్యే కష్టాలే నాకు తారసపడ్డాయని ఇటీవల మీడియా ఇంటర్వ్యూలో వెల్లడించారు. భోంస్లే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన తన జీవితంలో పలు సంచలన విషయాలను బయటపెట్టారు. మనోజ్ బాజ్‌పేయ్ చెప్పిన విషయాలు ఏమిటంటే..

    తొమ్మిదేళ్ల వయసులోనే యాక్టింగ్‌పై

    తొమ్మిదేళ్ల వయసులోనే యాక్టింగ్‌పై

    నేను తొమ్మిదేళ్ల వయసులో ఉన్నప్పుడే నటుడిని కావాలనుకొన్నాను. కాకపోతే మాది దిగువ మధ్య తరగతి కుటుంబం. అందులో మాది వ్యవసాయ ఆధారిత ఫ్యామిలీ. నా తల్లిదండ్రులకు నాతో పాటు మరో ఐదుగురు సంతానం ఉండేవారు. పూరి గుడిసెలో ఉండే స్కూల్‌కు వెళ్లాను. బాల్యంలో అత్యంత సాధారణ జీవితం గడిపాను. బీహార్‌లోని మారుమూల నగరంలోకి ఉండే మేము ఎప్పుడైనా నగరంలోకి వెళితే థియేటర్లలో సినిమాలు చేసే వాడిని అని మనోజ్ బాజ్‌పేయ్ చెప్పారు.

    17 ఏళ్ల వయసులో ఢిల్లీకి

    17 ఏళ్ల వయసులో ఢిల్లీకి

    మనసులో బలమైన కోరిక ఉండటం వల్ల 17 ఏళ్ల వయసులోనే యాక్టర్‌గా మారేందుకు ఇంటిని విడిచి పెట్టి ఢిల్లీకి చేరాను. ఢిల్లీ యూనివర్సిటీలో చేరాలని ప్రయత్నించాను. ఆ సమయంలో ఇంటికి ఉత్తరం రాస్తే నాన్న కోపగించుకోకుండా ఫీజు కోసం రూ.200 పంపించారు అని మనోజ్ బాజ్‌పేయ్ పేర్కొన్నారు.

    కనీస అవసరాలు తీర్చుకోవడానికి

    కనీస అవసరాలు తీర్చుకోవడానికి

    నాకు ఇంగ్లీష్, హిందీ భాషల్లో నాకు అంతగా ప్రావీణ్యం లేదు. నాకు బాగా మాట్లాడటం వచ్చే భాష కేవలం భోజ్‌పురి మాత్రమే. ఆ సమయంలో వాటిని నేర్చుకోవడానికి ప్రయత్నించాను. కానీ కనీస అవసరాలు తీర్చుకొనేందుకే డబ్బులు లేకపోయేవి. ఓ దశలో నేను ఆత్మహత్య చేసుకొందామా అనే ప్రయత్నాలు కూడా చేశాను అని మనోజ్ బాజ్‌పేయ్ తన కష్టాలను వివరించారు.

    మూడుసార్లు రిజెక్ట్ కావడంతో

    మూడుసార్లు రిజెక్ట్ కావడంతో

    నా జీవిత లక్ష్యమైన నటనలో శిక్షణ పొందేందుకు నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో దరఖాస్తు చేసుకొన్నాను. కానీ మూడుసార్లు వాళ్లు తిరస్కరించారు. దాంతో నా లక్ష్యాన్ని చేరుకోలేననే బెంగ నాలో మొదలైంది. దాంతో ఆత్మహత్య చేసుకోవానే ఆలోచనలు వచ్చాయి. కానీ అలాంటి ఆలోచనలతో ఉంటే నేను ఏమైనా చేసుకొంటాననే భయంతో స్నేహితులు నాతో ఉండి.. నాతో పడుకొనేవారు. నన్ను ఒంటరిగా ఉండనిచ్చే వాళ్లు కాదు. నా ఆలోచనలు మారే వరకు వారు నాతోనే ఉండి సర్దిచెప్పారు అని మనోజ్ బాజ్‌పేయ్ తెలిపారు.

    ముంబైలో కష్టాలు మరీ దారుణంగా

    ముంబైలో కష్టాలు మరీ దారుణంగా

    ముంబైకి చేరుకొన్న తర్వాత జీవితం ఇంకా నరకంగా మారింది. తొలి షూటింగ్‌లోనే సరిగా చేయడం లేదని బయటకు పంపారు. వరుసగా వచ్చిన అవకాశాలు చేజారాయి. ఇంటి అద్దె కట్టాలంటే డబ్బులు ఉండేవి కాదు. వడపావ్ తినాలంటే చాలా ఖరీదు ఉండేది. చాలా రోజులు ఆకలి, పస్తులతో కాలం వెళ్లదీసిన రోజులు ఉన్నాయి అని మనోజ్ బాజ్‌పేయ్ చెప్పారు.

    Recommended Video

    #DecadeOfVedam : Allu Arjun & Vedam Team Cherishes Memories
    రాంగోపాల్ వర్మ సత్య ఆఫర్‌తో

    రాంగోపాల్ వర్మ సత్య ఆఫర్‌తో

    అలాంటి పరిస్థితుల్లో మహేష్ భట్ రూపొందించే టెలివిజన్ సీరియల్‌లో ఆఫర్ లభించింది. ప్రతీ ఎపిసోడ్‌కు 1500 రూపాయలు వచ్చేవి. అలా స్థిరమైన ఆదాయం రావడం మొదలైంది. అంతేకాకుండా నా ప్రతిభకు గుర్తింపు లభించడంతో పలు బాలీవుడ్ ఆఫర్లు వచ్చాయి. రాంగోపాల్ వర్మ అవకాశం ఇవ్వడంతో సత్య ఆఫర్ లభించింది. అవార్డులు రివార్డుల రావడంతోపాటు కెరీర్‌లో మళ్లీ వెనుకకు చూసుకొనే అవకాశం లేకుండా పోయింది అని మనోజ్ బాజ్‌పేయ్ వెల్లడించారు.

    English summary
    Actor Manoj Bajpayee reveals struggles at bollywood intial days. Manoj gave details of his financial sturggles in film Industry. Few incident forced him to committing suicide.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X