గోవాలో ప్రేయసితో అడ్డంగా బుక్కైన అదితిరావు హైదరీ మాజీ భర్త
అదితి రావ్ హైదరీ పేరు వింటేనే తెలుగు జనాల మనసు సుమనోహరంగా మారిపోతంది. అయితే చాలా కొద్ది మందికి మాత్రమే తెలిసిన విషయం ఏమిటంటే ఆమె.. సినిమాల్లోకి రాకముందే, 21ఏళ్ల ప్రాయంలోనే ఓసారి పెళ్లాడింది. కొంతకాలానికే ఆ పెళ్లి పెటాకులు కూడా అయింది. ఇదంతా జరిగిన తరువాతే ఆమె సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి రాణిస్తోంది. అయితే ఇప్పుడీ ముచ్చట ఎందుకబ్బా అంటారా? విషయం అమ్మాయి గురించి కాదు ఆమె భర్త సత్యదీప్ మిశ్రా గురించి.
అదితితో విడిపోయిన తరువాత చాలాకాలం సింగిల్ గానే నెట్టుకువచ్చేసిన సత్యదీప్ మిశ్రా ఇప్పుడు మరోసారి ప్రేమలో పడ్డాడు. అమ్మాయి మరెవరో కాదు డిజైనర్ మసాబా గుప్తా. అదేనండి ప్రముఖ నటీమణి నీనా గుప్తా, క్రికెటర్ వివియన్ రిచర్డ్స్ గారాలపట్టి. ప్రస్తుతం వీరిద్దరూ పీకల్లోతు ప్రేమలో మునిగితేలుతున్నారట.

మసాబా గుప్తా కూడా రెండో ప్రణయం అనే చెప్పాలి. గతంలో మధు మంతెన అనే తెలుగబ్బాయిని పెళ్లాడింది మసాబా. 2015లో మధుతో పెళ్లి జరగ్గా, 2019లోనే వీరికి విడాకులు మంజూరు అయ్యాయి. మరోవైపు సత్యజీత్ కూడా 2009లోనే తనకన్నా వయసులో చాలా చిన్నదైన అతిథి రావ్ ను పెళ్లాడాడు. పలు కారణాలతో 2013లో విడిపోయారు.
స్వతహాగా తన పర్శనల్ లైఫ్ గురించి ఎక్కడా చర్చించని మసాబా తన తాజా ప్రేమాయణం గురించి ఎంత దాచాలనుకున్నా దాగలేదు. ప్రస్తుతం సత్యదీప్ మిశ్రాతో డేటింగ్ చేస్తున్న మసాబా, గోవాలో సరదాగా గడిపేందుకు వెళ్లి లాక్ డౌన్ పుణ్యమాని అక్కడే ఇరుక్కుపోయింది. దీంతో వారిద్దరూ అడ్డంగా బుక్కయ్యారు. ఇక ఈ విషయం ఇలా బయటపడటంతో వారి రహస్య శృంగార జీవితం బయటకు వచ్చింది.


Click it and Unblock the Notifications











