Bigg Boss: బిగ్ బాస్ షోలోకి పోర్న్ స్టార్.. అన్ని కోట్ల రూపాయల ఆఫర్.. వచ్చిందంటే రచ్చ ఖాయం
బిగ్ బాస్.. దేశంలోని అన్ని భాషల్లోకెల్లా సక్సెస్‌ఫుల్ అయిన షో. బిగ్ బ్రదర్ అనే ఇంగ్లీష్ రియాలిటీ షో ఆధారంగా రూపొందిన దీనిని మొదటిగా 2006లో హిందీలో ప్రారంభించారు. ఏమాత్రం అంచనాలు లేకుండా మొదలైనప్పటికీ.. చాలా తక్కువ సమయంలోనే ప్రేక్షకుల మన్ననలు అందుకుని సూపర్ హిట్ అయింది. అలా అలా ఇప్పుడు దేశంలోని చాలా భాషల్లో ఈ రియాలిటీ షో ప్రసారం అవుతోంది. ఈ క్రమంలోనే ఇప్పుడు హిందీలో 17వ సీజన్‌ను మొదలు పెట్టబోతున్నారు. ఇందులోకి ఓ పోర్న్ స్టార్ కూడా ఎంట్రీ ఇస్తున్నట్లు తెలిసింది. ఆ వివరాలు మీకోసమే!
పదహారు.. సూపర్ హిట్:అన్ని భాషలతో పోలిస్తే హిందీలో ప్రసారం అయ్యే బిగ్ బాస్ షోకు ఆదరణ ఎక్కువగా లభిస్తోంది. అందుకే ఈ షో ఏకంగా పదహారు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఇవన్నీ ఒకదానికి మించి ఒకటి అన్నట్లుగా సూపర్ హిట్ అయ్యాయి. ఇక, ఈ షోను కండల వీరుడు సల్మాన్ ఖాన్ హోస్ట్ చేస్తున్నాడు. అంతేకాదు, ఈ షో సెట్‌ను అతడి ఫాంహౌస్‌లోనే ఏర్పాటు చేస్తున్నారు.

17వ సీజన్ కూడా రెడీ:బిగ్ బాస్ హిందీలో ప్రతి ఏడాది ఒక సీజన్ ఉండేలా నిర్వహకులు ప్లాన్ చేస్తున్నారు. ఇలా పదహారు సీజన్లు ముగిసిన తర్వాత ఇప్పుడు 17వ దాన్ని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఇప్పటికే దీనికి సంబంధించిన వర్క్‌ను సైతం మొదలు పెట్టేశారు. సెట్ వర్క్, కంటెస్టెంట్ల ఎంపిక తదితర అంశాలపై వాళ్లు పనులు సాగిస్తున్నారు.

17మంది.. 135 రోజులు:బిగ్ బాస్ హిందీ 17వ సీజన్ జూలై చివరి వారంలో కానీ, ఆగస్టు మొదటి వారంలో కానీ ప్రారంభం అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులోకి గతంలో మాదిరిగానే ఏకంగా 17 మంది కంటెస్టెంట్లు ఎంట్రీ ఇవ్వబోతున్నారట. అంతేకాదు, ఈ సీజన్ కూడా 135 రోజుల పాటు సాగబోతుందని తెలిసింది. దీంతో ఈ సీజన్‌పైన కూడా అంచనాలు భారీగా పెరుగుతూనే ఉన్నాయి.

వాళ్లంతా కన్ఫార్మ్‌గానే:బిగ్ బాస్ 17వ సీజన్‌కు సంబంధించి నిర్వహకులు ఇప్పటికే 21 మంది వరకూ కంటెస్టెంట్లను ఫైనల్ లిస్టులో చేర్చినట్లు తెలిసింది. అందులో సురభీ చందన, శివిన్ నారంగ్, కనిక మాన్, మధురాక్షి ముండాల్, సురభీ జ్యోతి, కైనాత్ అరోరా, షాహీర్ షేక్, నియా శర్మ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీళ్లతో పాటు కొందరు మాజీ కంటెస్టెంట్ల పేర్లు సైతం హైలైట్ అవుతున్నాయి.

బిగ్ బాస్‌లో పోర్న్ స్టార్:మరికొద్ది రోజుల్లోనే ఎంతో గ్రాండ్‌గా ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ 17వ సీజన్‌లోకి ఫేమస్ పోర్న్ స్టార్ మియా ఖలీఫా కూడా ఎంట్రీ ఇస్తుందని తాజాగా ఓ న్యూస్ వైరల్ అవుతోంది. అరబ్ కంట్రీకి చెందిన ఈ భామ.. పోర్న్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి ఫేమస్ అయింది. ఇప్పుడు ఆ ప్రొఫెషన్‌కు దూరంగా ఉంటుండడం వల్లే బిగ్ బాస్ నిర్వహకులు ఆమెను సంప్రదించారని టాక్.

కొన్ని కోట్లు ఆఫర్ చేసి:బిగ్ బాస్ 17వ సీజన్‌లో పాల్గొనేందుకు గానూ షో నిర్వహకులు మియా ఖలీఫాకు దాదాపు 2 - 2.50 కోట్ల రూపాయలు ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకూ ఎవరికీ ఇవ్వనంత ఎమౌంట్‌ను ఆమెకు ఇచ్చేందుకు బిగ్ బాస్ టీమ్ ముందుకు వచ్చిందని అంటున్నారు. అయితే, ఇందులోకి ఎంట్రీ ఇచ్చేందుకు మాత్రం మియా ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదన్న టాక్ వినిపిస్తోంది.


Click it and Unblock the Notifications











