దీపిక పదుకోన్ నివాసం ఉండే బిల్డింగ్‌లో అగ్నిప్రమాదం... అభిమానుల్లో ఆందోళన!
ముంబై వర్లీ ప్రాంతంలోని ప్రభాదేవి ఏరియాలో బీమొండే టవర్స్ అనే బహుళ అంతస్తుల భవనంలో బుధవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ప్రముఖ బాలీవుడ్ నటి దీపిక పదుకోన్ ఇదే బిల్డింగులో నివాసం ఉంటుండటంతో అభిమానుల్లో ఆందోళన నెలకొంది. ఈ భవనంలో టాప్‌లో ఉండే రెండు అంతస్తుల్లో అగ్ని ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని తెలుస్తోంది. ఫైర్ ఫైటర్స్ వెంటనే అక్కడికి చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ఈ భవనంలో ఉండే 90 మందిని వెంటనే ఖాళీ చేయించారు. వెంటనే 6 ఫైరింజన్లు, 5 జంబో ట్యాంకర్స్, ఒక అంబులెన్స్ సంఘటన స్థలానికి చేరుకున్నాయి.
అగ్ని ప్రమాదం వీడియో
అగ్ని ప్రమాదానికి సంబంధించిన వీడియోను కొందరు తమ మొబైల్ ఫోన్లలో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
సోషల్ మీడియాలో దీపిక ఫ్యాన్స్
అగ్ని ప్రమాదం సంభవించింది అనే విషయం తెలియగానే... దీపిక పదుకోన్ అభిమానుల్లో ఆందోళన మొదలైంది. దీపిక సేఫ్‌గా ఉందని భావిస్తున్నామంటూ కొందరు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు.
దీపిక ఎక్కడ ఉంది?
అయితే ప్రమాదం సంభవించిన సమయంలో దీపిక ఇదే బిల్డింగులో ఉన్నారా? లేక బయట ఉన్నారా? అనే విషయమై ఇంకా స్పష్టత రాలేదు. త్వరలోనే దీపిక సోషల్ మీడియా ద్వారా ఈ ఘటనపై స్పందిస్తారని అభిమానులు ఆశిస్తున్నారు.
అగ్ని ప్రమాద దృశ్యాలు
అగ్ని ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.


Click it and Unblock the Notifications











