#మీటూ: హీరోయిన్‍ బండారం బయట పెట్టిన పోలీసులు, దర్శకుడు అమాయకుడే!

#మీటూ ఉద్యమం బాలీవుడ్లో సంచలనం రేకెత్తించిన సంగతి తెలిసిందే. పలువురు ప్రముఖుల మీద సెక్సువల్ హరాస్మెంట్ ఆరోపణలు వెళ్లువెత్తాయి. అందులో టాప్ డైరెక్టర్లలో ఒకరైన సుభాష్ ఘాయ్ పేరు కూడా ఉంది. మోడల్, నటి కేట్ శర్మ మీటూ ఉద్యమంలో భాగంగా సుభాష్ ఘాయ్ పేరు బయట పెట్టడంతో పాటు అతడు తనతో సెక్సువల్ మిస్‌కండక్ట్‌కు పాల్పడినట్లు ఆరోపించారు. ఈ విషయమై ముంబైలోని వెర్సోవా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

అయితే ఓ ఆంగ్లపత్రిక కథన ప్రకారం... కేట్ శర్మ ఆరోపణల మీద విచారణ జరిపిన పోలీసులు అతడికి క్లీన్ చిట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. సుభాష్ ఘాయ్ ఆమెతో సెక్సువల్ మిస్ కండక్ట్‌కు పాల్పడినట్లు ఎలాంటి ఆధారాలు లేవని తేల్చారట.

 ఆ ఫోటోస్ ఉపయోగించి బద్నాం చేసింది

ఆ ఫోటోస్ ఉపయోగించి బద్నాం చేసింది

బర్త్ డే వేడుక సందర్భంగా సుభాష్ ఘాయ్ ఆఫీసులో ఆయనతో కలిసి సన్నిహితంగా దిగిన ఫోటోస్ కేట్ శర్మ ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేసిందని, వాటి ద్వారా అతడిని బద్నాం చేయడంతో పాటు ఇండస్ట్రీలో పాపులర్ అయ్యేందుకు ప్రయత్నించిందని పోలీసులు తేల్చారు.

 అందుకే కేసు వెనక్కి తీసుకుంది

అందుకే కేసు వెనక్కి తీసుకుంది

తాను చేసిన ఆరోపణల్లో బలం లేక పోవడం, అవి నిజమని నిరూపించడానికి ఎలాంటి ఆధారాలు లేక పోవడంతో కేసు తనకు ఎదురు తిరుగుతుందని ముందే భావించిన కేట్ వర్మ తన తల్లి ఆరోగ్యం బాగాలేదనే సాకుతో సుభాష్ ఘాయ్ మీద పెట్టిన కేసును వెనక్కి తీసుకుందని పోలీసులు తెలిపారు.

ఆమెను ఊరికే వదలను అని చెప్పిన సుభాష్ ఘాయ్

ఆమెను ఊరికే వదలను అని చెప్పిన సుభాష్ ఘాయ్

తనపై తప్పుడు ఆరోపణలు చేయడంతో పాటు తన పరువు ప్రతిష్టలకు భంగం కలిగించిన కేట్ శర్మను ఊరికే వదలను అని, ఆమెపై చట్టపరమైన చర్యలు తీసుకోబోతున్నట్లు సుభాష్ ఘాయ్ స్పష్టం చేశారు.

 కేట్ శర్మ తీవ్ర ఆరోపణలు ఇవే

కేట్ శర్మ తీవ్ర ఆరోపణలు ఇవే


సుభాష్ ఘాయ్ మీద కేట్ శర్మ తీవ్రమైన ఆరోపణలు చేశారు. తనతో మసాజ్ చేయించుకునేవాడని, పెద్దాయనకదా అని మాట కాదనలేక కొన్ని సార్లు చేశాను. మసాజ్ తర్వాత చేతులు కడుక్కునేందుకు బాత్రూంకు వెళితే తన వెంటే వచ్చేవాడని, తన చేయి పట్టుకుని ఒకరాత్రి గడిపాలని బలవంతం చేసేవాడని, సినిమా చర్చల పేరుతో బెడ్రూంలోకి తీసుకెళ్లేవాడని, ముద్దు పెట్టేందుకు ప్రయత్నించే వాడని కేట్ శర్మ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X