For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  అప్పుడు అమితాబ్‌కు.. ఇప్పుడు విజయ్ దేవరకొండకు.. సారీ చెప్పిన ‘మరాఠా’ ఓనర్ మనోజ్ దేశాయ్

  |

  రౌడీ స్టార్ విజయ్ దేవరకొండపై చేసిన వ్యాఖ్యలను మరాఠా మందిర్ సినిమా ఓనర్ మనోజ్ దేశాయ్ ఉపసంహరించుకొన్నారు. తాను చూసిన వీడియో తనను తప్పుదోవ పట్టించిందని.. అందుకే తాను ఆవేశం, ఆవేదనతో విజయ్ దేవరకొండపై అలాంటి వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది అని వివరించారు. లైగర్ సినిమా రిలీజ్ తర్వాత మనోజ్ దేశాయ్‌ను విజయ్ దేవరకొండ కలిసి.. అసలు తాను ఏం మాట్లాడింది చెప్పడంతో మనోజ్ దేశాయ్ పశ్చాత్తాపం పడ్డారు. అసలు ఈ గొడవ ఏమిటి? మనోజ్ దేశాయ్‌ను విజయ్ దేవరకొండ ఎందుకు కలిశాడనే వివరాల్లోకి వెళితే..

  లైగర్ బాయ్‌కాట్‌పై విజయ్ దేవరకొండ

  లైగర్ బాయ్‌కాట్‌పై విజయ్ దేవరకొండ


  లైగర్ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో విజయ్ దేవరకొండ.. బాయ్‌కాట్ లైగర్ హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్‌పై స్పందించాడు. మా సినిమాను ఎవరు ఆపుతారు? నా సినిమాను ఆపుతారనే భయం నాకు లేదు. నేను యాక్టర్ కాకముందే.. నా కెరీర్ ఎలా ఉంటుందనే విషయం గురించి భయపడలేదు. ఇప్పుడు నేను యాక్టర్‌ను. నేను ఎంుదకు భయపడాలి. నాకు నా తల్లి ఆశీర్వాదం. ప్రజలు, దేవుడి సపోర్ట్ ఉంది. నాలో మంచి సినిమాలు అందించాలనే కసి.. ఫైర్ ఉంది. మమ్మల్ని ఆపే శక్తి ఎవరికి ఉంది అని విజయ్ దేవరకొండ అన్నారు.

  బాయ్ కాట్ చేస్తే ఓటీటీలో చూస్తారు అంటూ

  బాయ్ కాట్ చేస్తే ఓటీటీలో చూస్తారు అంటూ

  అయితే విజయ్ దేవరకొండ మాటలపై మనోజ్ దేశాయ్ స్పందిస్తూ.. మా సినిమాను బాయ్‌కాట్ చేస్తే చేయనివ్వండి.. జనం ఓటీటీలో చూస్తారని అంటావా? నీ వ్యాఖ్యల వల్ల థియేటర్ ఓనర్లకు ఇబ్బంది కలుగుతున్నది. అడ్వాన్స్ బుకింగ్‌లపై ప్రభావం పడింది. సినిమా పరిశ్రమకు నువ్వు అనకొండ.. నీవు బంగారు కొండవు కాదు. నీ మాటల్లో పొగరు, అహంకారం ఉంది. వినాశకాలే విపరీత బుద్ది అంటారు. నీవు ఏం మాట్లాడుతున్నావో తెలుసా? అని మనోజ్ దేశాయ్ ఓ ఇంటర్వ్యూలో అన్నాడు.

  విజయ్.. అంత అహంకారం వద్దు

  విజయ్.. అంత అహంకారం వద్దు

  మిస్టర్ విజయ్.. నీవు చాలా దూకుడుగా పెరిగినట్టు ఉన్నావు. మీరు చూడకపోతే చూడకండి అని అనడం అహంకారం కనిపిస్తున్నది. తాప్సీ పొన్ను, అమీర్ ఖాన్, అక్షయ్ కుమార్ లాంటి వాళ్లే చేదు అనుభవాలను ఎదుర్కొన్నారు. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. కానీ నీ మాటలు సినిమాకు చేటు కలిగించేలా ఉన్నాయి. హ్యాష్ ట్యాగ్‌ల గురించి ప్రతికూలంగా కామెంట్ చేయకు అని మనోజన్ దేశాయ్ అన్నాడు.

