ఆస్తులు తాకట్టులో, ఆమె ఒక ట్రాన్స్‌జెండర్.... హీరోయిన్ సంచలన ఆరోపణలు!
బాలీవుడ్ పరిశ్రమలో #మీటూ ఉద్యమం ఉధృతం కావడానికి ప్రధాన కారణం నటి తనుశ్రీ దత్తా అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రముఖ నటుడు నానా పాటేకర్ మీద సంచలన ఆరోపణలు చేసిన ఆమె పదేళ్ల క్రితం నాటి సంఘటన తెరపైకి తెచ్చి... తనలా వేధింపులకు గురైన ఎంతో మంది ఇన్‌స్పైర్ అయ్యేలా చేశారు.
అయితే తనుశ్రీ దత్తా చేస్తున్న మీటూ ఆరోపణలను రాఖీ సావంత్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పబ్లిసిటీ కోసమే తనుశ్రీ ఇలా చేస్తోందని, ఆమె ఒక లెస్బియన్, 12 ఏళ్ల క్రితం ఆమెతో నాకు స్నేహం ఉండేది, ఆ సమయంలో నన్ను పలుసార్లు రేప్ చేసింది, డ్రగ్స్ అలవాటు కూడా ఉందంటూ తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.

రాఖీ సావంత్ మీద ఎదురు దాడి
రాఖీ సావంత్ మీద తనుశ్రీ దత్తా ఎదురు దాడి ప్రారంభించింది. కొంతకాలంగా రాఖీకి సంబంధించిన సమాచారం సేకరించే పనిలో ఉన్న ఆమె ఓ హిందీ టీవీ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు బయట పెట్టారు.

రాఖీ ఆస్తులు తాకట్టులో, యూఎస్ వీసా రిజెక్ట్
గత వారం రోజుల నుంచి రాఖీ సావంత్ గురించి రకరకాల సమాచారం నాకు అందుతోంది. ఆమె ఆస్తులన్నీ టాకట్టులో ఉన్నాయని, కొన్ని ఫ్రాడ్ సంఘటనల కారణంగా ఆమె తన డబ్బంతా కోల్పోయింది. యూఎస్ఏ వీసా కూడా రిజక్ట్ అయింది. దీంతో ఇతర ప్రాంతాలకు వెళ్లి పని చేసే పరిస్థితి కూడా రాఖీకి లేదు..... అని తనుశ్రీ దత్తా జూమ్ టీవీ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

నువ్వు ట్రాన్స్ జెండర్ ఉమెన్
నువ్వు ట్రాన్స్ జెండర్ ఉమెన్ అని రూమర్స్ చాలా కాలంగా వినిపిస్తున్నాయి. కానీ అది రూమర్ కాదు. నిజమే అని చాలా బాలీవుడ్ జనాలకు తెలుసు.... అంటూ తనుశ్రీ దత్తా వ్యాఖ్యానించారు.

నీ నిజస్వరూపం ఇదే
నీ గత ఇంటర్వ్యూల్లో కూడా నువ్వు కాస్టింగ్ కౌచ్‌లో ఇన్వాల్వ్ అయినట్లు చెప్పావు. నీకు సినిమా అవకాశం ఇస్తే కాస్టింగ్ కౌచ్ ఒప్పుకోవడానికి సిద్ధమే అన్నావు. ఇదే నీ నిజస్వరూపం అంటూ తనుశ్రీ దత్తా ఫైర్ అయ్యారు.

ముందు నీ ఆత్మపరిశీలన చేసుకో
నాకు వ్యతిరేకంగా ఇంటర్వ్యూలు ఇవ్వడానికి మీడియా ముందుకు చీరకట్టుకుని వస్తే ఎవరూ నమ్మరు. నీ గురించి అందరికీ తెలుసు. నా గురించి వేలెత్తి చూపే ముందు నిన్ను నువ్వు ఆత్మపరిశీలన చేసుకో.... అంటూ తనుశ్రీ వ్యాఖ్యానించారు.

ఆమె మీద కోపం లేదు, జాలి కలుగుతోంది
తనుశ్రీ దత్తా తనను రేప్ చేసిందంటూ ఆరోపణలు చేసిన రాఖీ సావంత్.... రేప్ సంఘటనల నుంచి తప్పించుకోవడానికి మర్మాంగాలకు తాళం వేసుకోవడం ఎలాగో వెల్లడిస్తూ ఓ వీడియో విడుదల చేసిన సంగతి తెలిసిందే. గతంలోనూ రాఖీ ఇలాంటి కాంట్రవర్సల్ కామెంట్స్ చేసింది. అయితే ఇవన్నీ చూసి తనకు ఆమెపై కోపం రావడం లేదని, ఆమె జీవితం మిస్‌గైడ్ అయినందుకు జాలి కలుగుతోంది అంటోంది తనుశ్రీ.

నేను ఏమితో వారికి తెలుసు
రాఖీ సావంత్ మాటలకు విలువ లేదు. అలాంటి వ్యక్తి నా మీద ఎన్ని ఆరోపణలు చేసినా ఎవరూ పట్టించుకోరు. నా మీద నా కుటుంబానికి నమ్మకం ఉంది. నేను ఏమిటో వారికి తెలుసని తనుశ్రీ స్పష్టం చేశారు.


Click it and Unblock the Notifications











