అతడితో సంబంధం పెట్టుకుంది.. ఇప్పుడు ప్లేటు ఫిరాయించేసింది, హీరోయిన్ షాకింగ్ కామెంట్స్!
Recommended Video

మాజీ మిస్ ఇండియా నిహారిక సింగ్ ప్రముఖ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీపై చేసిన మీటూ కామెంట్స్ సంచలనం సృష్టిస్తున్నాయి. ఇప్పటికే నానా పాటేకర్, షాజిద్ ఖాన్, వికాస్ బహల్ వంటి బాలీవుడ్ ప్రముఖులు తీవ్రమైన లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఆ జాబితాలోకి నవాజుద్దీన్ పేరు కూడా చేరింది. నిహారిక చేసిన లైంగిక వేధింపుల ఆరోపణల విషయంలో నవాజుద్దీన్ కు కొందరు మద్దత్తు తెలుపుతున్నారు. ప్రముఖ నటి కుబ్రా సయత్ నవాజుద్దీన్ కు మద్దత్తుగా నిలిచింది.

సంబంధం పెట్టుకుంది ఆమే
కుబ్రా సయత్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. నవాజుద్దీన్ పై నిహారిక సింగ్ చేసిన మీటూ కామెంట్స్ గురించి విన్నా. ఆమె చేసిన ఆరోపణల్లో అసలు అర్థమే లేదని కుబ్రా తెలిపింది. నవాజుద్దీన్, నిహారిక కొంతకాలం రిలేషన్ లో ఉన్నారని కుబ్రా వ్యాఖ్యానించింది.
విడిపోతే మీటూ అంటారేంటి
నవాజుద్దీన్, నిహారిక విభేదాల కారణంగా విడిపోయారు. విభేదాలతో విడిపోవడానికి, లైంగిక వేధింపులకు చాలా వ్యత్యాసం ఉందని కుబ్రా తెలిపింది. విభేదాలతో విడిపోతే అసలు అది మీటూనే కాదు. ఇక్కడ ఉన్న వ్యత్యాసాన్ని గమనించి అందరూ నవాజుద్దీన్ లాంటి వ్యక్తికీ మద్దత్తు ప్రకటించాలని కుబ్రా కోరింది.
ఆమెకు ఇబ్బందులు ఉండొచ్చు
నిజంగానే ఇండస్ట్రీలో నిహారిక ఇబ్బందులు ఎదుర్కొని ఉండొచ్చు. కానీ వ్యక్తిగత సంబంధాలని కూడా పబ్లిసిటీ కోసం మీటూ ఉద్యమంలో కలిపేయడం సమంజసం కాదని కుబ్రా అభిప్రాయ ఆడింది. విభేదాలు వచ్చినంత మాత్రాన వ్యక్తిత్వంపై బురదజల్లడం సమంజసం కాదని కుబ్రా తెలిపింది. ప్రపంచం మొత్తం మానవులు ఒక్కటిగా ఉండాలి. ఇక్కడ లింగ భేదాలు ఏర్పరుచుకుని ఎలా ఉద్యమాలు చేసుకోవడం ఏంటని కుబ్రా అభిప్రాయ పడింది.

చాలా మందితో సంబంధాలు
నవాజుద్దీన్ తనని వేధించాడంటూ చాలా పెద్ద కథే చెప్పుకొచ్చింది. నవాజుద్దీన్ కు చాలా మంది మహిళలతో సంబంధాలు ఉన్నాయంటూ ఆరోపించింది. అతడు కొంతమందిని వివాహం చేసుకున్న తరువాత నవాజుద్దీన్ నుంచి దూరం జరిగినట్లు నిహారిక చెప్పుకొచ్చింది.


Click it and Unblock the Notifications











