నిస్సహాయతను చూసి గుండె బద్దలైంది.. సుశాంత్ తండ్రి ఎమోషనల్ వీడియోపై హీరోయిన్ కామెంట్

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం నేటికి ఓ మిస్టరీగానే ఉంది. మొదట ఆత్మహత్య అని అందరూ ఫిక్స్ అయ్యారు. అయితే రోజులు గడుస్తున్న కొద్దీ కొత్త వాదనలు వినిపిస్తున్నాయి. సుశాంత్‌ది హత్య అని వైద్య నిపుణులు వీడియోలతో సహా వివరిస్తున్నారు. వాటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్నాయి. మరోవైపు సుశాంత్ తండ్రి కేకే సింగ్ రియా చక్రవర్తిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు.

అనూహ్యమైన మార్పులు..

అనూహ్యమైన మార్పులు..

సుశాంత్ జూన్ 14న తన నివాసంలోనే ఉరి వేసుకుని మరణించాడు. మొదటగా అందరూ ఆత్మహత్య అనే భావించారు. నెపోటిజం, మూవీ మాఫియా వల్లే డిప్రెషన్‌కు లోనయ్యాడని, అందుకే ఆత్మహత్య చేసుకున్నాడని అందరూ అనుకున్నారు. ఈ క్రమంలో కరణ్ జోహర్, సల్మాన్ ఖాన్ వంటి సినీ పెద్దలను అందరూ ఘోరంగా ట్రోల్ చేశారు. ఇక అలా నెల రోజులు గడిచాక కేసులో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకున్నాయి.

సుశాంత్ తండ్రి ఆరోపణలు..

సుశాంత్ తండ్రి ఆరోపణలు..

సుశాంత్ తండ్రి కే కే సింగ్ రియా చక్రవర్తిపై ఆరోపణలు చేయడం, పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కొత్త మలుపు తిరిగింది. సుశాంత్ ఆస్తులను కాజేయడం, దాదాపు 15 కోట్లు దోపిడి చేయడం, మందులు డోస్ పెంచి ఇవ్వడం వంటి వాటితో కేకే సింగ్ ఫిర్యాదు చేయడంతో అందరూ షాక్ అయ్యారు. అప్పటి నుంచి పాట్నా కేంద్రంగా సుశాంత్ కేసు వేగం పుంజుకుంది.

 తప్పించుకుని తిరుగుతున్న రియా..

తప్పించుకుని తిరుగుతున్న రియా..

కేకే సింగ్ పాట్నాలో ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేపడుతున్న పోలీసులకు ముంబై పోలీసులు సహకరించకపోవడం మరింత ఆశ్చర్యకరంగా మారింది. పాట్నా పోలీసుల నుంచి ఇప్పటికీ రియా తప్పించుకుని తిరుగుతోంది. తాజా కేకే సింగ్ ఓ వీడియోను విడుదల చేశాడు.

Recommended Video

Meera Chopra Vs Jr NTR Fans Issue Maybe A Political Game
గుండె బద్దలైంది..

గుండె బద్దలైంది..


ఫిబ్రవరిలోనే తన కొడుకు పరిస్థితి బాలేదని ముంబై పోలీసులకు చెప్పినా పట్టించుకోలేదని వాపోయాడు. ఈ వీడియోపై మీరాచోప్రా స్పందిస్తూ.. ‘74 ఏళ్ల తండ్రి తన కొడుకు మృతి పట్ల తీవ్రంగా దు:ఖిస్తున్నాడు. అతను తన కొడుకును ఎప్పటికీ తిరిగి పొందలేడు. అతను కేవలం న్యాయం కావాలని కోరుతున్నాడు. ఈ నిస్సహాతను చూస్తే నా హృదయం బద్దలవుతోంది. వారి ఈగోలను పక్కన పెట్టి అందరూ కలిసికట్టుగా ఎందుకు పని చేయలేకపోతున్నార'ని వాపోయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X