twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    #మీటూ: మీ వద్ద ఆధారాలున్నాయా? నోటికాడి కూడు లాగేస్తారా? ఫ్యామిలీ పరిస్థితేంటి?

    |

    Recommended Video

    #MeToo : Sonu Nigam Backs Anu Malik, Where Is The Proof? | Filmibeat Telugu

    ప్రముఖ బాలీవుడ సింగర్ సోనూ నిగమ్ #మీటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలీవుడ్ మ్యూజిక్ కంపోజర్ అను మాలిక్‌కు మద్దతుగా నిలిచారు. ఓ వైపు లేడీ సింగర్లు సోనా మహాపాత్ర, శ్వేతా పండిత్‌, మరో ఇద్దరు సింగర్స్ అను మాలిక్ తమను లైంగికంగా వేధించాడని ఆరోపణలు చేస్తుంటే.... అతడిని సోను నిగమ్ వెనకేసుకురావడం చర్చనీయాంశం అయింది.

    నాకు #మీటూ సబ్జెక్ట్ గురించి మాట్లాడటానికి ఇంతకాలం అవకాశం రాలేదు. ఇక్కడ కొందరు పవర్ ఎలా దుర్వినియోగం చేస్తారు అనడానికి నేను ప్రత్యక్ష సాక్షి. పదేళ్ల క్రితమే నేను #మీటూ గురించి మాట్లాడాను. ఓ జర్నలిస్ట్ నన్ను హరాస్ చేశారు. నాతో పని చేస్తే ఆత్మహత్య చేసుకుంటూ నంటూ ఓ దర్శకుడిని ఆ జర్నలిస్ట్ బెదిరించారు.

    ఆధారాలు ఉన్నాయా?

    ఆధారాలు ఉన్నాయా?

    ఓ ఇంటర్వ్యూలో సోను నిగమ్ మాట్లాడుతూ... అను మాలిక్ నన్ను కలిశారు అని మీరు అంటున్నారు. మీ వద్ద ఎలాంటి ప్రూఫ్ లేకుండా అతడిని నిందిస్తున్నారు. ఆయన కూడా మాట్లాడాలంటే ఎన్నో మాట్లాడవచ్చు. కానీ ఆయన అలా చేయడం లేదు. మీరు నాతో మిస్ బిహేవ్ చేశారని నేను అంటే...అందుకు సాక్ష్యం ఏమిటి? అని మీరు నన్ను ప్రశ్నిస్తారు. కానీ ఇక్కడ ఎలాంటి ప్రూఫ్ లేదు.

    ప్రూఫ్ లేకుండా అతడి నోటికాడి కూడు లాగేస్తారా?

    ప్రూఫ్ లేకుండా అతడి నోటికాడి కూడు లాగేస్తారా?

    అందరూ ఇక్కడ ఎలాంటి ప్రూఫ్ లేకుండా ఆరోపణలు చేసిన వారిని గౌరవిస్తున్నారు. ఎలాంటి ఆధారాలు లేనపుడు అతడిపై ఎలా బ్యాన్ విధిస్తారు? అతడి నోటి దగ్గర కూడును ఎలా లాగేస్తారు? ఆయన ఫ్యామిలీని ఎలా టార్చర్ పెడతారు? అంటూ సోను నిగమ్ ప్రశ్నించారు

    మరొకరి జీవితాన్ని ఇలా చేయడం తగదు

    మరొకరి జీవితాన్ని ఇలా చేయడం తగదు

    మరొకరి జీవితాన్ని ఈ విధంగా చేసే హక్కు మనకు ఎవరు ఇచ్చారు? ప్రూఫ్ ఉంటే చూపండి... నాకు ఇద్దరు సిస్టర్స్ ఉన్నారు. ఇలాంటివి జరిగినపుడు నేను వారి పక్షాన నిలుస్తాను. అలా అని మరొకరికి పని లేకుండా చేసే ప్రయత్నం అయితే చేయను... అని సోను నిగమ్ అన్నారు.

    అతడి ఫ్యామిలీ శిక్ష అనుభవించాలా?

    అతడి ఫ్యామిలీ శిక్ష అనుభవించాలా?

    టార్చర్, హరాస్మెంట్ ప్రతి చోటా ఉంటాయి. కార్పొరేట్ ప్రపంచంలో కూడా ఇలాంటివి ఉంటాయి. నువ్వు అతడిపై ఆరోపణలు చేయవచ్చు, అతడు సిగ్గు పడేలా చేయవచ్చు...కానీ అతడి ఫ్యామిలీ కూడా శిక్ష అనుభవించేలా చేయవద్దు. ముందు ఆధారాలు చూపండి.. అని సోను నిగమ్ అన్నారు.

    English summary
    Sonu Nigam said at Agenda Aaj Tak, "I haven't had enough opportunity to speak on this subject. I myself am a witness to how power is misused. I said #MeToo ten years ago, when a journalist kept harassing me. He had told a director that if he [the director] worked with me, he [the journalist] would kill himself." Sonu defended Anu Malik on the platform, saying, "If you say, 'Anu Malik met me this morning', that's fine. You accused him without any proof; let's accept that too. Had he [Anu Malik] wanted to say anything, he could have said a lot. But he did not. If I say that you misbehaved with me, you will ask me for proof. But there's no proof, right? Despite that, people are respecting the accusers, who are tarnishing Anu Malik's name. But how can you ban him? How can you snatch his bread and butter? How can you torture his family?"
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X