మా అక్క వల్లే నా కెరీర్ నాశనం.. ప్రియాంక చోప్రాపై సోదరి హాట్ కామెంట్.. ఎన్టీఆర్ గురించి..

టాలీవుడ్, బాలీవుడ్‌ హీరోయిన్ కంటే ప్రియాంక చోప్రా సోదరిగా గుర్తింపు పొందిన మీరా చోప్రా సినిమాల్లో కంటే వార్తల్లోనూ, వివాదాల్లోనూ ఎక్కువగా కనిపిస్తుంటుంది. కాస్త నోటి దురుసు ఉన్న ఈ బ్యూటీ అనవసరమైన విషయాల్లో తలదూర్చి ఇబ్బందులు కొనితెచ్చిుకొన్న సందర్భాలు ఎక్కువే. అయితే ఇటీవల జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రస్తావించిన అనేక విషయాలు, ఆమె వ్యక్తిగత, ప్రొఫెషనల్ సంగతులు ఏమిటంటే...

మత్తెక్కించే కళ్లతో నభ నటేష్.. అందాల ఆరబోతలో టాప్

తమిళ, తెలుగు సినీ రంగాల్లో

తమిళ, తెలుగు సినీ రంగాల్లో

ప్రియాంక చోప్రా సోదరిగా 2005లో మీరా చోప్రా అంబే అరుయిరే చిత్రం ద్వారా తమిళ సినిమా రంగంలో అడుగుపెట్టారు. ఆ తర్వాత పవన్ కల్యాణ్ నటించిన బంగారం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. అనంతరం వాన, మారో, గ్రీకు వీరుడు, మొగిలిపువ్వు లాంటి చిత్రాల్లో కనిపించారు. అయితే ఈ భామ తమిళ చిత్రాలపైనే ఫోకస్ పెట్టడం ద్వారా తెలుగులో అంతగా రాణించలేకపోయారు.

ఎన్టీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు

ఎన్టీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు

ఇక ఇటీవల ఎన్టీఆర్ ఎవరో నాకు తెలియరు.. నాకు తెలిసిన సూపర్ స్టార్ మహేష్‌బాబు అంటూ ట్విట్టర్‌లో కామెంట్ చేయడంతో యంగ్ టైగర్ ఫ్యాన్స్ మండిపడ్డారు. నిన్ను రేప్ చేస్తామంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. దాంతో ఆమె జాతీయ మీడియాలో ఈ అంశాన్ని లేవనెత్తడంతో పెద్ద దుమారమే రేగింది.

ప్రియాంక చోప్రా వల్ల ఆఫర్లు రాలేదు

ప్రియాంక చోప్రా వల్ల ఆఫర్లు రాలేదు

ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో సినిమా పరిశ్రమలో తన కష్టాల గురించి మీరా చోప్రా చెప్పుకొంటూ.. నేను బాలీవుడ్‌లో అడుగుపెట్టినపుడు ప్రియాంక చోప్రా సోదరి ఇండస్ట్రీకి వస్తున్నదనే వార్తలు కనిపించాయి. అయితే నా సోదరికి నాకు పెద్దగా పోల్చి చూడకపోవడం నాకు కొంత సానుకూలంగా మారింది. ప్రియాంక వల్ల నాకు ఆఫర్లు రాలేదు. వచ్చిన అవకాశాలన్నీ నాకు నేనుగా సంపాదించుకొన్నవే అని మీరా చోప్రా తెలిపారు.

నా అక్క వల్ల నాకు మేలు జరగలేదు

నా అక్క వల్ల నాకు మేలు జరగలేదు

నా కెరీర్‌కు సంబంధించి ప్రియాంక చోప్రా వల్ల నాకు అదనంగా ఎలాంటి లాభం జరగలేదు. ఆమె పేరు వల్ల నేను చాలా మందికి తెలిసిపోయాను. దాంతో నా గురించి ఆరా తీయడం ప్రారంభించారు. సినిమా ఫ్యామిలీ నుంచి వచ్చిందని, ప్రియాంక సోదరి అని ఎవరూ అవకాశాలు ఇట్టే ఇవ్వలేదు. ఆమె వల్ల నాకు కొన్నిసార్లు ఇబ్బంది కూడా అయిది అని మీరా చోప్రా పేర్కొన్నారు.

Recommended Video

Harbhajan Singh Says Yes For Ranveer Singh, Geeta Basra Disagrees
ప్రియాంక నుంచి ప్రోత్సాహం దక్కలేదు

ప్రియాంక నుంచి ప్రోత్సాహం దక్కలేదు

ఇండస్ట్రీలో నటిగా నిలదొక్కుకోవడానికి చాలా కష్టాలు పడ్డాను. ప్రతీ సినిమా ఒక్క అగ్ని పరీక్షగా మారింది. ప్రతీ ఆఫర్‌ను నా కెరీర్‌కు ఉపయోగపడేలా మలచుకొన్నాను. ప్రియాంక చోప్రా సోదరిగా నాకు ఎలాంటి ప్రోత్సాహం దక్కలేదు. నా అంతట నేను నా అవకాశాలను వెతుకొన్నాను అని చెప్పారు. ప్రస్తుతం ఆమె నటించిన టాటూ మర్డర్స్ అనే వెబ్ సిరీస్ డిస్నీ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతున్నది. ఈ వెబ్ సిరీస్‌లో ఏడు ఎపిసోడ్స్ ఉన్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X