#మీటూ: రేప్ చేయడానికి ప్రయత్నించాడు... అలియా భట్ తల్లి సంచలనం!

దేశ వ్యాప్తంగా ఉధృతంగా సాగుతున్న #మీటూ ఉద్యమంలో మరో సెలబ్రిటీ చేరారు. నటి, దర్శకురాలు సోని రజ్దాన్ తాను సైతం లైంగిక వేధింపులు ఎదుర్కొన్నట్లు వెల్లడించారు. ఆంగ్ల మీడియాతో సోని రజ్దాన్ మాట్లాడుతూ... సినిమా షూటింగులోనే తనను ఒక వ్యక్తి రేప్ చేయడానికి ప్రయత్నించారని తెలిపారు. అయితే అతడి పేరు బయట పెట్టడానికి ఆమె ఇష్టపడలేదు. సోనీ రజ్దాన్ మరెవరో కాదు ప్రముఖ ఫిల్మ్ మేకర్ మహేష్ భట్ భార్య, బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ తల్లి.

ఎప్పుడు జరిగిందంటే...

ఎప్పుడు జరిగిందంటే...

నేను సినిమా అవకాశాల కోసం ఎదురు చూస్తున్న సమయంలో ఎలాంటి లైంగిక వేధింపులు ఎదురు కాలేదు. అయితే ఓ సారి ఫిల్మ్ షూటింగ్ సమయంలో ఊహించని సంఘటన ఎదురైంది. ఒక వ్యక్తి నన్ను రేప్ చేయడానికి ప్రయత్నించాడు. అదృష్టవశాత్తు అతడు సక్సెస్ కాలేకపోయాడు అని సోని రజ్దాన్ తెలిపారు.

అందుకే బయట పెట్టలేదు

అందుకే బయట పెట్టలేదు

ఆ సమయంలో అతడి పేరు బయట పెట్టలేదు. ఎందుకంటే అతడికి పెళ్లయి ఫ్యామిలీ ఉంది, చిన్న పిల్లలు ఉన్నారు. అపుడు నేను నోరు విప్పి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. అతడు సమస్యలో ఇరుక్కుని కుటుంబం ఇబ్బందుల్లో పడి ఉండేది. ఇది ఆలోచించే నేను మౌనంగా ఉండిపోయాను అని సోనీ రజ్దాన్ తెలిపారు.

పరిస్థితి కంట్రోల్ చేశాను

పరిస్థితి కంట్రోల్ చేశాను

ఆ సమయంలో ఏర్పడ్డ పరిస్థితి కంట్రోల్ చేయగలిగాను. అతడు అలా ఎందుకు ప్రవర్తించాడో తెలియదు. కానీ ఏమీ జరుగకుండా అడ్డుకోగలిగాను. ఇపుడు మీటూ ఉద్యమం జరుగుతోంది కాబట్టి ఈ విషయం బయట పెట్టినట్లు సోనీ రజ్దాన్ తెలిపారు.

అలోక్‌నాథ్ గురించి

అలోక్‌నాథ్ గురించి

అనేక మంది మహిళలను లైంగిక వేధించినట్లు, వింటా నందాపై ఇరవై ఏళ్ల క్రితం రేప్ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నటుడు అలోక్ నాథ్ గురించి సోనీ రజ్దాన్ స్పందించారు. అతడు వేధింపులకు పాల్పడ్డట్లు విన్నాను. మద్యం సేవిస్తే అతడి ప్రవర్తన తేడాగా ఉండటం చూశాను అని తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X