  మనోజ్ దేశాయ్‌కి విజయ్ వివరణ

  మనోజ్ దేశాయ్‌కి విజయ్ వివరణ


  అయితే లైగర్ రిలీజ్ తర్వాత మనోజ్ దేశాయ్‌ని విజయ్ దేవరకొండ ముంబై వెళ్లి కలిశాడు. తాను ఏం మాట్లాడిందనే విషయం గురించి పూర్తి వీడియోను చూపించాడు. తాను తప్పుడు వ్యాఖ్యలు చేయలేదని మనోజ్ దేశాయ్‌కి తెలిపాడు. దాంతో తాను ఎక్కడ పొరపాటు పడ్డాననే విషయం తెలుసుకొన్న మనోజ్ దేశాయ్ విజయ్ దేవరకొండకు సారీ చెప్పారు.

  పూర్తి వీడియోను చూడలేదు.. సారీ విజయ్ అంటూ

  పూర్తి వీడియోను చూడలేదు.. సారీ విజయ్ అంటూ


  ఆ తర్వాత మనోజ్ దేశాయ్ మాట్లాడుతూ...నేను పూర్తి వీడియోను చూడలేదు. నాకు పంపించిన క్లిప్ చూసి నాకు చాలా కోపం వచ్చింది. అందుకే నేను నా బిడ్డ లాంటి విజయ్ దేవరకొండపై గరం అయ్యాను. అందుకు సారీ చెబుతున్నాను అని మనోజ్ దేశాయ్ చెప్పాడు. అందుకు మీరు సారీ చెప్పకూడదంటూ విజయ్ దేవరకొండ ఆయన కాళ్లు మొక్కారు. దాంతో నీవు నటుడిగా ఎంతో ఎత్తుకు ఎదగాలి అంటూ దీవించాడు.

  విజయ్ దేవరకొండ నా బిడ్డ లాంటి వాడు

  ఆ తర్వాత మనోజ్ దేశాయ్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకొంటూ.. విజయ్ వచ్చి నాతో అంతా వివరించాడు. విజయ్ దేవరకొండ దుబాయ్‌లో ప్రమోషన్స్‌ కోసం వెళ్తున్నాడు. ఇండియా పాకిస్థాన్ మ్యాచ్ చూస్తున్నాడు. విజయ్ దేవరకొండ నా బిడ్డ లాంటి వాడు. నీవు నిజాయితీగా కష్టపడు. విజయం నీ కాళ్ల ముందు మోకరిల్లుతుంది అని మనోజ్ దేశాయ్ దీవెనలు అందించాడు.

  గతంలో అమితాబ్‌కు సారీ..

  గతంలో అమితాబ్‌కు సారీ..


  ఇదిలా ఉండగా, ముంబైలోని ప్రఖ్యాత మరాఠా మందిర్ సినిమా థియేటర్ ఓనర్ మనోజ్ దేశాయ్ సారీ చెప్పడం ఇది రెండోసారి. గతంలో సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్‌పై పొరపాటున అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసి సారీ చెప్పారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ వ్యాఖ్యలను తప్పుగా అర్ధం చేసుకొని.. ఆయన మాట్లాడి వాస్తవ విషయాలను తెలుసుకొన్నాడు. ఆ తర్వాత బహిరంగంగా, భేషరతుగా సారీ చెప్పడం గమనార్హం. ఈ వివాదం సద్దుమణగడంతో అభిమానులు, నెటిజన్లు ప్రశంసలు గుప్పిస్తున్నారు.

  English summary
  Mumbai's Maratha Mandir Cinema's owner Manoj Desai apologies to Liger hero Vijay Deverakonda over Boycott contraversy.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X