వెలుగులోకి స్టార్ సింగర్ అరాచకాలు: మద్యం తాగాలని, ఆపై....
బాలీవుడ్లో మీటూ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడుతున్న నేపథ్యంలో లైంగిక వేధింపులకు పాల్పడిన సినీ ప్రముఖుల భాగోతాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. సుభాష్ ఘయ్, రజత్ కపూర్, సాజిద్ ఖాన్ మీద ఇప్పటికే సెక్సువల్ మిస్‌కండక్ట్, అసభ్య ప్రవర్తన ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో ప్రఖ్యాత సింగర్ కైలాష్ ఖేర్ మీద కూడా సెక్సువల్ హరాస్మెంట్ ఆరోపణలు వినిపించాయి. ఇప్పటికే సింగర్ సోనా మహాపాత్ర ఆయనపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేయగా... తాజాగా వర్షా సింగ్ ధనూవ అనే గాయని ఈ స్టార్ సింగర్ తన పట్ల మిస్ బిహేవ్ చేసిన విషయాన్ని బయట పెట్టారు.
నాతో గడపాలని కోరాడు
ఖైలాష్ ఖేర్ ఒకసారి తనకు కాల్ చేసి కలవాలని చెప్పాడని, మరో సందేశంలో తనతో గడపాలని ఉందని చెప్పాడని... అతడి సందేశంలో తప్పుడు ఉద్దేశ్యం అర్థమైందని వర్షా సింగ్ ధనూవ ఆరోపించారు.

మద్యం తాగాలని, ఆపై..
మరో గాయకుడు తోషి సబ్రి సైతం తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని, ఓ సారి రికార్డింగ్ కోసం తన కారులో తీసుకెళుతూ మద్యం తాగాలని బలవంతం చేశాడని, తనపై చేయి వేసి అభ్యంతరకంగా ప్రవర్తించాడని వర్షా సింగ్ ధనూవ ఆరోపించారు.

ఆ అనుభవాలతో కెరీర్‌కు దూరం
తనకెదురైన అనుభవాలతో ఇక తాను సింగింగ్ కెరీర్ కోసం ఏ డైరెక్టర్‌నూ కలిసే సాహసం చేయలేదని ధనూవ తెలిపారు. ఈ మేరకు ఆమెకు ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
Recommended Video


ఖైలాష్ ఖేర్
ఇండియాలోని గొప్ప సింగర్లలో ఒకరిగా ఖైలాష్ ఖేర్ పేరు గడించారు. తెలుగులో ఆయన అరవింద సమేతతో పాటు, భరత్ అనే నేను, గోపాల గోపాల, మిర్చి, రాజన్న.... లాంటి చిత్రాల్లో సూపర్ హిట్ సాంగ్స్ పాడారు.


Click it and Unblock the Notifications











