పొట్ట నింపుకోవడం కోసం ఒళ్లు అమ్ముకోవడం.. జీవన పోరాటం బాధాకరం.. మీరా చోప్రా ఎమోషనల్

మీరా చోప్రా అంటే ఒకప్పుడు సినిమాలు గుర్తుకు వచ్చేవేమో గానీ.. ప్రస్తుతం మాత్రం వివాదాలే గుర్తుకు వస్తాయి. ఎన్టీఆర్ ఫ్యాన్స్‌-మీరా చోప్రా వివాదంపై దేశం మొత్తం తిరిగి చూసింది. ఈ విషయం రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు, జాతీయ మహిళా కమిషన్ దృష్టికి కూడా తీసుకువెళ్లింది. మీరా చోప్రా ఈ ఘటనతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. ఇక అప్పటి నుంచి మీరా చోప్రా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ వస్తోంది. తాజాగా ఆమె సెక్స్ వర్కర్ల గురించి చేసిన కామెంట్స్ కదిలించేలా ఉన్నాయి. అవేంటో ఓసారి చూద్దాం.

సోషల్ మీడియాలో యాక్టివ్..

సోషల్ మీడియాలో యాక్టివ్..

మీరా చోప్రా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ప్రతీ విషయంపై స్పందిస్తూ ఉంటోంది.తాజాగా చిత్ర పరిశ్రమలో షూటింగ్లకు అనుమతి ఇవ్వడాన్ని సైతం తప్పుబట్టింది. కరోనా ఇంతలా విజృంభిస్తూ ఉంటే షూటింగ్‌లకు ఎందుకు అనుమతి ఇచ్చారని ప్రశ్నించింది. చిన్న చిన్న ప్రొడక్షన్ కంపెనీలకు జాగ్రత్తలు తీసుకోవడం భారంగా మారుతుందని చెప్పుకొచ్చింది.

ఇండియాలో అలానే..

ఇండియాలో అలానే..

మీరా చోప్రాకు తాజాగా ఓ నెటిజన్ ఈ రకంగా ప్రశ్నించారు. ‘ఓ కమెడియన్‌కు వచ్చిన రేప్ బెదిరింపుల మీద మీరెందుకు నోరు విప్పడం లేదు మీరా చోప్రా?.. ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటారని చెబుతారుగా' అని సదరు నెటిజన్ ప్రశ్నించారు. ‘జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా నన్ను రేప్ చేస్తామని బెదిరించారు కానీ అలాంటిదేమీ జరగలేదు. దీన్ని బట్టి ఇండియాలో మహిళల రక్షణ సీరియస్‌గా తీసుకోలేదనిపిస్తోంది. జనాలు ఏం వాగుతున్నారో కూడా ఈ ట్విట్టర్ పట్టించుకోద'ని ఫైర్ అయింది.

కమాతిపుర సెక్స్ వర్కర్లు..

కమాతిపుర సెక్స్ వర్కర్లు..

ప్రస్తుతం నెలకొన్ని ఉన్న పరిస్థితుల్లో ముంబైలోని సెక్స్ వర్కర్లు దారుణమైన స్థితిలో ఉన్నారు. వారికి ఆదాయం, ఆహారం వంటివి లేవని, ప్రభుత్వం కూడా ఎలాంటి సాయం అందించడం లేదని నిర్మాత, సోషల్ యాక్టివిస్ట్ అశోక్ పండిత్ సోషల్ మీడియాలో పేర్కొన్నాడు.

Recommended Video

Meera Chopra Vs Jr NTR Fans Issue Maybe A Political Game
కడపు కోసం ఒళ్లు..

కడపు కోసం ఒళ్లు..

అశోక్ పండిట్ చేసిన ట్వీట్‌పై మీరా చోప్రా స్పందిస్తూ.. ‘కమాతిపుర అనే సిరీస్‌లోనే నేను నటించాను. ప్రతీసారి నేను అక్కడికి వెళ్లినప్పుడు, సెక్స్ వర్కర్లతో మాట్లాడినప్పుడు వారి జీవితంతో చేసే పోరాటం చూసి ఎంతగానో బాధపడ్డాను. వారు తమ పొట్టను నింపుకోవడం కోసం ఒళ్లు అమ్ముకుంటున్నారనేది అత్యంత బాధకరమైన విషయం' అని ఎమోషనల్ అయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X